google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: రవితేజతో ప్రేమమ్ డైరెక్టర్‌

1, నవంబర్ 2016, మంగళవారం

రవితేజతో ప్రేమమ్ డైరెక్టర్‌



 బెంగాల్ టైగర్ రిలీజై దాదాపు యేడాది పూర్తి కావస్తున్నా రవితేజ ఇంతవరకు ఏ సినిమా కూడా చెయ్యడం లేదు, కనీసం ఏ డైరెక్టర్ తోనూ స్టోరి డిస్కషన్ లో పాల్గొన్నట్టు వినిపించడం లేదు. ఈమధ్య పూరీ జగన్నాథ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రవితేజ సినిమాల ఊసు వదిలేసి, విదేశీయాత్రల్లో మునిగివున్నట్టు తెలియజేసాడు.

దాదాపుగా ఒకేరకమైన మూవీస్ తో అటు ప్రేక్షకులకి, ఇటు రవితేజ కి కూడా బోర్ కొట్టేసి, శుభ్రంగా ఫామిలీతో దేశాల్ని చుట్టేస్తున్నాడు. ఐతే త్వరలో ఈ తాత్కాలిక సన్యాసానికి బ్రేక్ పడేట్టు కనిపిస్తోంది.

ఇటీవల ప్రేమమ్ సినిమా డైరెక్టర్ చందూ మొండేటి రవితేజకు ఓ కథను వినిపించాడట. దానికి రవితేజ ఓకే చెప్పారని త్వరలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని తెలుస్తోంది. ఈ మూవీ.. కార్తికేయ లాంటి సస్పెన్స్, సైకలాజికల్ థ్రిల్లర్‌గా  ఉంటుందని టాక్ వినిపిస్తొంది.

త్వరలో దీనికి సంబందించి పూర్తి వివరాలు తెలియనున్నాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి