google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: సెప్టెంబర్ 2016

30, సెప్టెంబర్ 2016, శుక్రవారం

నాగ్ మరో ప్రయోగం



 మొదటినుంచీ ప్రయోగాత్మక పాత్రలకు వెనుకాడని హీరో నాగార్జున మరోసారి పూర్తిస్థాయి అంధుడిగా నటించడానికి సిద్దమవుతున్నాడు.

మళయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన 'ఓప్పం' రీమేక్ లో నటింపజేయడానికి ఓవర్సీస్ నెట్ వర్క్ సెంటర్ వాళ్ళు నాగార్జునతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది.

మళయాళంలో సూపర్ హిట్టైన ఈ 'ఓప్పం" దర్శకుడు ప్రియదర్శన్ తెలుగువారికి సుపరిచితుడే. ఇంతకుముందు తెలుగులో నాగ్ హీరోగా నటించిన 'నిర్ణయం' సినిమాకికూడా ప్రియదర్శనే దర్శకుడు.

అంధుడైన హీరో ఓ హత్యోదాంతాన్ని ఎలా ఛేధించాడు, హంతకుడ్ని చట్టానికి ఎలా అప్పగించాడు అనే ఆసక్తికరమైన కథనంతో ఇది తెరకెక్కింది.

ఊపిరి మూవీలో వీల్ చైర్ కి అంకితమైన పాత్రలో ప్రేక్షకుల్ని మెప్పించిన నాగార్జున,మరోసారి   అంధుడిగా నటించి తన ప్రత్యేకతను చాటుకోనున్నాడు.

29, సెప్టెంబర్ 2016, గురువారం

గూగుల్ ఫిక్సెల్


‘నెక్సస్‌’ తయారీదారు గూగుల్‌ వచ్చేనెల కొత్త మోడల్ ఫోన్లను మార్కెట్‌లోకి ప్రవేశపెడుతున్నట్టు తెలుస్తోంది..
ఐతే ఈ మోడళ్ళ పేర్ల గురించి అధికారికమైన సమాచారం ఏదీ లేదు. కానీ, ఊహిస్తున్నదాని బట్టి,  ఈ ఫోన్‌కు ‘పిక్సల్‌' అనే పేరు పెడుతున్నట్టు అనుకుంటున్నారు..

ఇందులో విశేషం ఏమిటంటే,ఇది గూగుల్‌ స్వయంగా డిజైన్‌ చేసిన ఫోన్‌ కావడం .

గతంలో గూగుల్‌ నెక్సస్‌ డిజైన్‌ మొదలైనవి  ఎల్‌జీ, శామ్‌సంగ్‌ తయారుచేసేవి. ఇప్పుడు వస్తున్న కొత్త ఫోన్‌ను హెచ్‌టీసీ రూపొందిస్తున్నా డిజైన్‌, ఓఎస్‌, సాఫ్ట్‌వేర్‌ తదితర అంశాలు మాత్రం గూగుల్‌ ఆలోచనల మేరకే వుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది.

 పిక్సిల్ ఇలా వుండొచ్చని అంచనా వేస్తున్నారు.

 ఈ ఫోన్‌  ఓ యస్ పేరు ‘ఆండ్రోమేడా’
 ఐదు అంగుళాల టచ్ స్క్రీన్,
 1080 రిజల్యూషన్‌తో క్వాడ్‌ హెచ్‌డీ డిస్‌ప్లే,
 ముందువైపు 8 ఎంపీ కెమెరా, వెనుకవైపు 12 ఎంపీ కెమెరా,
 3450 ఎంఏహెచ్‌ బ్యాటరీ ,
 4 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంటర్నెల్‌ మెమొరీ ,
 ధర సుమారు రూ. 40 వేల వరకూ వుండొచ్చు.

బాహుబలి @ చింతపల్లి



బాహుబలి సినిమాలో, చేత్తో కన్నబిడ్డను పైకెత్తిపట్టుకుని, తనుమాత్రం ప్రాణత్యాగం చేసిన శివగామినిని చూసి, అబ్బురపడని తెలుగుప్రేక్షకులు ఎవరూ వుండరు.

అలాంటి అలాంటిదే, నిజజీవితంలో జరిగిన ఈ సంఘటన సామాన్య ప్రజల దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది.

విశాఖజిల్లా, చింతపల్లికి చెందిన ఓవ్యక్తి తనబిడ్డకు ఆరొగ్యం బాగాలేకపోవడంతో,  చికిత్సకోసం ఒక చేత్తో బిడ్డను పైకెత్తుకుని, ఉదృతంగా ప్రవహిస్తున్న కుడుమసారి వాగుని మెడలోతు నీళ్ళలో ఈదుకుంటూ ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు.

మంగళవారం జరిగిన ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

కాగా ఈ సంఘటన గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, కుడుమసారి వాగుపై వంతెన నిర్మాణం కోసం సంబంధిత అధికారుల్ని హుటాహుటిన ఆదేశించినట్టు తెలుస్తోంది.

దశాబ్దాలుగా దాదాపు 12 గ్రామాలకు చెందిన ప్రజలు పడుతూన్న వెతలకు త్వరలో ముగింపు దొరుకుతుందని ఆశిద్దాం.