google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: బాహుబలి @ చింతపల్లి

29, సెప్టెంబర్ 2016, గురువారం

బాహుబలి @ చింతపల్లి



బాహుబలి సినిమాలో, చేత్తో కన్నబిడ్డను పైకెత్తిపట్టుకుని, తనుమాత్రం ప్రాణత్యాగం చేసిన శివగామినిని చూసి, అబ్బురపడని తెలుగుప్రేక్షకులు ఎవరూ వుండరు.

అలాంటి అలాంటిదే, నిజజీవితంలో జరిగిన ఈ సంఘటన సామాన్య ప్రజల దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది.

విశాఖజిల్లా, చింతపల్లికి చెందిన ఓవ్యక్తి తనబిడ్డకు ఆరొగ్యం బాగాలేకపోవడంతో,  చికిత్సకోసం ఒక చేత్తో బిడ్డను పైకెత్తుకుని, ఉదృతంగా ప్రవహిస్తున్న కుడుమసారి వాగుని మెడలోతు నీళ్ళలో ఈదుకుంటూ ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు.

మంగళవారం జరిగిన ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

కాగా ఈ సంఘటన గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, కుడుమసారి వాగుపై వంతెన నిర్మాణం కోసం సంబంధిత అధికారుల్ని హుటాహుటిన ఆదేశించినట్టు తెలుస్తోంది.

దశాబ్దాలుగా దాదాపు 12 గ్రామాలకు చెందిన ప్రజలు పడుతూన్న వెతలకు త్వరలో ముగింపు దొరుకుతుందని ఆశిద్దాం. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి