google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: నవంబర్ 2016

24, నవంబర్ 2016, గురువారం

మోదీకి మాయావతి సవాల్!



పెద్ద నోట్ల రద్దుపై 92 శాతం ప్రజలు మద్దతిచ్చారని ప్రధాని చెబుతున్నారని, అదే నిజమయితే లోక్‌సభను తక్షణం రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళాలని, అప్పుడు మోదీకి మద్దతుగా ఎంతమంది ఉన్నారో తేలిపోతుందని బీ.యస్.పీ నేత మాయవతి సవాల్‌ విసిరింది.

ముందుగా ప్రణాళిక లేకుండా పెద్దనోట్ల రద్దు నిర్ణయం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని  ఆమె ఆరోపించింది.

దమ్ముంటే లోక్ సభను రద్దుచేసి ఎన్నికలకు వెళితే, ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఎంత ఉందో తేలిపోతుంధని ఆమె సవాల్ విసిరింది.

గురువారం రాజ్యసభలో నోట్ల రద్దుపై చర్చలో భాగంగా మాయవతి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేయించిన సర్వే బూటకమని  తీవ్రస్థాయిలో విమర్శించింది.

17, నవంబర్ 2016, గురువారం

టోల్ ప్లాజా చార్జీలు వాయిదా




నోట్ల రద్దు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టోల్ ప్లాజా చార్జీల విషయంలో ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.

ఈ నెల 24 వరకూ జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరాదని తెలిపింది.

 వాస్తవానికి ఇది రేపటితో ముగియాల్సి ఉంది. వాహనదారులు చిల్లర కోసం ఇబ్బందులు పడుతుండటంతో పాటు టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోతుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

నోట్ల రద్దుకి బిల్ గేట్స్ మద్దతు




పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మంచిదేనని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అన్నాడు.

ఈ చర్య వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతుందని అభిప్రాయ పడ్డారు.
‘నీతి లెక్చర్స్ సిరీస్ : పరివర్తన చెందుతున్న భారతదేశం’ అనే అంశంపై జరిగిన సదస్సులో బిల్ గేట్స్ మాట్లాడుతూ రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేయడాన్ని సమర్థించారు.

ఈ పరిణామం వల్ల రాబోయే కొన్ని సంవత్సరాలలో భారతదేశంలో డిజిటల్ లావాదేవీలు పెరుగుతాయన్నారు. డిజిటలైజేషన్ జరిగిన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారతదేశం రూపొందుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు ఆయన మంత్రివర్గ సహచరులు పాల్గొన్నారు.

2.0.. పోస్టర్ విడుదల


 
 సూపర్ హిట్ 'రోబో' సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న 'రోబో 2.0' మూవీ కి సంబందించి పోస్టర్ ను సూపర్‌స్టార్ రజనీకాంత్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

సాంకేతికంగా గొప్ప సెన్సేషన్ క్రియేట్ చేసిన రోబో మూవీ రెండవ భాగం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

దాదాపుగా షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను నవంబర్ 20న విడుదల చేయనున్నారు.

బ్లూ కలర్ బ్యాక్ గ్రౌండ్‌లో ఉన్న ఈ పోస్టర్‌పై  హీరో పేరుతో పాటు విలన్ అక్షయ్ కుమార్ పేరు కూడా వేశారు. 

మల్లికాశెరావత్ పై దాడి!!



ప్రముఖ మోడల్‌, బాలీవుడ్‌ నటి మల్లికా శెరావత్‌పై ఫ్రాన్స్‌లో దాడి జరిగింది.

పారీస్ నగరంలోని ఉన్న ఆమె సొంత అపార్ట్‌మెంట్‌లో ఈ దారుణం జరిగింది. ముసుగులు ధరించిన ముగ్గురు వ్యక్తులు  ఆమెమీద టియర్‌ గ్యాస్‌‌ వదిలి భౌతికదాడి చేశారు.

దాడి జరిగిన సమయంలో ఆమె స్నేహితుడైన ఫ్రెంచి వ్యాపారవేత్త లొవెర్ సిరిల్ అక్సెన్‌ఫాన్స్ కూడా మల్లిక తో వున్నాడు. తీవ్రగాయాలతో ఉన్న మల్లిక ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది.

దొంగతనం చేయడానికి వచ్చి, ఈ ఘాతుకానికి పాల్పడి వుంటారని  పోలీసులు భావిస్తున్నారు. 

మురిక్కాలవల్లో కరెన్సీ కట్టలు!



పెద్దనోట్ల రద్దుతో.. కోట్ల కొద్దీ బ్లాక్ మనీ ఉన్నవారు ఆ డబ్బు ఏంచేయాలో తెలీక, నోట్ల కట్టల్ని చించి పారేస్తున్నారు, మరికొంతమంది గుట్టలుపోసి కాల్చేస్తున్నారు.

 తాజాగా అస్సోంలోని భరాలు నదిలో ఏకంగా రూ.3.5 కోట్ల నగదును ముక్కలుగా చించి పారేశారు. రూ.500, రూ.1000 నోట్ల ముక్కలు నది సమీపంలోని నారెంగి రైల్వేస్టేషన్‌ డ్రెయిన్‌లో కొట్టుకురావడం గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ నోట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఇవి నిజమైనవా కావా.. అన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నట్లు  వెల్లడించారు. 

వీవో సెల్ఫీ కెమెరా




నవతరానికి సెల్ఫీలపై వున్న మోజును దృష్టిలో ఉంచుకుని, ముందువైపు  20 మెగా ఫిక్స్‌ల్‌ కెమెరా గల వీ5 మొబైల్‌  వివో సంస్థ నుంచి ఈ వారం  విడుదల కాబోతుంది.

ఈ మొబైల్‌ లో ప్రత్యేకతలు భారీగానే వుంటాయి.

4 జీబీ ర్యామ్‌, 5.5 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్, 1.8 గిగా హెడ్జ్‌ అక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 652 ప్రాసెసర్‌, 32 జీబీ ఇంటర్నల్ మెమరీ, 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 13 మెగాఫిక్సెల్‌ వెనుక కెమెరా., ఇందులో వుండబోతున్నాయి.

దీని ధర రూ20 వేల వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. 

మోదీ ఓ తుగ్లక్‌!



ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  తుగ్లక్‌లా వ్యవహరిస్తున్నారని పశ్చిమ బెంగాల్‌ సీఎం, మమతా బెనర్జీ విమర్శించింది.

మహ్మద్‌ బిన్‌ తుగ్లక్‌ ఉన్నట్టుండి రాజధానిని మార్చినట్టు, నేడు మోదీ అకస్మాత్తుగా నగదును మార్చేశారని ఆమె దుయ్యబట్టింది.

పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా మమత నేతృత్వంలో పలు విపక్ష పార్టీలు పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీగా వెళ్ళి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలిశారు. రద్దు నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకొనేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

మమత వెంట నేషనల్‌ కాన్ఫరెన్స్‌, ఆప్‌, ఎన్డీయే భాగస్వామి శివసేన నేతలు వున్నారు.
ఎలాంటి ప్రణాళిక లేకుండా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 8 రోజుల్లో దేశానికి రూ.2 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని వారు అన్నారు.

కాగా ఈ ర్యాలీ లో పాల్గొన్న శివసేన మాత్రం.. రద్దు నిర్ణయాన్ని తమ పార్టీ స్వాగతిస్తుందని, ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను పరిష్కరించాలన్నదే తమ డిమాండ్‌ అన్నారు. రాష్ట్రపతికి ఇచ్చిన వినతిపత్రంపై తాము సంతకం చేయలేదని శివసేన స్పష్టం చేసింది.

16, నవంబర్ 2016, బుధవారం

జోడీ అదిరింది!!



చిరంజీవి సినిమాలో కాజల్ ని హీరోయిన్ గా ప్రకటించిన తర్వాత కొద్దిమంది పెదాలు విరిచినా..ఇప్పుడు వాళ్ళిద్దరి జోడీ స్టిల్ బయటకు వచ్చిన తర్వాత నోళ్ళు తెరుస్తున్నారు.

ప్రస్తుతం క్రొయేషియా, స్లోవేకియాలో షూటింగ్ జరుపుకుంటున్న ఖైది నెం 150 కి సంబందించి హీరో హీరోయిన్ల స్టిల్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో మాంచి జోష్ రేపుతోంది.

ఏజ్ తేడా ఏమాత్రం కనిపించకుండా..చార్మింగ్ లుక్ తో వుండటంతో చిరుఫాన్స్ ఖుష్ ఖుష్ అవుతున్నారు

నేనో బిచ్చగత్తెను!!



రూ.1000,500 నోట్ల రద్దు నిర్ణయం తరువాత.. సెలబ్రిటీలు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

కాగా ఈ విషయం పై బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్,  హీరోయిన్ వాణీ కపూర్‌‌‌ను మీడియా ప్రశ్నించగా వారిద్దరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వాణీ కపూర్ మాట్లాడుతూ.. " నేనో బిచ్చగత్తెను.. నా దగ్గర డబ్బుల్లేవ్..!అని చెప్పుకొచ్చింది. అనంతరం రణ్‌వీర్‌ను ప్రశ్నించగా.. "నేను బేఫికర్‌‌ను, నాకు అంత జ్ఞానం లేదు, నిజం చెప్పాలంటే నాకు లెక్కలు రావు.. ఎకనామిక్స్ గురించి అస్సలే తెలియదు.. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై, దేశంలో ఏం జరుగుతోందన్న విషయాలపై మాట్లాడే అర్హత నాకు ఏ మాత్రం లేద"ని  చెప్పుకొచ్చాడు.

వాళ్ళిద్దరు కలిసి నటించిన 'బేఫికర్' ప్రచార కార్యక్రమంలో భాగంగా మీడియా అడిగిన ప్రశనలకు పై విధంగా సమాధానమిచ్చారు. 

జియో మరో సంచలనం..ఫోన్ కేవలం రూ.1000 కే!




10 కోట్ల మందిని  జియో పరిథిలోకి తీసుకురావడమే  లక్ష్యమని ప్రకటించిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ,  తాజాగా మరో సంచలనాత్మక ఆఫర్ ప్రకటించాడు.

కేవలం 1000 రూపాయలకే అపరిమిత వాయిస్, వీడియో కాలింగ్ సదుపాయంతో 4జీ స్మార్ట్‌ఫోన్‌ అందించనున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. ఇది ముఖ్యంగా  గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారుల మనసు గెలుచుకునేందుకే ఎల్‌టీఈ టెక్నాలజీతో ఫీచర్ ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు చెబుతున్నారు.

మార్కెట్లో 4జీ స్మార్ట్ ఫోన్ 3 వేలకే దొరుకుతున్నప్పటికీ... వాటి వల్ల ఉన్న పూర్తి ఉపయోగాలు సరిగా తెలియకపోవడం వలొల స్మార్ట్ ఫోన్ అమ్మకాలు కొన్ని పట్టణ ప్రాంతాల వినియోగదారులకే పరిమితమయ్యాయి.

అపరిమిత డాటా సేవలు సెప్టెంబర్ 5న సేవలు ప్రారంభించి. ఇప్పటికే దాదాపు 2.5 కోట్ల మంది కస్టమర్లను సంపాదించుకోగలిగిన రిలయెన్స్  ఫీచర్ పోన్లను మాత్రమే వినియోగిస్తున్న వారిని ఆకట్టుకోవడం కోసమని ఈ కొత్త ఆఫర్ ని ప్రవేశపెట్టింది.

వోల్ట్ టెక్నాలజీతో రూ.1000 నుంచి రూ.1500 లోపు ధర ఉండేలా రెండు రకాల ఫీచర్ ఫోన్లను రిలయన్స్ అభివృద్ధి చేసి, వచ్చే యేడాది జనవరి నుంచి మార్చిలోగా చౌక స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఇవి కూడా స్మార్ట్ ఫోన్లలానే పనిచేస్తాయనీ, ఇంటర్నెట్‌తో డాటా యాక్సిస్‌కు ఉపయోగపడడంతో పాటు, వాయిస్ కాల్స్ కూడా చేసుకోవచ్చునని రిలయన్స్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.

కాకపోతే ఇది ఫీచర్ ఫోన్ కాబట్టి టచ్ స్క్రీన్ సదుపాయం మాత్రం వుండదు.

నోరు అదుపులో పెట్టుకో సుజనా..!




ప్రత్యేక హోదా అంశం ఇక చెల్లని నోటుతో సమానమని వ్యాఖ్యానించిన  కేంద్రమంత్రి సుజనా చౌదరి వ్యాఖ్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్ తీవ్రంగా ఖండించాడు.

ప్రత్యేక హోదా చెల్లని నోటు కాదని, సుజనా చౌదరే చెల్లని కేంద్రమంత్రి అని  విమర్శించాడు.

బుధవారం రమేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బ్యాంకులను మోసం చేసి వేలకోట్లు సంపాదించిన ఘనత సుజనా చౌదరిదని అన్నాడు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో హోదాను సాధించి తీరుతామని ఆయన స్పష్టం చేశాడు.

ప్రత్యేకహోదా విషయంలో సుజనా తన నోరును అదుపులో పెట్టుకుని మాట్లాడాలని రమేష్ సూచించాడు.

పెట్రోలు,డీజిలు ధరలు తగ్గాయి



గత కొద్దిరోజులుగా పెద్దనోట్ల రద్దు హడావిడిలో మునిగివున్న ప్రజలకు ఓ చిన్న తీపి కబురు.

పెట్రోలు, డీజిలు ధరలు కాస్త తగ్గాయి. పెట్రోలు ధర లీటరుకు రూ.1.46, డీజిలు ధర రూ.1.53 చొప్పున తగ్గించినట్లు ‘ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌' ప్రకటించింది.

తగ్గిన ధరలు మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. రాష్ట్రాలు విధించే సుంకాలను మినహాయిస్తే పెట్రోలు, డీజిలు ధరలు మరింత తగ్గే అవకాశం వుంది.

పెట్రోలు ధర సెప్టెంబరు నుంచి వరుసగా ఆరుసార్లు పెరిగిన అనంతరం తాజాగా ఇప్పుడు తగ్గడం గమనార్హం. 

నితిన్ హీరోగా పవర్ స్టార్ సినిమా!



పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ తన వీరాభిమాని హీరో నితిన్‌ తో ఓ సినిమా నిర్మించబోతున్నాడు.

ఈ చిత్రాన్ని పవన్‌కల్యాణ్‌ తో పాటుగా దర్శకుడు త్రివిక్రమ్‌, నితిన్‌ తండ్రి కలిసి నిర్మిస్తున్నారు.

ఈ చిత్రాన్ని ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్‌, పవన్‌కళ్యాన్ తో కలిసి దిగిన ఫొటోను నితిన్‌ ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. ఈ విషయాన్ని ప్రకటించడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని తెలియజేసాడు..

ఈ చిత్రానికి సంబంధించి పూర్తి  వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

రాహుల్‌కు బెయిలిచ్చారు!




ఆర్‌ఎస్‌ఎస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన పిటిషన్‌లో  కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి భీవండి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.  కేసు విచారణ నిమిత్తం రాహుల్ మహారాష్ట్రలోని భీవండి కోర్టుకు హాజరయ్యారు.

2014 మార్చి 6న మహాత్మాగాంధీని ఆర్ఎస్ఎస్ చంపిందని రాహుల్ వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆర్ఎస్ఎస్ నేత ఒకరు రాహుల్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఎయిమ్స్‌లో సుష్మాస్వరాజ్‌




కిడ్నీ ఫెయిల్యూర్ సమస్య కారణంగా కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ఎయిమ్స్‌లో చేరారు.

ఆసుపత్రిలో చేరానని, డయాలసిస్‌ ట్రీట్‌మెంట్ జరుగుతోందని ఆమె స్వయంగా తన ట్విట్టర్‌ ద్వారా తెలియజేసారు.

సుష్మ కు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం ఎయిమ్స్ వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిసింది.

 కాగా, ప్రస్తుతం సుష్మాస్వారాజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, చాలా రోజులుగా మధుమేహం ఉండటంతో ఆ ప్రభావం కిడ్నీ పనితీరుపై పడిందని, డయాలసిస్ జరుగుతోందని ఎయిమ్స్ వర్గాల తెలియజేసాయి.

సుష్మ గత 20 ఏళ్లుగా డబాబెటిస్‌తో బాధపడుతున్నారు. గతంలో ఆమె న్యుమోనియా, ఇతర ఆరోగ్య సమస్యలతో ఎయిమ్స్‌లో చికిత్స తీసుకున్నారు.

13, నవంబర్ 2016, ఆదివారం

మోదీకి కేజ్రీవాల్ వార్నింగ్..!




కరెన్సీ నోట్ల రద్దుకు మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై మళ్ళీ కేజ్రీవాల్ విమర్శల దాడి చేసాడు.

శాంతిభద్రతలు అదుపుతప్పక ముందే నోట్ల రద్దు నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశాడు.  కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. చిత్తశుద్ధి ఉంటే ముందు తన కార్పొరేట్ మిత్రులపై మోదీ కఠిన చర్యలు తీసుకోవాలన్నాడు.

ప్రజలను పడ్తూన్న కష్టాలకు ప్రధాని క్షమాపణలు చెప్పితీరాలని డిమాండ్ చేశాడు.

ప్రధాని మరో 50 రోజులు ప్రజల్ని సహకరించాలని కోరుతున్నారని, అప్పటివరకూ ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉండాలా అని కేజ్రీవాల్ ప్రశ్నించాడు.

చిల్లర ఇచ్చేవాడు దేవుడు!



ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు వ్యవహారం వల్ల సామాన్యప్రజలు గత మూడురోజులుగా ఎలాంటి సమస్యలను ఎదురుకుంటున్నరో తెలిసిందే. బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ కొత్తనోట్లకోసం, లేదా వంద నోట్ల కోసం గంటల తరబడి తిరగాల్సి వస్తోంది.

ఈ సందర్భంగా దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తన అభిప్రాయాన్ని ఫేస్ బుక్ వేదికగా ..  ‘‘రెండువేల నోటుకి చిల్లర మార్చగలిగితే వాడిని వీరుడు అంటారు. అదే రెండువేల నోటుకి చిల్లర ఇచ్చేవాడిని దేవుడు అంటారు’’ అంటూ పోస్ట్‌చేశారు.

హెచ్‌టీసీ 'బోల్ట్'



250 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ వేగాన్ని అందుకోగల స్మార్ట్‌ఫోన్‌ను హెచ్‌టీసీ లాంచ్ చేసింది. దీనికి పరుగుల వీరుడు 'బోల్ట్' అని పేరు పెట్టింది.

ఇంతకుముందున్న హెచ్‌టీసీ 10 స్మార్ట్‌ఫోన్‌తో పోలిస్తే భిన్నమైన ఫీచర్లతో లాంచ్ అయిన హెచ్‌టీసీ బోల్ట్ ప్రత్యేకతలు ఈ విధంగా వుంటాయి..

ఇందులోగల  సెల్యులార్ టెక్నాలజీ సరాసరి 250 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ వేగాన్ని అందుకోగలదు..ఇది మిగతా స్మార్ట్ ఫోన్లతో పోలిస్తే  వేగం 10 రెట్లు ఎక్కువగా వుంటుంది.
ఇంకా..
స్నాప్ డ్రాగన్ 810 చిప్ సెట్,
3జీబి ర్యామ్ సపోర్ట్,
32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ సౌకర్యం,
ఛత్ 9 ళ్టే, యూఎస్బీ టైప్-సీ, బ్లుటూత్ 4.1,
ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ 7.0,
5.5 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,
బోల్ట్ స్మార్ట్‌ఫోన్‌లో హెడ్‌ఫోన్ జాక్ ఉండదు.

ఈ ఫోన్ ధర సుమారుగా రూ.40,500 (అమెరికా కరెన్సీలో) వుండొచ్చు.

ట్రంప్‌ షాకయ్యాడట!




అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో  హిల్లరీ క్లింటన్‌ పై గెలిచిన తర్వాత ట్రంప్‌ షాకయ్యాడని న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది.

సర్వేలు, మీడియా నివేదికలన్నీ హిల్లరీ గెలుస్తారని చెప్పినా అనూహ్యంగా తనే గెలవడంతో ట్రంప్  తన సన్నిహితుల దగ్గర మొదట దిగ్భ్రాంతికి గురైనాడని తెలిసింది.

రద్దు విషయం బాబుకు ముందే తెలుసు!



పెద్ద నోట్ల రద్దు విషయం సీఎం చంద్రబాబుకు ముందే తెలుసునని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించాడు.

విజయవాడలో శనివారం ఆయన ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... బీజేపీ, టీడీపీ నేతలు తమ వద్దనున్న నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్న తర్వాతనే రూ.500, రూ.వెయ్యి నోట్లను కేంద్రప్రభుత్వం రద్దు చేసిందని చెప్పాడు.

నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని... విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని ఎందుకు తేలేకపోతున్నారని ఆయన ప్రశ్నించాడు. 

సచిన్ నెల్లూరుకి




ప్రముఖ క్రికెట్ ఆటగాడు సచిన్ టెండూల్కర్  ఈ నెల 16న నెల్లూరు జిల్లాకు రానున్నాడు.

గూడూరు మండలంలోని పుట్టంరాజువారికండ్రిగను ఆయన దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.

అక్కడి ప్రజల సామాజిక ఆర్థిక పరిస్థితులపై అక్కడి ప్రజలు జిల్ల యంత్రాంగంతో సచిన్ చర్చించనున్నాడు

సచిన్ రాక సందర్బంగా  ఆ గ్రామవాసులు ఇప్పటినుంచే ఏర్పాట్లు చేసే పనిలో పడ్డారు. తమ ఊరి పరిస్థితిని సచిన్ చక్కబెట్టి, గ్రామస్థుల అభివృద్ధికి కృషి చేస్తారని ఆ గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు.

జయ కోరుకుంటే వెళ్ళొచ్చు!!





తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత శారీరకంగా, మానసికంగా ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. ఇక ఆమె కోరుకున్నపుడు వెళ్ళిపోవచ్చని అపోలో ఆస్పత్రి చైర్మన ప్రతాప్‌ సి.రెడ్డి తెలిపారు.

శనివారం ఆయన చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ..జయ శరీరంలో ఇన్ఫెక్షన్ తొలగిపోయిందని,   అయితే ఆమెను ఇంటికి పంపించే తేదీ ఇంకా నిర్ణయించలేదని, తాను కోరుకున్నప్పుడు వెళ్లొచ్చని అన్నారు.

జయలలిత కోరిక మేరకే ఆమెను ప్రత్యేక వార్డుకు మార్చడం జరిగింది., ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నప్పటికీ మామూలుగానే ఆమెకు నచ్చిన  ఆహారాన్ని తీసుకుంటున్నారు..

సెప్టెంబర్‌ 22న ఆస్పత్రికి వచ్చిన జయలలితకు అనారోగ్యసమస్యలు పూర్తిగా తగ్గుముఖం పట్టినట్టే.

నోట్ల రద్దుకు అమీర్ ఖాన్ మద్దతు




రూ.500,1000 నోట్ల రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి బాలీవుడ్‌ నటుడు అమీర్‌ ఖాన్‌ మద్దతుగా నిలిచారు.

తాత్కాలిక ఇబ్బందులను ప్రజలు పెద్దమనసుతో సమ్యమనం పాటించాలని అమీర్ విజ్ణప్తి చేశాడు. చిన్న చిన్న కష్టాలను ఓర్చుకుని దేశాభివృద్ధికి ఏది మంచిదో అది చేయాలని ఆయన అన్నాడు.

'లెక్కలు చూపని ఆదాయమేదీ నాదగ్గర లేదు. అన్ని టాక్సులను నేను సక్రమగా కడుతున్నాను., అందువల్ల నోట్ల రద్దు ప్రభావం నామీద ఏమీ ఉండదు’’ అని అమీర్‌ఖాన్ పేర్కొన్నాడు.

తాత్కాలిక కష్టాలు ముఖ్యం కాదని, దీర్ఘ కాలికప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని ఆయన అభిప్రాయపడ్డాడు.

12, నవంబర్ 2016, శనివారం

మోదీకి మమత సీరియస్ వార్నింగ్!




పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రథాని మోదిపై నిప్పులు కురిపించింది.

వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ట్విటర్ వేదికగా గట్టిగా డిమాండ్ చేసింది. ఇదొక భారీ నల్ల కుంభకోణంగా మారిందని మమత అనింది. దీనివల్ల సామాన్య ప్రజానీకం కష్టాలు పడ్తొందని, మనీ లాండరర్లకే పూర్తి ప్రయోజనం కలుగుతోందని ఆమె విమర్శించింది.

సామాన్యులకు వ్యతిరేకమైన ఈ ‘నల్ల’ రాజకీయ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మమత డిమాండ్ చేసింది. భారత్ లో మార్కెట్లు కుప్పకూలిపోయాయని, ప్రజలు బాధపడుతున్నారని ఆమె పేర్కొంది.

అయితే మమత బెనర్జీ వ్యాఖ్యలను బీజేపీ విమర్శించింది. అవినీతిపరులకు కాంగ్రెస్, ఆప్, టీఎంసీ పార్టీలు అండగా నిలుస్తున్నాయని ఆరోపించింది.

ఉగ్రవాదాన్ని నిర్మూలించాం!!




‘పాకిస్థాన్‌లో ఉగ్రవాదాన్ని మూడేళ్లలోనే తమ ప్రభుత్వం పూర్తిగా నిర్మూలించిందని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ చెపాడు.

'గతంలో ఏ ప్రభుత్వమూ ఇలా చేయలేకపోయింది, సరికొత్త పాకిస్థాన్‌ను నిర్మించే దిశగా సాగుతున్నాము, భవిషత్తులో ప్రపంచంలో పాక్‌ బలమైన ఆర్థిక శక్తిగా నిలుస్తుంది. కానీ, కొన్ని శక్తులకు మాత్రం దేశం అభివృద్ధి చెందడం ఇష్టంలేదు' అని, షరీఫ్ పరోక్షంగా భారత్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు.

నిత్యం ఆత్మాహుతిదాడుడులతో, ఉగ్రవాద ప్రేరేపిత ఆందోళణలతో అట్టుడుకుతున్న పాకిస్థాన్ లో ఉగ్రవాదాన్ని నిర్మూలించామని చెబుతూండటం హాస్యాస్పదంగా వుంటుంది తప్ప మరేంకాదు.

కాబోయే సీఎం లోకేశ్..



యువనేత దగ్గర గుర్తింపుకోసమో లేక అభిమానమో చెప్పలేం గానీ... సీయం చంద్రబాబు కుర్చీకి అప్పుడే ఎసరు పెట్టడం మొదలు పెట్టారు కొందరు మంత్రులు.

భవిష్యత్‌లో  సీఎం నారా లోకేశే నని  మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్‌బాబు పేర్కొన్నారు.

బండారుపల్లిలో శుక్రవారం రాత్రి జనచైతన్య యాత్ర సందర్భంగా జరిగిన బహిరంగ సభలో  మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ..సీఎం చంద్రబాబు వారసుడు, కాబోయే సీఎం లోకేశ్‌ అని అన్నారు.

తెలుగుదేశం పార్టీ  నారా లోకేశ్ ను తమ పార్టీ అధినాయకుడిగా ప్రజలను, కార్యకర్తలను ఒప్పించడానికి నెమ్మదిగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు కనిపిస్తొంది.

రాజకీయాల్లో వారసత్వ రాజకీయాలనేది అలవాటైన పాత విషయమే, ఐనా.. చంద్రబాబూ గమనిస్తున్నావా?!

జుట్టు వూడిందని ఫామ్‌ పోయిందట!



గత ఏడాది వరకు టీమ్‌ండియాలో రెగ్యులర్‌ ఆడుతూ.. భారత పేస్‌ బౌలర్లలో కీలక పాత్ర పోషించిన మోహిత్ శర్మ వున్నట్టుండి ఫామ్‌ కోల్పోవడంతో పాటుగా భారత్ టీం లో స్థానం కూడా కోల్పోయాడు.

ఇలా జరగడానికి ఓ విచిత్రమైన కారణాన్ని చెప్పాడు మోహిత్.

‘‘నా జుట్టు వూడిపోతున్న విషయాన్ని గమనించాను.. అది నా ఆత్మవిశ్వాసాన్ని బాగా దెబ్బ తీసింది. నా బౌలింగ్‌ కూడా అందుకే దెబ్బ తింది’’ అని చెప్పి ఆశ్చర్యపరిచాడు మోహిత్‌ శర్మ..

ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున కూడా కీలక ఆటగాడైన మోహిత్. కేవలం తన హైర్ ఫాల్ కారణంగా  పేలవ ఫామ్‌ తో టీమ్‌ఇండియాకు దూరమైపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

11, నవంబర్ 2016, శుక్రవారం

గుజరాత్ లో ముందే తెలుసా..??




'పాతనోట్లు రద్దు  మంచిదే... అయితే.. ముందే చెప్పొద్దా? జాగ్రత్త పడేవాళ్ళం కదా అనీ, ఇప్పటికిప్పుడంటే ఎలా'  అని..ప్రతిపక్షాలతోపాటుగా,  సామాన్యజనం కూడా వ్యాఖ్యలు చేస్తుండొచ్చు.

అలా చేస్తే.. నల్లకుభేరులు ముందుగానే జాగ్రత్త పడ్తారని ప్రభుత్వం కారణంగా చూపిస్తూ వుండొచ్చు..

కానీ.. 7 నెలల ముందే కరెన్సీ నోట్ల రద్దు విషయం గుజరాత్ రాష్ట్రంలో మీడియాకు తెలుసన్న బలమైన సాక్ష్యం ఒకటి దొరికింది. రూ 500, 1000 నోట్లు రద్దుకాబోతున్నాయనే వార్త గుజరాత్ స్థానిక వార్తాపత్రికలో ఏడు నెలల క్రితమే  ప్రముఖంగా ప్రచురితమై వుంది.

బాజాపా అధికారంలో వున్న గుజరాత్ బడా బడా వ్యాపారవేత్తలకి జన్మస్థలంలాంటిది. నోట్ల రద్దు వార్త తెలుసుకున్న వాళ్ళంతా ముందుగానే జాగ్రత్తలు తీసుకుని, వందల కోట్ల కరెన్సీని సేఫ్  చేసేసుకుని వుంటారని గట్టిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

( కాగ్ మురళీకృష్ణ గారికి కృతజ్ఞతలతో )

ట్రంప్ భార్య పై వర్మ హాట్ కామెంట్స్!



అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన్ ట్రంప్ భార్య మెలనియా అందాన్ని ఉద్దేశించి వర్మ తనదైన శైలిలో కామెంట్స్ చేశాడు

తన ట్విట్టర్ లో ఆమె అందం గురించి  వర్మ హాట్ కామెంట్స్ చేసారు.  'ఇప్పటి వరకు ఎంతో మంది అమెరికా అధ్యక్షలు అయ్యారు. వారి భార్యలు ఎవరూ కూడా నాకు నచ్చలేదు. కానీ ఈ సారి అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ భార్య నాకు బాగా నచ్చింది. అమెరికాకు హాట్ ఫస్ట్ లేడీ దొరికింది'..! అంటూ వర్మ కామెంట్స్ చేసాడు.


ఆమెకు సంబంధించిన బికినీ ఫోటో పోస్టు చేయడంతో పాటు, ' మీరే చెప్పండి అంటూ ఆమె నాకు ఎందుకు ఇంత ఇష్టమో నేను చెప్పలేను... మీరైనా చెప్పగలరా' అంటూ వర్మ ట్వీట్ చేసాడు.



బాహుబలి నిర్మాతలకు ఐ.టి షాక్!



ప్రపంచవ్యాపతంగా భారీవసూళ్ళతో సంచలనం సృష్టించిన 'బాహుబలి' చిత్ర నిర్మాతల కార్యాలయాలపై ఐటీ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు.

బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.2లోని ఆర్కా మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కార్యాలయం పై దాదాపు పది మందితో కూడిన ఐటీ శాఖ అధికారుల బృందం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా వారు పలు ఫైళ్లను తనిఖీ చేశారు.

‘బాహుబలి' మొదటిభాగం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.600 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం దీనికి కొనసాగింపుగా బాహుబలి: ది కన్‌క్లూజన్‌ చిత్రీకరణ ముగింపుదశకు చేరుకుంటొంది.

2017 ఏప్రిల్‌ 28న ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ రిలీజ్ కానుంది.

భారత్ బాటలో పాక్



నల్లధనాన్ని అరికట్టేందుకు భారత ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే బాటలో పాకిస్థాన్ కూడా నడవాలని అక్కడి ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

పాకిస్థాన్ లో విచ్చలవిడిగా పెరిగిపోయిన అవినీతి,నల్లధనాన్ని అరికట్టేందుకు అక్కడ చలామణిలో ఉన్న పెద్ద నోట్లను రద్దు చేయాలంటూ ప్రతిపక్ష పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆర్థిక కమిటీ ముందు ఒక తీర్మానం ప్రవేశపెడుతూ.. దేశంలో చలామణిలో ఉన్న రూ.1000, రూ.500 నోట్లను వెనక్కి తీసుకోవాలని అందులో కోరారు.

మనీ లాండరింగ్, అవినీతిని తగ్గించడానికి, భారత దేశంలో పెద్ద నోట్లను రద్దు చేశారని, అదేవిధంగా పాక్ లో కూడా అలాంటి ప్రయత్నమే చెయ్యాలని ఆ పార్టీ సూచించింది.

ట్రంప్ మా అధ్యక్షుడు కాదు!!




అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్‌ ట్రంప్‌ సంచలన విజయంపై అమెరికా మొత్తం నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

ట్రంప్‌ వ్యతిరేక బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. అమెరికావాసులు పెద్ద సంఖ్యలో  వీధుల్లో ఆందోళన చేపట్టారు. ‘ఆయన మాకు అధ్యక్షుడు కాదు’‘దేశంలో విద్వేషానికి చోటులేదు’  అంటూ నినాదాలు చేస్తున్నారు.

ట్రంప్‌ విధానాలవల్ల్ ఐ.టి. పరిశ్రమలు అనిశ్చితిలో పడుతుందేమోనని సిలికాన్‌ వ్యాలీలో ఆందోళన నెలకొంది. అమెరికాకు వలసవచ్చేవారికి త్వరగా అనుమతులు ఇచ్చే విషయమై సమస్యలు నెలకొంటాయని అంచనా వెస్తున్నారు.

న్యూయార్క్‌, షికాగో, ఫిలడెల్ఫియా, బోస్టన్‌, కాలిఫోర్నియా, కొలరాడో, లాస్‌ ఏంజెలెస్‌, పోర్ట్‌ల్యాండ్‌, అట్లాంటా, ఆస్టిన్‌, డెన్వర్‌, శాన్‌ ఫ్రాన్సిస్కో లాంటి ప్రముఖ ప్రాంతాల్లోనూ నిరసనలు చోటుచేసుకున్నాయి. అధ్యక్ష భవనం బయట కొందరు నిరసన తెలియజేసారు.

న్యూయార్క్‌లోని ట్రంప్‌ ప్రధాన కార్యాలయం ట్రంప్‌ టవర్‌ పరిసరాల్లోనూ నిరసనకారులు ఆందోళన చేపట్టారు. దీంతో ట్రంప్‌ టవర్‌వైపు వెళ్లే రహదారులను అధికారులు పూర్తిగా మూసివేశారు.

 ‘చాలా అసంతృప్తి, దిగ్భ్రాంతికి గురయ్యాం. మా కుటుంబాలు, స్నేహితుల గురించి భయపడుతున్నాం’అని రాసిన బ్యానర్లను ర్యాలీలలో ప్రదర్శిస్తున్నారు.

మంత్రి గారి కళాపోషణ!!




కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన టిప్పు జయంతి ఉత్సవాల్లో ఓ మంత్రి  తన మొబైల్ లో అశ్లీల చిత్రాలను చూస్తూ మీడియా కెమెరాకు చిక్కాడు.

యచూరు జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో విద్యా శాఖ మంత్రి తన్వీర్‌సేఠ్‌  వేదికపైౖనే కూర్చుని తాపీగా ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూస్తుండగా ఓ విలేకరి దానిని చిత్రీకరించాడు.

ఇది టీవి ఛానెళ్లలో ప్రసారం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా దుమారం చెలరేగింది. మంత్రి తన్వీర్‌ తీరుపైౖ  మండిపడ్డ ప్రతిపక్షనేతలు ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఇదిలా ఉండగా తన్వీర్‌సేఠ్‌ సాయుంత్రం మీడియాకు వివరణ ఇచ్చారు. తాను మొుుబైల్‌లో అశ్లీల చిత్రాలు చూడలేదని, వేరే సమాూచారం కోసం మొబైల్ చూస్తుండగా లింక్‌ మారి ఆ చిత్రాలు వచ్చాయని తెలిపాడు.

అసలే అత్యాచారాలకు కేరాఫ్ అడ్రస్స్ గా మారుతున్న కర్ణాటకలో అధికారంలో వున్న నాయకులే ఇలాంటి నిర్వాహకాలకి పాల్పడుతుంటే..సామాన్య ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

పవన్‌ ని లైట్ గానే..




నిన్న అనంత సభలో జనసేన నేత పవన్ కళ్యాణ్ వెల్లబుచ్చిన అభిప్రాయాలను టీడీపి తేలిగ్గా తీసుకుంది.

పవన కల్యాణ్‌ వ్యాఖ్యలను నెగిటివ్‌గా తీసుకోవద్దని, ఏవైనా లోటు పాట్లు ఉంటే సరిదిద్దుకుందామని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్‌ పార్టీ శ్రేణులకు సూచించాడు.

గవర్నమెంట్ లో అవినీతి పెరుగుతోందన్న పవన్ వ్యాఖ్యలపై మాట్లాడుతూ..ఆయన భారతీయ సిటిజన్ లాగా సలహా ఇచ్చారని, అలాంటి లోపాలు వున్నట్టైతే సరిదిద్దుకుందామని లోకేష్‌ అన్నాడు.

ప్రత్యేకహోదా , ప్యాకేజి వివరాలను జనసేన నేత కు పార్టీ తరపున అర్థమయ్యేలా చెబితే బాగుంటుందని కొందరు నాయకులు లోకేష్ కు సూచించారు.

కూతురికి శ్రీదేవి వార్నింగ్‌ ఇచ్చిందా?



మహారాష్ట్ర మాజీ సీఎం,సుశీల్‌ కుమార్‌ షిండే మనవడు శిఖర్‌పహారియా తో తనకూతురు జాన్వి మరీ అతిగా పూసుకు తిరుగుతుండంతో సీనియర్ నటి శ్రీదేవి  సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తొంది.!

గత రెండునెలలుగా జాన్వి, శిఖర్ ల లిప్ లాక్ ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుండడంతో ఫైర్ అయిన శ్రీదేవి, కూతురుతో ముందుగా కెరీర్ పై దృష్టిపెట్టమని స్ట్రిక్ట్ గా హెచ్చరించిందట.

కెరీర్ మొత్తం తన నటనా కౌశలంతో అగ్రస్థానంలో కొనసాగిన శ్రీదేవికి తాజా పరిణామాలు తలవంపులు తెచ్చాయనడంలో సందేహం లేదు. 

10, నవంబర్ 2016, గురువారం

మరో నటుడి మృతదేహం దొరికింది





 ‘మాస్తిగుడి’  సినిమా చిత్రీకరణ సమయంలో హెలికాఫ్టర్ నుంచి చెరువులో పడి మునిగిపోయిన ఇద్దరు కన్నడ నటుల్లో మరొక నటుడి మృతదేహం కూడా లభించింది.

నటుడు అనిల్ మృతదేహాన్నిఈరోజు చెరువులో గుర్తించారు. గజ ఈతగాళ్లు, స్థానికులు, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యల చేపట్టగా.. నిన్న ఉదయం ఉదయ్ రాఘవ మృతదేహం లభించింది. కాగా అనిల్ ఆచూకీ కోసం తీవ్రంగా గాలించిన సిబ్బంది ఈ రోజు ఉదయం అతని మృతదేహాన్ని గుర్తించి బయటకు తీసుకొచ్చారు. 

ఎమ్మెల్యేగా పోటీ చేస్తా !



2019 ఎన్నికల్లో తాను పోటీచేస్తానని జనసేన నేత పవన్ కళ్యాన్ మొదటిసారిగా ప్రకటించాడు.

అనంతపురం లో ఏర్పాటు చేసిన సీమాంధ్ర హక్కుల చైతన్య సభలో ఆయన మాట్లాడుతూ... 'గెలుస్తానో లేదో తెలియదు కానీ పోటీ చేస్తా, మీరు మద్దతిచ్చినా లేకున్నా, మీకు అండగా ఉంటాన'ని తెలిపాడు.

అలాగే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ మొదటి కార్యాలయాన్ని అనంతపురం జిల్లాలో ప్రారంభించనున్నట్లు పవన్‌ చెప్పారు. 'సీమ చరిత్ర రాసుకోవడానికి పేజీలకు పేజీలు ఉంది.. తాగడానికి మాత్రం చుక్కనీరు లేదు'. అని పవన్ వ్యాఖ్యానించాడు.

పవన్ కు సైటొచ్చింది!!




కేంద్ర ప్రభుత్వ తీరుతో తనకు సైటొచ్చేసిందని పవన్ చలోక్తి విసిరాడు

అనంతరపురంలో జరిగిన ' సీమాంధ్ర హక్కుల చైతన్య సభ' లో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

తన ఉపన్యాసం మధ్య మధ్యలో కాగితాల సహాయం తీసుకున్నపుడు, పవన్ కళ్ళద్దాల్ని ఉపయోగించాడు.

'సామాన్యులకు అర్థం కాని భాషను ఉపయోగించి ప్యాకేజ్ లెక్కలు చెప్పారని, దాని గురించి తెలుసుకోడానికి ఎన్నో పుస్తకాలు చదవడం వల్ల తనకు కళ్లు సరిగా కనిపించడంలేదని పవన్ అన్నారు. అలాగే ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలన్నింటిని స్టడీ చేశానని, ఆర్థిక, సామాజిక రంగ నిపుణులతో చర్చించానని' పవన్ పేర్కొన్నారు.

తన కళ్లజోడుకు కేంద్రం గ్రాంటు మంజూరు చెయ్యాలని పవన్ వ్యంగ్యంగా కోరారు.

కరెన్సీ నోట్లపై మరో సంచలన ప్రకటన!






రూ 500, 1000 నోట్ల రద్దుతో ప్రకంపనాలు సృష్టిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో సంచలన ప్రకటన చేసింది.

మరి కొద్ది నెలల్లో రూ. 10, 20, 50, 100ల నోట్లను కూడా మార్చేస్తామని ప్రకటించింది. కొత్త డిజైన్‌లతో వాటిని అందుబాటులోకి తెస్తామని, అలాగే రూ. 1000ల నోట్లను కూడా రీ డిజైన్ చేసి, చెలామణిలోకి తీసుకురానున్నట్టు తెలియజేసింది.

చంద్రబాబూ.. డబ్బా కొట్టుకోవడం ఆపు!!




రూ.వెయ్యి, 500 నోట్ల రద్దుకు తానే సిఫార్స్ చేశానని చంద్రబాబు నాయుడు డబ్బా కొట్టుకుంటున్నారని వైయస్సార్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎద్దేవా చేశాడు.

ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించిన ఏకైక వ్యక్తి చంద్రబాబే అని మేకపాటి ధ్వజమెత్తారు. తన పరిపాలనా లోపాల్ని పక్కదారి పట్టించడానికి, నోట్ల రద్దును తన గొప్పతనంగా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని మేకపాటి విమర్శించాడు.

కరెన్సీనోట్లను కాల్చేస్తున్నారు!



రూ.500, 1000 నోట్ల రద్దు నిర్ణయం నల్లకుభేరుల్ని కోలుకోలేనంత దెబ్బ తీస్తున్నట్టు కనిపిస్తోంది. మార్చుకునే వీలులేక, దగ్గరుంచుకుంటే ఉపయోగం లేకపోవడంతో కొంతమంది నోట్లను పెద్దమొత్తాలో తగలబెట్టేస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో గోతాల్లో నింపి తగలబెట్టిన రూ.1000, రూ.500 నోట్లను  గుర్తించారు. సీబీ గంజ్‌లోని పర్సా ఖేడా రోడ్‌లో గోతాల్లో వేసి మసి అయిపోతున్న కరెన్సీ కట్టలను కనుగొన్నారు.

ఓ పెద్ద కంపెనీకి చెందిన ఆ నోట్లను ముందుగా ముక్కలు చేసి, తర్వాత  తగలబెట్టారని పోలీసులు తెలిపారు. 

టాటా సన్స్‌కి చైర్మెన్ ఇషాత్ హుస్సేన్




ఇటీవల టాటా సన్స్ బోర్డు అనూహ్యంగా చైర్మన్ పదవి నుంచి ఉద్వాసన పలికిన సైరస్ పల్లోంజీ మిస్త్రీ స్థానంలో తాత్కాలిక చైర్మన్‌గా ఇషాత్ హుస్సేన్ నియమితులయ్యారు.

టాటా సన్స్ కొత్త చైర్మన్‌ను నియమించేవరకు హుస్సేన్ టాటా సన్స్‌కు తాత్కాలికంగా సారథ్యం వహించనున్నారు.

1999లో టాటా సన్స్ బోర్డులోకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా అడుగుపెట్టిన ఇషాత్ హుస్సేన్, టా ఇండస్ట్రీస్, టాటా స్టీల్   కంపెనీలకు హుస్సేన్ డైరెక్టర్‌గా ఉన్నారు. అలాగే వోల్టాస్, టాటా స్కై కంపెనీలకు చైర్మన్‌గా కొనసాగుతున్నారు.

గుడ్డ్లు కొనడానికి అప్పు చేసిన హీరోయిన్‌!



పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రకంపనాలు సృష్టిస్తూనే వుంది.

అయితే సామాన్యులతోపాటు సెలబ్రిటీలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

తాజాగా బాలీవుడ్‌ హీరోయిన్‌ బిపాసాబసు కూడా ఇబ్బందిని ఎదుర్కొంది. బిపాసాబసు వద్ద కోడిగుడ్లు కొనుక్కోవడానికి చిల్లర లేకపోవడంతో రాకీస్టార్ దగ్గర అప్పుచేసి మరీ కొన్నదట.!

 ‘కోడిగుడ్లు కొనుగోలు చేసేందుకు ఇప్పుడే రాకీ స్టార్‌ దగ్గర్నుంచి చిల్లర డబ్బులు అప్పు తీసుకున్నా. మొదటి రోజు ఇలా గడిచింది’ అంటూ బిపాసాబసు తన ట్విట్టర్ ద్వారా తెలియచేసింది.


9, నవంబర్ 2016, బుధవారం

ట్రంప్ గెలుపుకు వర్మ ట్రీట్!



అమెరికా ప్రెసిడెంట్ గా డోనాల్డ్ ట్రంప్ గెలవడంతో.. రాంగోపాల్ వర్మ పెద్ద ఎత్తున పార్టీ ఇవ్వబోతున్నాడట.

''నాలుగు నెలల క్రితమే ట్రంప్ గెలుస్తాడని నేను చెప్పాను. అందుకే నాకు నేనే థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఈరోజు రాత్రికి అందరికీ పెద్ద పార్టీ ఇవ్వబోతున్నాను. ట్రంప్ ను నాన్ సెన్స్ అనుకున్నవారందరూ ఇప్పుడు వారే నాన్ సెన్స్ మాట్లాడారని అనుకోవచ్చు మనం'' అంటూ ట్వీట్ చేసాడు రామ్ గోపాల్ వర్మ.

మాటలే కాదు, తన చేష్టలు కూడా విలక్షణంగా వుంటాయని వర్మ మరోసారి ప్రూవ్ చేస్తున్నాడు.

అంబానీ కొడుకుతో కత్రినా డేటింగ్‌?



బిజినెస్ టైకూన్ రిలయన్స్‌ సంస్థల అధినేత ముఖేశ్‌ అంబానీ కుమారుడు ఆకాశ్‌ అంబానీతో కత్రినా డేటింగ్‌ చేస్తున్నట్లు వార్తలు బాలీవుడ్‌ లో చక్కర్లు కొడ్తున్నాయి.

ఈ వార్తలకు బలం చేకూరుస్తూ..దీపావళికి బిగ్‌బి అమితాబ్‌ ఇంట్లో గ్రాండ్‌గా నిర్వహించిన పార్టీకి  ఆకాశ్‌అంబానీ, కత్రినాలు కలిసి ఒకే కారులో రావడం, ఆ తర్వాత అనిల్‌ కపూర్‌ ఇంటికి కూడా ఇద్దరూ కలిసే వెళ్లినట్లు తెలుస్తోంది.

రణబీర్ కపూర్ తో సుధీర్ఘ కాలం ప్రేమాయణం నడిపి, బ్రేకప్ అయిన తర్వాత, కత్రినా మళ్ళీ ఆకాశ్ అంబానితో ప్రేమలో పడ్డట్టు తెలుస్తోంది.

క్యాష్ ఆన్ డెలివరీ తాత్కాలిక రద్దు!



 రూ.500, 1000 నోట్ల్ రద్దుతో ఈ కామర్స్ కంపెనీలు క్యాష్ ఆన్ డెలివరీ ని తాత్కాలికంగా రద్దుచేశాయి.

నోట్ల చెలామణిని కేంద్రం నిలిపివేయడంతో ఈ కామర్స్ సంస్థలపై ఈ ప్రభావం భారీగా పడీంది.  ప్లిప్‌కార్డ్, స్నాప్‌డీల్, అమెజాన్ వంటి పలు సంస్థలు క్యాష్ ఆన్ డెలివరీ సేవలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ప్రకటించాయి.

విజేత డోనాల్డ్ ట్రంప్ !!




అంచనాల్ని తలకిందులు చేస్తూ.. సర్వేలని తోసిరాజంటూ.. డోనాల్డ్  ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు.

మొదటి నుంచి ఆవేశపూరిత ప్రసంగాలతో, వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనం సృష్టించిన ట్రంప్ వ్యక్తిగత జీవితాన్ని పట్టించుకోకుండా అతనివైపే జనం నిలిచారు.

అధ్యక్ష స్థానాన్ని పొందాలంటే కనీసం 270 ఓట్లు పొందాల్సి వుండగా. .తాజాగా వెలువడిన ఫలితాల ప్రకారం 538 ఎలక్ట్రోరల్ ఓట్లకు గానూ ట్రంప్ 280 పైగా  ఓట్లు సాధించగా,  హిల్లరీకి 218 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. .

జనవరి 6 న ట్రంప్ 45 వ అమెరికా అధ్యక్షుడి గా భాద్యతలు స్వీకరించనున్నాడు 

చైతు పెళ్ళి చర్చ్‌లో..





సమంతతో తన వివాహం చర్చి లో జరగొచ్చని నాగచైతన్య తెలియజేసాడు.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పెళ్ళి సంగతి తో పాటుగా.. అఖిల్ మ్యారేజ్ విషయాల్ని కూడా వివరించాడు.

తన పెళ్ళి మొదట చర్చిలో చేసుకుని తర్వాత గుళ్ళోకూడా చేసుకుంటామని చెప్పాడు. అలాగే అఖిల్ వివాహం రోం లో జరుగుతుందని, ప్రస్తుతానికి అఖిల్ నిశ్చితార్థ లేఖలు పంచుతున్నామని చెప్పాడు.