ప్రధాని మోదీ ఫోటోలతో వున్న డ్రెస్ ధరించినందుకు బాలీవుడ్ నటి రాఖీ సావంత్ కోర్ట్ చిక్కుల్లో పడింది.
రాఖీ సావంత్ ఆగస్ట్‌లో ఆమెరికా పర్యటన సందర్భంగా మోదీ బొమ్మలతో కూడిన డ్రెస్ ధరించి ఫోజులిచ్చింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం పొందాయి.
అయితే ప్రధాని మోదీని అవమానించడంతో, ఆయన గౌరవానికి భంగం కలిగించిందన్న ఆరోపణలతో రాజస్థాన్‌కు చెందిన న్యాయవాది ప్రజీత్ తివారీ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో రాఖీ సావంత్‌పై అభస్య ప్రదర్శన వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి