google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: అక్టోబర్ 2016

31, అక్టోబర్ 2016, సోమవారం

మెగా ఫ్రేమింగ్ లో ఒక్కరు మిస్!




మెగా ఫ్యామిలీ మొత్తం ఓకచోట చేరి, ఫోటోదిగితే చూడ్డానికి రెండుకళ్ళు చాలవు.

దీపావళి సందర్భంగా సహజంగా ప్రతిసారి అందరూ మెగాస్టార్ ఇంటికి వెళ్లడం ఆనవాయితీ. కానీ.. ఈ సారి మాత్రం 'మిస్టర్ ' షూటింగ్ లో వరుణ్ తేజ్ కాలికి గాయమై, ఇంటినుంచి కదల్లేని పరిస్థితి వుండటంతో..  ఈసారి అంతా నాగబాబు ఇంటికే వచ్చేశారు. ఇలా మెగా ఫ్యామిలీలో ఉన్న నటులంతా మొత్తం అందరూ కలిసి ఓ గ్రూప్ ఫోటో దిగేశారు.

మొత్తంగా మెగా ఫోటో అదుర్స్ గానీ..  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ ఫ్రేమ్ లో వుండివుంటే ఆ కిక్కే వేరుగా వుండేది.


పవన్‌ కల్యాణ్‌ కీలక నిర్ణయం



జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌  పశ్చిమ గోదావరి జిల్లాకేంద్రమైన ఏలూరులోనే ఓటు నమోదు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

ఆ జిల్లా నుంచి తనను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలు, నేతల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

త్వరలో ఆంధ్రప్రదేశె ప్రత్యేకహోదా విషయంలో నిర్ణయాత్మక పాత్ర పోషించాలని అడుగులువేస్తున్న పవన్ ఏలూరులో తన ఓటును నమోదుచేసేందుకు చర్యలు తీసుకోవాలని అక్కడి పార్టీ వర్గాల్ని కోరాడు.

ప్రస్తుతం ఆయనకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఓటు హక్కు వుంది. కాగా ఏలూరులో నివాసానికి కూడా ఒక భవనాన్ని చూడాలని సూచించినట్టు తెలుస్తోంది.

ఉగ్రవాదుల ఎన్ కౌంటర్!






భోపాల్ జైలు నుంచి తప్పించుకున్న 8మంది సిమీ ఉగ్రవాదులను పోలీసులు హతమార్చారు.

 గత అర్ధరాత్రి హెడ్‌కానిస్టేబుల్‌ను చంపి, జైలు గోడ దూకి పారిపోయిన టెర్రరిస్టుల కోసం మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ తీవ్రమైన గాలింపు చేపట్టింది. చివరకు భోపాల్ శివారులో వీరు తారసపడటం, పోలీసుల్ని చూసి ఉగ్రవాదులు  ఎదురు తిరగడంతో,  ఏటీఎస్, పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులు మహబూబ్‌, అంజాద్‌ఖాన్‌, జకీర్‌ఖాన్‌, అఖిల్, సాలిఖ్‌, మజీబ్‌షేక్‌, ఖలీద్‌, మజీద్‌ హతమయ్యారు.

రాంచరణ్ దీపాళి రోజు ఏంచేశాడో తెలుసా..?



సినీ పరిశ్రమ సెలెబ్రిటీలంతా ఒక్క దీపావళి రోజు మాత్రమే  కుటుంబ సభ్యులు ,స్నేహితులతో కలిసి బాణాసంచా కాలుస్తూ, సంబరాలు జరుపుకుంటూవుంటారు..

కానీ హీరో రామ్ చరణ్ మాత్రం ఈసారి దీపావళికి తన భార్య ఉపాసనతో కలిసి జిమ్ములోనే పండగ చేసుకున్నాడు.!!

మొదట్నుంచీ రాంచరణ్ కి ఫిట్ నెస్ పై  ప్రత్యేకమైనశ్రద్ద వుండటంతో పాటు, ఇప్పుడు ధృవ మూవీ కోసం మరింతగా కసరత్తులు చేస్తున్నాడు.

అలాగే దీపావళి పండగ రోజున కూడా రాంచరణ్ తన శ్రీమతి తో కలిసి జిమ్ లోనే గడపడం విశేషం. రామ్ చరణ్ కసరత్తులు చేస్తూంటే..  ఉపాసన వీడియో తీసి, 'మిస్టర్ సి దీపావళి పండగని ఇలా జరుపుకొంటున్నాడని ' ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

ఉపాసన తీసిన వీడియలో రామ్ చరణ్ పెంచిన కండలు మాత్రం  అభిమానుల కళ్ళలో బాగా పేలేటట్టే వున్నాయి. 

ఆసియా ‘ఛాంపియన్‌’ భారత్‌ !



భారత్‌ హకీ జట్టు తన చిరకాల ప్రత్యర్థి  పాకిస్థాన్‌ పై ఘనవిజయం సాధించి, ఆసియా చాంపియన్ గా నిలిచింది.

మలేషియాలో ఆదివారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ 3-2 తేడాతో పాకిస్థాన్‌ను మట్టికరిపించి విజేతగా నిలిచింది. లీగ్‌ దశలోకూడా భారత్‌ చేతిలో ఓడిన పాకిస్థాన్‌ ఫైనల్లో ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నించినా.. భారత్ హాకీ వీరులు ముందు వారి ఆటలు సాగలేదు.

పోస్టర్‌ సూపర్ ‘గురు’!



 విక్ట్రీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న చిత్రం 'గురు '.  ఓ బాక్సర్‌ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ ఇదివరకే విడుదలవగా.. ఇప్పుడు దీపావళి శుభాకాంక్షలు చెబుతూ మరో పోస్టర్‌ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. వెంకటేష్‌ తన శిష్యురాలితో బైక్‌పై వెళ్తున్న స్టిల్‌ చిత్రంపై ఆసక్తిని పెంచేలా వుంది.

 బాలీవుడ్‌లో మాధవన్‌ హీరోగా విడుదలైన చిత్రం ‘సాలా ఖాడూస్‌’. ఈ సినిమాను తెలుగులో ‘గురు’గా రీమేక్‌ చేస్తున్నాడు విక్టరీ వెంకటేష్‌.

 ఈ సినిమాకు సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నాడు. హిందీ వెర్షన్‌లో నటించిన రితికా సింగే ఈ సినిమాలోనూ హీరోయిన్‌ పాత్ర పోషిస్తోంది.

పారిశ్రామిక వేత్త దారుణ హత్య!




ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త సురేంద్ర కుమార్ బెంగళూరులో దారుణ హత్యకు గురయ్యారు.

బెంగుళూరు సంజయ‌నగర్‌లోని ఆయన నివాసంలో ఈ సంఘటన జరిగింది. నిన్న రాత్రి  పల్సర్ బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు సురేంద్రకుమార్‌పై ఆరు రౌండ్ల కాల్పులు జరపగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.

వ్యక్తిగతంగా సురేందర్‌కు నలుగురు గన్‌మెన్లు ఉన్నారు, వారు లేని సమయం చూసుకునే దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.

హత్య జరుగుతున్న సమయంలో  గన్‌మెన్లు  ఎవరూ అందుబాటులో లేకపోవడంపై  అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ హత్యకేసుకు సంబంధించి సురేంద్రకుమార్ పాత మేనేజర్‌ను అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

సిమీ ఉగ్రవాదులు పరారీ



నిషేధిత ఉగ్రవాద సంస్థ 'స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమీ)' కు చెందిన 8 మంది ఉగ్రవాదులు ఆదివారం రాత్రి ఒక గార్డును చంపి భోపాల్ జైలు నుంచి పారిపోయారు.

రాత్రి 2 గంటల ప్రాంతంలో టెర్రరిస్టులు భోజనానికి ఇచ్చే స్టీల్ ప్లేట్ ని ఆయుధంగా వాడి, హెడ్‌ కానిస్టేబుల్ రామశంకర్ గొంతుకోసి, ఆ తర్వాత దుప్పట్లతో తాడులా పేనుకుని జైలుగోడ ఎక్కి అక్కడి నుంచి పరారయ్యారు.

దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు జరుగుతున్న సమయంలో పారిపోవడానికి ప్లాన్ చేసుకుని తమ పథకాన్ని పక్కాగా అమలుచేశారు.

 మూడేళ్ల క్రితం కూడా ఏడుగురు సిమీ ఉగ్రవాదాలు భోపాల్‌ దగ్గరలోని ఖ్వాండ్వాలో ఇదే తరహాలో జైలు నుంచి పరారయ్యారు.

ఉగ్రవాద దాడుల హెచ్చరికలు, సరిహద్దులో తీవ్రతల్ని దృష్టిలో వుంచుకుని కూడా, జైల్ అధికారులు తగినంత జాగ్రత్తలు ఎందుకు  తీసుకోలేక పొయారో కానీ.. ఇలాంటి ఉదాసీనత వల్ల ప్రజలు తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది.

30, అక్టోబర్ 2016, ఆదివారం

వర్మ సూపర్ నాలెడ్జ్!!



తరచూ వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో వుండే వర్మ ఇద్దరు మాజీ ప్రధానులపై అనుచిత వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించాడు.

పార్లమెంట్‌లో మాజీ ప్రధాని వాజ్‌పేయ్, పీవీ.నరసింహరావు, సోనియా గాంధీ ఉన్న పాత ఫోటోని ట్విట్టెర్ లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలో సోనియా ముందు వరుసలోవుండగా, ఇద్దరు మాజీ ప్రధానులు  ఆమె వెనుక బెంచ్‌‌లో కూర్చొన్నారు. ఈ ఫోటోపై తనదైన శైలిలో 'బ్యాక్ బెంచర్స్ స్కూల్లోనైనా, పార్లమెంటులో అయినా చెడ్డవారేనని ' చెప్పుకొచ్చాడు. అంతటితో ఆగని వర్మ, ఫోటోలో కనిపించే ముగ్గురు ఎవరో తనకు తెలియదని.. కానీ ఒకరిని మించి మరొకరు చెడ్డవారిలా కనిపిస్తున్నారని వ్యాఖ్యానించాడు.


ఇదే ఫోటోని మళ్ళీ రెండోసారి ఫోస్ట్ చేసి.. మహిళలను అగౌరవంగా చూసే భారతీయ పురుషుల స్వభావాన్ని ఈ ఫోటో తెలియజేస్తోందని, ఫోటోలో ఉన్న వ్యక్తులెవరో పోలీసులు విచారణ జరపాలని డిమాండ్ చేశాడు.

'ఫోటోలో ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎవరైనా కావొచ్చు కానీ లక్షణంగా, హుందాగా ఉన్న ఓ మహిళపై డర్టీ జోక్స్ వేయడం తనను షాక్‌కు గురిచేసిందని ' వ్యాఖ్యానించాడు .

చిత్రంలో మాజీ ప్రధానులు వాజ్ పేయ్, పీవీ.నరసింహరావు, కాంగ్రెస్ ప్రస్తుత అధ్యక్షురాలు సోనియాగాంధీ ఉండడంతో.. వర్మ ట్వీట్ చదివినవాళ్ళు భిన్నమైన రీతిలో స్పందిస్తున్నారు.

ఎవరో తెలియదని చెప్పడం, ఒక పాత ఫోటో ఆధారంగా ట్వీట్ చెయ్యడం, పోలీసుల ఎంక్వయరీ కోరడం లాంటి అవగాహన లేని వ్యాఖ్యల వల్ల, వర్మ తెలివితేటలు నాలెడ్జ్ మీద తప్పకుండా సందేహం కలగక తప్పదు. కేవలం సెన్షేషన్ క్రియేట్ చెయ్యడం కోసం వర్మ ఇలాంటి చౌకబారు వార్తలు సృష్టించడం మానుకోవాలని నెటిజన్లు అభిప్రాయపడ్తున్నారు. 

విజయ్ మాల్యా దీపావళి గిఫ్ట్‌ ఏంటో తెలుసా..?




బ్యాంకులకు చెల్లించాల్సిన 9 వేల కోట్లకు పైగా రుణం ఎగ్గొట్టి గత మార్చి 2న భారత్ వదిలి పారిపోయిన మాల్యా, లండన్‌లో తలదాచుకుంటున్నాడు. అక్కడ కూడా ఆయన విలాసవంతమైన జీవితానికి ఢోకా లేనట్టే కనిపిస్తోంది.

అప్పులు తీర్చడం మాటెలావున్నా, విలాసవంతమైన జీవితం, తన మిత్రులకు పండుగల సందర్భంగా ఖరీదైన గిప్ట్‌లు పంపడం మాత్రం మాల్యా ఇప్పటికీ మానలేదట.


ఈ దీపావళి సందర్భంగా ఆయన తన సన్నిహితులకు యీబీ గ్రూప్ లోగోతో కూడిన బాక్సుల్లో బ్లాక్ లేబుల్ మద్యం బాటిళ్లను పంపించాడని తెలుస్తోంది. జర్నలిస్టు ఒకరు దానికి సంబందించి ఓ ఫోటోను ట్వీట్ చేశారు. అయితే  ఈ గిఫ్టులు అందుకున్నారో, ఆయన స్నేహితులు ఎవరో అనేది మాత్రం స్పష్టం కాలేదు కానీ..ఖరీదైన ఈ మద్యం సీసాల్నే బహుమతులుగా పంపాడట. .

మిఠాయిలు పంచుకోవడం లేదు



ప్రతి పండుగ సమయంలో  సరిహద్దుల వద్ద ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొంటూ మిఠాయిలు ఇచ్చిపుచ్చుకోవడం భారత్‌-పాక్‌ సైనికులకు ఆనవాయితీ.  కాని  ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ ఏడాది దీపావళి పండుగ సందర్భంగా ఇరుదేశాల సరిహద్దు వద్ద ఇరు దేశాల సైనికులు మిఠాయిలు మార్చుకోవడం లేదని బీఎస్‌ఎఫ్‌ అధికారులు వెల్లడించారు.

ప్టెంబర్‌ 29న భారత సైన్యం సర్జికల్‌ స్ట్రైక్స్‌ నిర్వహించినప్పటి నుంచి.. పాక్‌ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఉల్లంఘన, కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

భారత్‌కు చెందిన మన్‌దీప్‌ సింగ్‌ అనే సైనికుడ్ని పాక్‌ రేంజర్లు అతి కిరాతకంగా హతమార్చడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

ప్రతీకారం తీర్చుకున్నారు!



కశ్మీర్‌లోని మచిలీ సెక్టార్‌లో ఉగ్రవాదులు మొన్న భారత జవానును చంపినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని భార్త ఆర్మీ  ప్రకటించిన 24 గంటల్లోనే కెరన్‌ సెక్టార్‌లో పాక్‌ను భారీగా దెబ్బ తీసారు

కవ్వింపు చర్యలతో కాలు దువ్వుతున్న పాకిస్థాన్‌ సైన్యానికి భారత జవాన్లు గట్టిగా బదులిచ్చారు. నియంత్రణ రేఖ వెంబడి,  కెరన్‌ సెక్టార్‌లో పాక్‌ సైన్యానికి చెందిన నాలుగు ఔట్‌పోస్టులను భారత సైన్యం ధ్వంసం చేసింది. అటువైపు భారీ స్థాయిలో 'ప్రాణ నష్టం’ జరిగిందని సైన్యం ప్రకటించింది.

 కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి నిరంతారయంగా పాక్ సైన్యం జరుపుతున్న కాల్పుల్లో ఒక బీఎస్‌ జవాను, మరో స్థానిక మహిళ గాయపడ్డారు. దీంతో  గట్టిగా బదులిచ్చేలా భారత సైన్యం విరుచుకుపడింది.

‘తీవ్ర స్థాయిలో ఎదురు దాడికి దిగాం. పాక్‌ పోస్టులు నాలుగు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అటువైపు భారీగానే ప్రాణనష్టం సంభవించింది’’ అని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు.  భారత సైనికుల ఎదురుదాడిలో 20 మందిదాకా పాక్‌ జవాన్లు మరణించినట్లు తెలుస్తోంది. 

దీపాలు వెలిగించిన కాటమరాయుడు!



పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా కాటమరాయుడు చిత్రబృందం  దీపావళి పండుగ సందర్భంగా  సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది.

 పవన్ కళ్యాణ్, హీరోయిన్ శ్రుతి హాసన్ కలిసి దీపాలను వెలిగిస్తూ కనిపించే ఈ పోస్టర్ సినిమా టైటిల్ కి వున్న మాస్ అప్పీరియన్స్ కి సంబంధంలేనట్టుగా ప్లజంట్ గా అందర్నీ ఆకట్టుకునేలా వుంది.

20 సెకండ్ల పాటు కనిపించే ఈ పోస్టర్‌ను అభిమానుల కోసం దీపావళి సందర్భంగా ప్రత్యేకంగా విడుదల చేశారు.

దటీజ్ వర్మ!



దేశమంతా ఉత్సాహ ఆనందాలతో,  దీపావళి పండుగ చేసుకుంటుంటే, వర్మ తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపాడు. ప్రతీసారి వెరైటీగా గ్రీటింగ్స్ చెప్పే వర్మ ఈ దీపావళికి కూడా అలానే చేశాడు.

ఐ విష్ ఎ వెరీ అన్‌హ్యాపీ దివాళి అంటూ తన ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు. అంతేకాకుండా, అస్తమా, క్రోనిక్ పల్మనరీ వ్యాధుగ్రస్తుల పరిస్థితిని మరింత విషమంగా మార్చుతుందని దీపావళి ని వర్మ అభివర్ణించాడు.

ఇదే సందర్భంగా వర్మ పలు ఆసక్తికరమైన ట్వీట్లు చేశాడు. " నరకాసురుడు ఏమి చేసాడో తెలియకపోయినా, అతని చావుని సెలబ్రేట్ చేసుకుంటున్న అందరికి, పిల్లలు, జంతువులు భయపడేలా కాలుష్యాన్ని సృష్టిస్తున్న వారికి, పెద్ద పెద్ద శబ్దాలతో ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేసే అందరికీ దీపావళి శుభాకాంక్షలు"  అని వర్మ తన అభిప్రాయాన్ని తెలియజేసాడు.

వర్మ శుభాకాంక్షల్ని అతని అభిమానులు మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు.  అందరిలా వుంటే 'వర్మ ' ఎందుకవుతాడు?



29, అక్టోబర్ 2016, శనివారం

కత్తి దూసిన బాలయ్య!!



నందమూరి బాలకృష్ణ తన అభిమానులకు దీపావళి కానుకను అందించాడు.

దసరా పండుగకు ‘సమయం లేదు మిత్రమా.. శరణమా? రణమా?’ అంటూ టీజర్ ద్వారా అభిమానులను అలరించిన బాలకృష్ణ, మరోసారి దీపావళికి ఆసక్తిని పెంచేలా తన శాతకర్ణి చిత్రానికి సంబందించి ఓ ఫోటోని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.

బాలకృష్ణ కత్తదూస్తూ.. ఆవేశంగా కనిపిస్తున్న ఈ ఫోటో అభిమానుల్లో  ఆసక్తినిరేకెత్తుస్తుంది అనడంలో సందేహం లేదు.

తమిళులు కొత్త దైవం ఈ హీరోయిన్‌!




సెంటిమెంట్లకు మారుపేరైన తమిళనాడులో సినీతారల మీద అభిమానం హద్దులు దాటుతుంటుంది.  వారు సినిమా తారలను ఎంతగా ఆరాధిస్తారంటే.. తమ అభిమాన నాయికలకు అఫ్ఫుడప్పుడూ గుళ్ళు కూడా కట్టేసి, పిచ్చి పిచ్చిగా తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు.

 గతంలో మొదటిసారి నటి ఖష్బూను పిచ్చిగా అభిమానించిన తమిళులు ఆమెకు ఓ గుడ్డి కట్టేసి తమ భక్తిని చాటుకున్నారు. ఆ తర్వాత నమిత, హన్సికలకు కూడా గుళ్లు కట్టారు. తాజాగా ఆ జాబితాలోకి యువ హీరోయిన్‌ ‘నేను.. శైలజ’ ఫేమ్‌ 'కీర్తీ సురేష్‌ ' చేరింది.

‘థొడరి’ అనే చిత్రంతో  తమిళ తెరకు పరిచయమైన కీర్తి తక్కువ సమయంలోనే  నాలుగు సినిమాలు చేసేసి, అభిమానుల్ని బాగా సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ తమిళ తంబీలకు తెగ నచ్చేయడంతో ఖుష్బూ, నమిత, హన్సికలతో సమానంగా కీర్తికి కూడా గుడి రెడీ అయిపోతోంది.

కానీ.. దేవతగా ఆరాధించి గుళ్ళు కట్టే తమిళ అభిమానులే, తమకు నచ్చకపోతే, తాము కట్టిన గుడులనే నిర్దాక్ష్యణ్యంగా కూల్చివేసిన ఘటన ఇంతకుముందు హీరొయిన్ 'సిమ్రాన్ ' విషయంలో జరిగివుంది.

శ్రీనివాసరెడ్డి సినిమా సంచలనం!



తనదైన శైలితో మంచి కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న శ్రీనివాస రెడ్డి, ఇదివరకు ‘గీతాంజలి’ వంటి సినిమాలో హీరోలాంటి క్యారెక్టర్‌ చేసాడు. ఇప్పుడు పూర్తిస్థాయి హీరోగా మారి ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా బిజినెస్ సెన్షేషన్ క్రియేట్ చేసినట్టు తెలుస్తోంది.

ఇటీవలె ఈ సినిమాను చూసిన ‘ఇంకొక్కడు’ ఫేమ్‌ నిర్మాత కృష్ణారెడ్డి  ఏడు కోట్ల రూపాయలు చెల్లించి హక్కులు కొన్నాడట. సినిమా చాలా బాగుండడంతోనే కృష్ణారెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నాడని, దీంతో ఈ చిత్రానికి నిర్మాత, దర్శకుడు అయిన కనుమూరి శివరాజ్‌ చాలా ఆనందంగా ఉన్నాడట.

ఓ కమెడియన్‌ హీరోగా నటించిన మొదటి సినిమా ఆ స్థాయిలో అమ్ముడుపోవడమంటే విశేషమే. అందుకే సినీ పరిశ్రమ  జయమ్మునిశ్చయమ్ముర గురించి ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.

 శివరాజ్  మాట్లాడుతూ.. ‘కేవలం మా సినిమా పాట చూసి, సినిమాను ప్రమోట్ చేసిన డైరెక్టర్ సుకుమార్ గారికి, సినిమా నచ్చి, ఈ చిత్రం హక్కులు తీసుకున్న ‘ఎన్.కె.ఆర్ ఫిలిమ్స్’ నీలం కృష్ణారెడ్డిగారికి కృతజ్ఞతలు’ అని తెలిపారు.

‘జయమ్ము నిశ్చయమ్మురా’ సినిమాను నవంబర్ 17న రిలీజ్ కాబోతున్న ఈ మూవీలో పూర్ణ  హీరోఇన్ గా నటిస్తోంది.

ఆ విషయంలో కేసీఆర్‌ నంబర్ 1 !!




 ఇచ్చిన హామీలు నెరవేర్చని సీఎంలలో కేసీఆర్‌ మొదటిస్థానంలో ఉంటారని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించాడు.

వీడీపీ అసోసీఎట్స్ అనే సంస్థ చేసిన సర్వేలో కేసీఆర్ ప్రజాధరణలో నెం 1 స్థానంలో వున్నారని తేలిన నేపథ్యంలో... తప్పుడు సర్వేలతో ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించాడు.

 సర్వేపై నమ్మకం ఉంటే, టీఆర్‌ఎస్‌ ఎన్నికలకు వెళ్లాలని పొన్నం డిమాండ్ చేశారు. అబద్దాలు, ఆర్భాటాలు, అవినీతిలో కేసీఆర్‌ ముందున్నారని పొన్నం ఆక్షేపించాడు. తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చడంలో కూడా కేసీఆర్ నెం 1 గా వున్నారని మాజీ ఎంపీ పొన్నం ఘాటుగా విమర్శించాడు.

చంద్రబాబుకు శంకుస్థాపనల పిచ్చి!




 చంద్రబాబుకు శంకుస్థాపనల పిచ్చి పట్టిందని ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు.

 ఏపీ కొత్త రాజధాని అమరావతికి ఇంకా ఎన్నిసార్లు శంకుస్థాపనలు చేస్తారని నిలదీశారు. శనివారం రఘువీరారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీకి రూ. 2 లక్షల కోట్ల నిధులు కేటాయిస్తున్నామన్న కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటన ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందన్నారు.

14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు అన్ని రాష్ట్రాలకు నిధులు వచ్చినట్టుగానే ఏపీకి కూడా నిధులు కేటాయిస్తున్నారని, అంతేతప్ప, ప్రత్యేక ప్యాకేజీ అంటూ అనడం అంతా బోగస్‌ అని మండిపడ్డారు. విభజన చట్టంలో ఉన్న హామీలను అమలు చేయకుండా, ప్రత్యేక ప్యాకేజీ అనడం ద్రోహం అని ఆయన విమర్శించారు.

ప్యాకేజీకి చట్టబద్ధత కల్పిస్తామనడం మోసానికి పరాకాష్ట అని, నిధులు దుర్వినియోగం చేయొచ్చన్న దురుద్దేశంతోనే చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ అంటున్నారని దుయ్యబట్టారు. 

'ప్రతీకారం తీర్చుకుంటాం'




జమ్మూకశ్మీర్‌లోని మచిక్ సెక్టార్‌లో చొరబడిన ఉగ్రవాదులు భారత జవాను ఒకరిని కాల్చిచంపడంతో పాటు, అతన్ని ముక్కలు ముక్కలుగా నరకడంపై సైన్యంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పాశవిక చర్యకు ప్రతీకారం తీర్చుకుంటామని, దెబ్బకు దెబ్బ తీస్తామని భారత సైన్యం ప్రతినబూనింది.

ఉగ్రవాదులకు సాయం చేయడంలో భాగంగా పాకిస్తాన్ రేంజర్లు బీఎస్ఎఫ్ పోస్టుల మీద శుక్రవారం రాత్రి కాల్పులు జరిపారు. ఓవైపు కాల్పులు జరుపుతుండగానే ఉగ్రవాదులు మచిక్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. దీన్ని సరిహద్దు జవాన్లు తిప్పికొట్టారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతంకాగా, భారత్ జవాను మంజీర్ సింగ్ నేలకొరిగాడు.

 ఉగ్రవాదులు పీఓకేలోకి పారిపోతూ 27 ఏళ్ల భారత జవాన్ మంజీర్ సింగ్ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి తమ క్రూరత్వాన్ని చాటుకున్నారు. ఈ ఘటనపై సైన్యం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తూ పాక్ అధికార, అనధికార ఉగ్ర సంస్థల ప్రమేయంతోనే ఈ ఘాతుకం జరిగిందని, దీనికి ప్రతీకారం తప్పదని హెచ్చరించింది.

దీనిపై హోం మంత్రి రాజ్‌నాథ్ ఘాటుగా స్పందించారు. పాకిస్తాన్ నుంచి జరుగుతున్న కవ్వింపు చర్యలకు ధీటుగా సమాధానమిస్తున్నామని,  ఎవరికీ తాము తలొంచేది లేదని తెలిపారు.

మోదీకి లేఖ రాసిన రాహుల్‌ గాంధీ



సైనికుల సంక్షేమం కోసం కృషి చేయాలని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ  ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా లేఖ రాశారు.

మాజీ సైనికోద్యోగుల కోసం ప్రవేశపెట్టిన ‘ఒకే ర్యాంకు, ఒకే పింఛను’ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, సైనికుల సమస్యలను, జీతాలకు సంబంధించి ఇబ్బందులను పరిష్కరించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.

దీపావళి సందర్భంగా సైనికులకు శుభాకాంక్షలు తెలుపుతూ సందేశాలు పంపించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రచారంపై రాహుల్‌ విమర్శలు చేశారు. కేవలం మాటలు మాత్రమే కాదని, చేతల్లో కూడా చూపించాలని సైనికులకు అందుతూన్న పథకాలపై ప్రత్యేక శ్రద్ద చూపాలని మొదీకి సూచించారు.

చిరు పోస్టర్‌పై వర్మ ట్వీట్!



మెగాస్టార్ చిరంజీవి నూటయాబైయ్యవ సినిమా ‘ఖైదీ నంబర్‌ 150’.

దీపావళి సందర్భంగా నిర్మాత, చిరు తనయుడు రామ్‌చరణ్‌  డాన్స్ లుక్ లో ఉన్న చిరు ఫొటోలను ఈరోజు అభిమానులతో పంచుకున్నారు. దీనిపై దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ తనదైన శైలిలో స్పందించారు. ‘నేను ఏడేళ్ల కిందట చూసిన చిరంజీవి కంటే ఏడేళ్లు చిన్నగా ఉన్నారు’ అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు.

 బాస్‌ ఈజ్‌ బ్యాక్‌, అంటూ ఇక రామ్‌చరణ్‌, వరణ్‌తేజ్‌లు కామెంట్‌ చేయగా,  ‘కొందరు వయసుకి తగ్గ పాత్రలు చేస్తారు., ఆయనకి మాత్రం పాత్రను బట్టి వయసు డిసైడ్‌ అవుతుంది’ అంటూ చిరు పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు క్రేజీ స్టార్ సంపూర్ణేష్‌బాబు.

28, అక్టోబర్ 2016, శుక్రవారం

మామకు 'నో' అల్లుడికి గ్రీన్ సిగ్నల్!



పవర్ స్టార్ మూవీ  'అత్తారింటికిదారేది ' లో ఐటం సాంగ్ చేసే ఛాన్స్ వచ్చినా.. 'నో ' చెప్పిన యాంకర్ అనసూయ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయిధరం తేజ్ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ లో నటించడానికి యస్ చెప్పిందట!

తాజా సమాచారం ప్రకారం సాయిధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ 'విన్నర్' లో అనసూయ ఐటం సాంగ్ లో మెరవబోతోందట. ఈ సినిమాకు దర్శకుడు గోపీచంద్ మలినేని. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది..

 'సోగ్గాడే చిన్నినాయన' లో నాగ్ తో ఆడి ప్రేక్షకుల్ని మురిపించిన జబర్దస్త్ బ్యూటి అనసూయ, తేజ్ తో కూడా జోడీ కట్టబోతోంది.

అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఐటం సాంగ్ లో నటించడానికి పవర్ స్టార్ కి ఎందుకు నో చెప్పినట్టు? సాయిధరం తేజ్ కి మాత్రం ఎందుకు ఓకే చెప్పినట్టు?? 

మా ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు!!



రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు, ప్రజాసంఘాలు, అధికారుల ఫోన్లను ప్రభుత్వం ట్యాపింగ్‌ చేస్తోందని వైకాపా అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశాడు.

ముఖ్యమంత్రి చంద్రబాబు  తన ప్రభుత్వ రాజకీయ, ఆర్థిక కార్యకలాపాల్లో జరుగుతున్న అవినీతిని ఎవరూ ప్రశ్నించకుండా అణిచివేసేందుకే ఫోన్‌ ట్యాపింగ్‌ చేయిస్తున్నాడని భూమన పేర్కొన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు, అదే అస్త్రాన్ని ప్రతిపక్షాలపై ప్రయోగించడం దారుణమన్నారు.

ఇలాంటి ప్రజ వ్యతిరేక విధానాల్ని ధైర్యంగా ఎదుర్కొంటామని ఆయన చెప్పాడు.

ఇప్పటికైనా ఒప్పుకున్నాడు..!



 జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని  తీవ్రంగా ప్రయత్నిస్తున్న భారత్ కు మన పొరుగుదేశం నుంచే గట్టి మద్దతు దొరికింది.!

 కార్గిల్ యుద్ద సూత్రదారి, పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్ మసూద్ అజహర్ ను ఉగ్రవాది అని పేర్కొన్నాడు. మసూద్ పాక్‌లో కూడా బాంబు దాడులకు పాల్పడ్డాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

పాకిస్థాన్‌లోని ఓ టీవీ ఛానల్‌తో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.

 అయితే అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి ప్రకటించే విధంగా చేయాలని చైనాను పాకిస్థాన్ ఎందుకు కోరడం లేదన్న ప్రశ్నకు ముషర్రఫ్ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. మసూద్ అజహర్‌తో  చైనా కు సంబంధం లేదని, చైనాను ఈ అంశంలోకి లాగొద్దని ఆయన అన్నాడు.

 నవాజ్ షరీఫ్ ప్రభుత్వ దూకుడుగా వ్యవహరించడం లేదని అంతర్జాతీయంగా దౌత్యపరంగా పాకిస్థాన్ విఫలమైందని అంగీకరించాడు.

మసూద్‌ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న ప్రతిపాదన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పరిశీలనలో ఉంది. అయితే  సరైన సాక్ష్యాధారాలు లేవంటూ ఆ ప్రయత్నాలను చైనా అడ్డుకుంటోంది. . ఈ నేపథ్యంలో మసూద్ ఉగ్రవాది అని ముషర్రఫ్ చెప్పడంతో ఆయన భారత్‌ వాదనను సమర్థించినట్లయింది.

ముషర్రఫ్ వ్యాఖ్యల తర్వాతైనా.. మసూద్ అజహర్ పట్ల చైనా తన అభిప్రాయం మార్చుకుంటుందేమో చూడాలి.

గ్రీటింగ్స్ ఇలాకూడా చెప్తారా బ్రహ్మాజీ..?




న్యూస్ చదవకుండా ఈ పోటో చూస్తే మాత్రం  బ్రహ్మాజీకి ఏం జరిగిందో అని ఆందోళణ   పడ్డం ఖాయం.,

కానీ ఇదేదో సీనిమాలో మేకప్ కాదు, అలాగని ఏదైనా ఆక్సిడెంట్లో తగిలిన గాయాలు అస్సలు కాదు.

దీపావళి కి వెరైటీగా శుభాకాంక్షలు చెప్పాలని బ్రహ్మాజి ఈ విధంగా ప్లాన్ చేశాడు. ఈ ఫోటోను స్వయంగా బ్రహ్మాజీనే తన ఫేస్‌బుక్‌ ఖాతాలో షేర్ చేసాడు. ఫోటో కింద  ‘హ్యాపీ దీపావళి’ అని కామెంట్‌ కూడా పెట్టాడు. అంటే దీపావళి శుభాకాంక్షలతో పాటుగా..  జాగ్రత్తగా ఉండకపోతే ఇలాగే జరుగుతుంది అంటూ హెచ్చరించడానికే ఇలా చేసాడట..!

ఐనా.. జడుసుకుని చచ్చేట్టుగా ఇదేం వెరైటీ గ్రీటింగ్స్  బ్రహ్మాజీ..??

అమితాబ్ తో పనేంటి రాజమౌళి?



రామ్‌గోపాల్‌ వర్మ ‘సర్కార్‌-3’  షూటింగ్ స్పాట్  సంచలనాలకు కేంద్రంగా మారుతోంది.

అమితాబ్ నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ స్పాట్‌ కి ఈమధ్య నందమూరి బాలకృష్ణ, కృష్ణవంశీ వెళ్ళిన విషయం తెలిసిందే.

తాజాగా అమితాబ్‌ను కలవడానికి బాహుబలి దర్శకుడు రాజమౌళి కూడా అ సినిమా సెట్స్‌కు వెళ్లాడు.  ఈ విషయం రామ్‌గోపాల్‌ వర్మ తన ట్విట్టెర్ ద్వారా తెలియజేశాడు.

‘సర్కార్‌ సెట్స్‌పై యాక్టింగ్‌లో బాహుబలితో.. సినిమా మేకింగ్‌లో బాహుబలి’ అని వర్మ ట్వీట్ చేసాడు. దాంతోపాటే అమితాబ్, రాజమౌళి నిల్చుని మాట్లాడుకుంటున్న ఫోటోను షేర్‌ చేశాడు.

అయితే రాజమౌళి అక్కడకు ఎందుకు వెళ్లాడో, అమితాబ్ తో ఏమి మాట్లాడాడో  మాత్రం  వర్మ వెల్లడించలేదు.

అయితే తన తదుపరి సినిమాలో బిగ్ బీ చేత నటింపచేయాలనే ప్రయత్నంలో భాగంగా రాజమౌళి వెళ్ళి వుంటాడని పరిశ్రమ వర్గాలు అనుకుంటున్నాయి.

మూడు హెలికాప్టర్లతో గాలింపు



ఏఓబి లో ఎన్ కౌంటర్ తర్వాత   మావోయిస్టు అగ్రనేత ఆర్కే లక్ష్యంగా  ఆంధ్రా-ఒడిసా సరిహద్దు ప్రాంతంలో మూడు రోజులుగా విస్తృత స్థాయిలో గాలింపు జరుగుతోంది. గురువారం ఏకంగా మూడు హెలికాప్టర్లతో ప్రత్యేక దళాలు గాలింపు చేపట్టారు.


 బూసిపుట్టు, కుమడ, రంగబయలు, బాబుశాల, బుంగాపుట్టు, రామగూడ, బెజింగి, పసనపుట్టు, పనస, పంపరమెట్ట, సిర్లమెట్ట తదితర ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో గాలింపు జరుగుతున్నాయి.

ఓ వైపు ఇలా వుండగా మావోయిస్ట్ నేత ఆర్కే ఆచూకి పై ఇరువర్గాల్లో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ఆర్కే పోలీసుల అదుపులోనే వున్నట్టు ప్రజాసంఘాలు అనుమానిస్తుండగా, పోలీసువర్గాలు మాత్రం ఆమాటల్ని కొట్టిపారేస్తున్నాయి.

అనధికారకంగా అందిన సమాచారం మేరకు ఎన్ కౌంటర్ సంఘటనలో గాయపడ్డ ఆర్కే, ఏఓబి పరిసర ప్రాంతాల్లోనే వున్నట్టు తెలుస్తోంది. తప్పించుకున్న మావోయిస్ట్ లు ఎవరైనా గాయపడివుంటే చికిత్స చేయిస్తామని నిన్న డీజీపి ప్రకటించడం కూడా.. ఆర్కే గాయపడ్డాడని చెప్పడానికి ఆధారంగా కనిపిస్తోంది.

27, అక్టోబర్ 2016, గురువారం

అనారోగ్యానికి కారణం చేతబడే!!




చేతబడి చెయ్యడం వల్లే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, ఈ రాష్ట్ర మాజీ సీఎం కరుణానిధి అనారోగ్యం పాలయ్యారని  ఓ జ్యోతిష్యుడు చెప్పినట్లు పలు వెబ్ సైట్లలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

జయ 36 రోజులుగా ఆసుపత్రిపాలు కావడానికి, తాజాగా ఈమధ్యనే కరుణానిధి కూడా అనారోగ్యంతో ఆసుపత్రిలో  చేరడానికి అసలు కారణం అదేనని తన పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆ జ్యోతిష్యుడు చెప్పాడనే వార్త సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడ్తోంది.

అసలే భక్తి, సెంటిమెంట్లూ ఎక్కువ కలిగిన తమిళ ప్రజలు ఈ వార్తలతో ఆందోళన చెందుతున్నట్టు తెలిసింది. ఇందుకు విరుగుడు చేయిస్తే వారిద్దరూ కోలుకుంటారని సదరు జ్యోతిష్కుడు పేర్కొన్నాడట.

ఇటు అన్నాడీఎంకే, అటు డీఎంకే పార్టీలవారు ఒకరి నేతపై మరొకరు చేతబడి చేయించుకుని వుంటారని సాధారణ ప్రజలు అనుకుంటుండగా, పరిశీలకులు మాత్రం ఇది ఒట్టి ఆకతాయి చర్యలుగా కొట్టిపడేస్తున్నారు.

ఇలా వుండగా జయ చక్కగా కోలుకున్నారని, మునుపటి కంటే ఆమె ఆరోగ్యం చాలా మెరుగుపడిందని అపోలో వర్గాలు తన ప్రకటన ద్వారా స్పష్టం చేశాయి. ఆమె అందరిలానే మాట్లాడగలుగుతున్నారని కూడా ఆ వర్గాలు వివరించాయి.

మరోప్రక్క యూపీ సీఎం అఖిలేష్ కుటుంబంలో రగిలిన చిచ్చుకు కూడా కారణం ఇలాంటిదేననై పుకార్లు సంచారం చేస్తున్నాయి. తండ్రీ కొడుకులు సైతం శత్రువులుగా మారి కలహించుకోవడానికి కారణం చేతబడేనని కొందరు అనుమానాలు రేకిత్తిస్తున్నారు. దీనికి ఆధారంగా ములాయం, అఖిలేష్‌లకు హాని కలిగించేందుకు తాంత్రిక ప్రయోగం జరుగుతోందంటూ ములాయం సోదరుడు రాంగోపాల్ ఆ మధ్య రాసిన ఒక లేఖను కొందరు ఉటంకిస్తున్నారు.

ప్రజల సెంటిమెంట్లను అడ్డం పెట్టుకుని ఇలాంటి అనుమానాల్ని పోగేసేవారికి మాత్రం మంచి టైంపాస్ అవుతోందని అనుకుంటున్నారు.

కేజ్రీవాల్‌ను చంపేస్తా..!!




దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కాల్చి చంపేస్తామంటూ రవీంద్రకుమార్ తివారీ అనే వ్యక్తి బెదిరించాడు.   ఈశాన్య ఢిల్లీ, ఖజురీఖాన్ ప్రాంతానికి చెందిన రవీందర్ ఎమర్జెన్సీ నెంబర్ 100కు కాల్ చేసి బెదిరించాడు.

అయితే అతను మందు తాకిన మైకంలో అలా చేశాడని విచారణలో తేలింది. ఆయనకు మతిస్థిమితం సరిగా లేదని పోలీసులు చెప్పారు. కానీ ముందు జాగ్రత్త చర్యగా సీఎం క్యాంప్ కార్యాలయానికి భద్రత పెంచారు.

అమ్మో పిల్లలా..లావెక్కిపోతాను!!




మెగాస్టార్‌ కోడలు, మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌  శ్రీమతి  ఉపాసన ఇన్నాళ్ళకు తన మనసులోని మాటల్ని మీడియాతో పంచుకుంది.  ఓ ఇంటర్వ్యూ లో తన అందం, పిల్లలు, డైవర్స్‌ గాసిప్స్‌..  ఇలా అన్నింటి గురించి సమాధానం ఇచ్చింది.

పెళ్లి సమయంలో ఉపాసన అందం గురించి చాలా కెమెంట్లు వచ్చాయన్నదానికి  స్పందిస్తూ.. ‘మా ఆయనకు చాలామంది గార్ల్ ఫ్యాన్స్‌ ఉన్నారు. వాళ్లంతా చరణ్‌కు బాగా అందంగా ఉన్న అమ్మాయే భార్యగా రావాలని కోరుకున్నారేమో... అందుకే నా అందాన్ని అలా విమర్శించారు, అయినా నేను దాన్ని కాంప్లిమెంట్‌గానే తీసుకున్నానని ' సమాధానం చెప్పింది.

 ఇక, పెళ్లి అయ్యి 4 యేళ్ళు గడుస్తున్నా, పిల్లల్ని కనకపోవడానికి కూడా వివరిస్తూ... ' ఎంతో కష్టపడి బరువు తగ్గాను. ఇప్పుడు పిల్లలంటే మళ్లీ బరువు పెరిగిపోతాను. నేను ఎప్పుడైతే పిల్లల్ని కనాలనుకుంటానో అప్పుడే కంటాను. దాని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు.,  పిల్లలు అనేది పర్సనల్‌ విషయం. ఇప్పుడే మేం సొంత ఇల్లు కట్టుకుంటున్నాం. ఆ తర్వాతే పిల్లలు’ అని చెప్పింది.

అలాగే చరణ్‌తో డైవర్స్‌ గ్యాసిప్‌లపై కూడా మాట్లాడుతూ.. ‘నిజానికి మేం గనక డైవర్స్‌ తీసుకోవాలనుకుంటే, మేమే మీడియా ముందుకు వచ్చి చెబుతాం.,  మాకలాంటి ఆలోచనే లేదు, ఎందుకంటే మేమిద్దరం బెస్ట్‌ఫ్రెండ్స్‌., కాబట్టి డైవర్స్‌ రూమర్లను ఇకనైనా ఆపండి’ అని చెప్పింది.

‘ఇజం’ సల్మాన్‌తో..!!




కల్యాణ్‌ రామ్‌ కథానాయకుడిగా నటిస్తూ నిర్మించిన "ఇజం " ని బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో రీమక్ చెయ్యలని అనుకుంటున్నట్టు తెలిసింది.

పదిరోజుల క్రితం తెలుగులో రిలీజైన ఈ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ కథాంశం బాలీవుడ్ ప్రేక్షకులకైతే నచ్చుతుందని దర్శకుడు పూరీ అనుకుంటున్నాడట.

ఇంతకుముందు పూరి జగన్నాథ్‌ సినిమా ‘పోకిరి’ ని బాలీవుడ్‌ లో ‘వాంటెడ్‌’ పేరుతో సల్మాన్‌ ఖాన్‌ హీరోగా రీమేక్‌ చేశారు.  ఈమధ్య ‘బిజినెస్‌మేన్‌’, ‘టెంపర్‌’ కథల్ని అక్కడ రీమేక్‌ చేయాలని పూరి ప్రయత్నించినా ఎందుకో కుదర్లేదు.

బాలీవుడ్‌ చిత్రానికి కూడా కల్యాణ్‌రామ్‌ నిర్మాతగా వ్యవహరిస్తాడనీ, ఇందుకు సంబంధించి సల్మాన్‌ఖాన్‌తో  సంప్రదింపులు మొదలెట్టారని సమాచారం. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

సమంత కూడా...చెప్పేసింది!



అంతవరకూ సమంతతో ప్రేమ వ్యవహారంలో నాగచైతన్య సైలెంట్‌గానే మేనేజ్ చేస్తూ వచ్చినా.. ఇటీవలి ‘ప్రేమమ్‌’ ఇంటర్వ్యూల సందర్భంగా ఓపెన్‌ అయిపోయాడు.

ఇప్పుడు సమంత కూడా ట్విట్టెర్ లో  ధైర్యంగా చైతు గురించి మాట్లాడుతోంది.

బుధవారం సాయంత్రం అభిమానులతో జరిగిన ట్విట్టర్‌ సంభాషణలో ప్రశ్నలకు సమంత ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది.

‘ఏ మూడు లేక పోతే మీరు జీవించలేరు..?’ అని ఓ ఫ్యాన్‌ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ‘చైతూ, మస్కతీ ఐస్‌క్రీమ్‌, వర్క్‌’ అని సమాధానమిచ్చింది సమంత.

 అలాగే ఓ అభిమాని  సరదాగా ‘చైతన్య ఎందుకు? నన్ను పెళ్లి చేసుకోకూడదా?’ అని అడిగినందుకు,  స్పందిస్తూ ‘చేసుకోకూడదు. ఎందుకంటే నేను నిన్ను 8 సంవత్సరాల క్రితం కలవలేదు. మనిద్దరం బెస్ట్‌ ఫ్రెండ్స్‌ కాదు కదా’ అంటూ తెలివిగా సమాధానమిచ్చింది.

ఎనిమిదేళ్ళనుంచీ స్నేహం చేసుకుంటున్న బెస్ట్ ఫ్రెండ్స్, అలా అలా ప్రేమికులైపొయారన్నమాట!

హైక్‌ లో కూడా వీడియో కాల్‌




వాట్స్‌ప్‌ వీడియో కాల్‌ ఫీచర్‌ ఇచ్చిన కొన్ని గంటల్లోనే దేశీయ చాటింగ్‌ యాప్‌ 'హైక్‌ ' కూడా వీడియో కాలింగ్‌ ఫీచర్ ని విడుదల చేసింది.

స్థానిక యాసలు, స్టిక్కర్స్‌ ప్రత్యేకత కలిగిన ఈ యాప్‌ వీడియో అప్‌డేట్‌తో వినియోగదారులకు మరింత చేరువ కానుంది. 2జీ నెట్‌వర్క్‌ లోనూ మంచి క్వాలిటీతో వీడియో కాల్‌ అందించేందుకు ప్రయత్నిస్తున్నామని సంస్థ ప్రకటించింది.

26, అక్టోబర్ 2016, బుధవారం

విషప్రయోగం జరగలేదు




ఏవోబీలో ఎన్‌కౌంటర్‌కు ముందు మావోయిస్టులపై విషప్రయోగం జరిగిందన్న ఆరోపణలను ఏపీ డీజీపీ సాంబశివరావు ఖండించారు. వారిపై ఎలాంటి విషప్రయోగం జరగలేదని చెప్పారు. కొండపైనుంచి మావోయిస్టులు కాల్పులు జరిపిన తర్వాతే పోలీసులు కాల్పులు జరిపారని ఆయన స్పష్టం చేశారు.

ఈరోజు ఉదయం మావోయిస్టు పార్టీ ఏపీ కమిటీ అధికార ప్రతినిధి శ్యామ్‌ మాట్లాడుతూ.. కోవర్ట్ ద్వారా విషాహారం పంపించి, అది తిన్న మావోయిస్టులు అపస్మారక స్థితిలో వున్నపుడు పోలీసులు కిరాతకంగా చంపారని ఆరోపించిన విషయం తెలిసిందే.

  డీజీపీ మాట్లాడుతూ..గాయపడిన మావోయిస్టులు ఏవోబీలో తలదాచుకున్నారనే సమాచారం ఉందని, వారు లొంగిపోతామంటే, మీడియాను తీసుకువెళ్లి, వైద్య సేవలు అందిస్తామని,  మావోయిస్టులకు పోలీసులు వ్యతిరేకం కాదని, వారి విధానాలనే వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు.

రంభ పిటిషన్ ట్విస్ట్!!



 తన దాంపత్య హక్కులను పునరుద్ధరించాలని, కెనడాలో వున్న తన భర్తతో కలిసి జీవించేలా అత్తింటి తరపు వారిని ఒప్పించాలని నిన్న చెన్నై కుటుంబ న్యాయస్థానంలో పిటిషన్‌ వేసిన వెటరన్  సినీనటి రంభ, దానికి అనుబంధంగా బుధవారం మరో పిటిషన్‌ వేసింది.

మొదటి పిటిషన్‌ అంశంలో కోర్టు తుది ఉత్తర్వులు జారీచేసే లోపు, తనకు నెలకు రెండున్నర లక్షల రూపాయల భృతిని భర్త నుంచి ఇప్పించాల్సిందిగా కోరుతూ  ఈరోజు తన రెండో పిటిషన్‌లో పేర్కొంది.

 కెనడాలో వ్యాపారాలు చేస్తున్న తన భర్త నెలకు రూ.25లక్షల వరకు సంపాదిస్తున్నాడని, తనకు నటిగా ప్రస్తుతం అవకాశాలేవీ రావడం లేదని, ఇతర ఆదాయ మార్గాలేవీ లేవు కాబట్టి, తాను, తన ఇద్దరు కుమార్తెల పోషణ, ఇతర ఖర్చుల నిమిత్తం నెలకు రెండున్నర లక్షల రూపాయలు ఇచ్చేలా తన భర్త ఇంద్రన్‌కు ఆదేశాలు జారీ చేయాలని రంభ తన పిటిషన్‌లో కోరింది.

నిజానికి రంభ భర్త దగ్గరకు తిరిగి వెళ్ళాలని కోరుకోవడం లేదనీ, కేవలం భృతికోసమే ఇలా కోర్టుకెక్కిందనీ పరిశీలకులు అభిప్రాయ పడ్తున్నారు. నాలుగేళ్ళుగా భర్త నుంచి వచ్చేసి ఇండియాలో వుంటున్న రంభ ఇప్పుడు పిటిషన్ వెయ్యడం వెనుక అసలు కారణం అదేనని అనుకుంటున్నారు.

అబ్బే అలాంటిదేం లేదు!




వరుసగా మూడు సినిమాలతోనూ భారీ విజయాల్ని నమోదు చేసిన  దర్శకుడు కొరటాల శివ తదుపరి సినిమాపై వస్తున్న రూమర్లకు తెరపడిపోయింది.

ఈసారి శ్రీమంతుడు మహేష్ బాబుతో తీయబోతున్న సినిమా గురించి వచ్చిన రూమర్ల పై  క్లారిటీ ఇచ్చేశాడు శివ.

ఈ మూవీలో మహేష్తో కలిసి నాగార్జున గానీ, బాలక్రిష్ణ గానీ నటిస్తారని ఫిల్మ్ నగర్ లో రూమర్లు చక్కర్లు కొడ్తున్నాయి. వీటన్నిటికీ ముగింపు పలుకుతూ ట్వీట్ చేశాడు.

''నేను తదుపరి చేయబోయే సినిమాలో ఎటవుంటి ఫ్యాన్సీ కాంబినేషన్లూ లేవు. అదే విధంగా నా సినిమా మల్టీ స్టారర్ కూడా కాదు. అసలు బయట వినిపిస్తున్న స్పెక్యులేషన్లు ఏవీ పట్టించుకోకండి'' అంటూ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. చేసాడు.

ఇప్పటివరకు శివ చేసిన సినిమాల్లో..  మిర్చిలో సత్యరాజ్, శ్రీమంతుడు లో జగపతిబాబు, అలాగే జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్, ఇలా దాదాపు ప్రతీ సినిమాలోనూ హీరో ప్రక్కనే ఎవరో ఒక పెద్ద స్టార్ ను మల్టీ కంబినేషన్ గా నిలబెడుతూ వచ్చాడు కాబట్టి మహేష్ బాబు సినిమాపై కూడా పెద్ద స్టార్ ఎవరైనా ఉండొచ్చనే అంచనాలు ప్రేక్షకులకు కలగడంలో తప్పులేదు కదా.  

వాట్సప్ లో వీడియోకాల్!




మొబైల్ ఫ్రీమెసేజ్, కాల్స్ విషయంలో వాట్సప్ ని మించిన యాప్ లేదన్నది తెలిసిన విషయమే.  టెక్స్ట్ మెసేజ్ లు, వాయిస్ మెసేజ్ లు, వీడియోలు, ఆడియోలు, ఫోటోలు ఇలా అన్నీ ఇతరులతో షేర్ చేసుకునే అవకాశం ఈ యాప్ కల్పించింది.

అయితే ఇన్నివున్నా ఈ యాప్ వినియోగదారుల్లో ఉన్న కొద్ది పాటి నిరాశ ఏమైనా ఉందంటే అది కచ్చితంగా వీడియో కాల్ ఆప్షన్ లేకపోవడమే. అయితే తాజాగా సౌకర్యాన్ని కూడా కలుపుకుని ముందుకురాబోతోంది వాట్సప్!

ఆండ్రాయిడ్ బీటావర్షన్ తో వీడియో కాల్ చేసుకునే ఫీచర్ ను వాట్సప్ తాజాగా యాడ్ చేసింది.  కాకపోతే ఈ ఆప్షన్ ప్రస్తుతానికి  బీటా 2.16.316 ఆ తరవాత వచ్చిన వర్షన్లలో అందుబాటులో వుంటుంది. మీరు వీడియో కాల్ చేయాలంటే కచ్చితంగా అవతలివారు కూడా ఈ వెర్షన్లకు అప్ డేట్ అయి ఉండాలి!

 రెగ్యులర్ వెర్షన్ వాడేవాళ్లంతా బీటావర్షన్ ను ప్లేస్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లేస్టోర్  లేదంటే ఏపీకే మిర్రర్ వంటి వెబ్ సైట్ల ద్వారా బీటా వర్షన్ 2.16.316 లేదా 2.16.318 వర్షన్లు నేరుగా డౌన్లోడ్ చేసుకోవొచ్చు. 

చంద్రబాబు కుటుంబంపై ఆత్మాహుతి దాడి చేస్తాం !!




విశాఖ మారణకాండ ఫలితాన్ని త్వరలోనే సీయం చంద్రబాబు అనుభవిస్తాడని మావోయిస్టు పార్టీ ఏపీ కమిటీ అధికార ప్రతినిధి శ్యామ్‌ సంచలనాత్మక వ్యాఖ్యలు చేశాడు.

ఏవోబీ ఎన్‌కౌంటర్‌లో కోలుకోలేని దెబ్బతిన్న మావోయిస్టులు తీవ్రంగా స్పందించారు. ' లోకేష్, చంద్రబాబు మా నుంచి తప్పించుకోలేరు, అవసరమైతే చంద్రబాబు కుటుంబంపై ఆత్మాహుతి దాడి చేస్తాము, ఎల్లకాలం పోలీసులు, మిలట్రీ కాపాడలేరని మావోయిస్టులు తీవ్రంగా హెచ్చరించారు.

కోవర్టు ద్వారా అన్నంలో విషం కలిపి,  స్పృహతప్పిన మావోయిస్టులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారని  శ్యామ్‌ ఆరోపించారు. పోలీసుల ఆధీనంలో ఉన్న మావోయిస్టులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.  అవార్డులు, రివార్డుల కోసం పోలీసులు,మిలటరి కిరాయి హత్యలకు పాల్పడుతోందన్నారు.

అమరవీరుల త్యాగాలకు తప్పక ప్రతీకారం తీర్చుకుంటామని,  రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తామని వారు చెప్పారు.

 2003 అక్టోబర్ 1న అలిపిరి వద్ద జరిగిన మందు పాతర దాడిలో చంద్రబాబు తృటిలో తప్పించుకున్న విషయం తెలిసిందే.

మావోయిస్టుల ప్రకటనతో ఒక్కసారిగా రాష్ట్రం వేడెక్కింది.

శివగామి అలా మిస్సైంది!!




సంచలనాత్మక విజయాన్ని సాధించిన బాహుబలి లో ప్రదానపాత్రలో నటించే అవకాశాన్ని కోల్పోయిన జాబితాలో తాజాగా మంచు లక్ష్మి కూడా చేరింది!

శివగామి పాత్రకు సంబంధించి ఈ ఆసక్తికర విషయం స్వయంగా లక్ష్మి చెప్పడంతో వెలుగులోకి వచ్చింది. ఈ పాత్ర చేయడానికి రమ్యకృష్ణను అడగటానికి ముందు మంచులక్ష్మిని చేయమని రాజమౌళి అడిగారట. అయితే ప్రభాస్‌కు తల్లిగా చెయ్యడమనే విషయం ఫన్నీగా తోచడంతో  మంచు లక్ష్మి తిరస్కరించిందట.

 మంచు లక్ష్మి తర్వాత ఈ ఆఫర్ శ్రీదేవీ, టబుల వరకూ వెళ్ళినా పలు కారణాల వల్ల.. చివరికి రమ్యకృష్ణకు ఆ పాత్ర చేసే బంపర్ అవకాశం దక్కింది.

 శివగామి పాత్ర బాహుబలి లో ఎంత సెన్షేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.  ఆ క్యారెక్టర్ చేసుంటే, లక్ష్మి ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో ఉండేదని సినీ అభిమానులతో పాటుగా, మంచు లక్ష్మి కూడా అనుకునివుండొచ్చు.

రష్మీ ని అడిగి చూడండి!!





 వెండితెర మీద అనుకున్నంత  స్థాయిలో సక్సెస్‌ సాధించలేకపోయినా, అడపా దడపా అవకాశాలను మాత్రం కొల్లగొట్టేస్తున్న జబర్దస్త్ యాంకర్ రష్మి వార్తల్లో మాతరం ఎప్పుడూ నిలుస్తూనే వుంది.

 ఇప్పటివరకు తను చేసిన సినిమాల్లో ఎక్స్ పోజింగ్ కి ఏమాత్రం వెనకడు వేయని రష్మి నిన్న విలేకరులతో మాట్లాడుతూ..పెద్ద సినిమాల్లో  ఐటెంసాంగ్స్‌ చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదనీ, ఐతే ఇంత వరకూ తనను వీటికోసం ఎవరూ సంప్రదించలేదని చెప్పింది. ఐటంసాంగ్స్‌ కంటే స్పెషల్ సాంగ్స్ లో చెయ్యడానికి ఇష్టపడుతానని రష్మిగౌతం తెలియజేసింది.

ఐటం సాంగ్ కి, స్పెషల్ సాంగ్ కి తేడా ఏంటో రష్మి నే చెప్పాలి కానీ.. ఏది చేసినా, చూడ్డానికి అభిమానులు మాత్రం ఆత్రుతగానే వున్నారు.



ఠాక్రే డిమాండ్‌ ఒప్పుకోం!!



మహారాష్ట్ర నవనిర్మాణసేన (ఎమ్‌ఎన్‌ఎస్‌) అధినేత రాజ్‌ ఠాక్రేకు  బిజేపి అగ్రనాయకులు షాక్ ఇచ్చారు.

‘యే దిల్‌ హై ముష్కిల్‌’ సవ్యంగా విడుదల కావాలంటే, ఆ చిత్ర నిర్మాతలు ఆర్మీ సంక్షేమ నిధికి రూ.5కోట్లతో పాటు, ఇంకెప్పుడూ తమ సినిమాల్లో పాక్ కళాకారులకు అవకాశం ఇవ్వమనే ఒప్పంద పత్రం ఇవ్వాలని చేసిన ఠాక్రే డిమాండ్‌ను కేంద్రమంత్రులు మనోహర్‌ పరీకర్‌, వెంకయ్య నాయుడు ఖండించారు.

ఎమ్‌ఎన్‌ఎస్‌ పార్టీది తప్పుడు ప్రతిపాదన అని, దీంతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని వెంకయ్య అన్నారు. మరోవైపు ఠాక్రే ప్రతిపాదనను సమావేశంలో తాను అంగీకరించలేదని మహారాష్ట్ర సీఎం పడ్ణవీస్ తెలియచేసాడు.

ఆర్మీ సంక్షేమ నిధికి విరాళం కోసం ప్రభుత్వం ఎవరినీ బలవంత పెట్టదని పరీకర్‌ ఢిల్లీలో మంగళవారం స్పష్టం చేశారు. స్వచ్ఛందంగా ఇచ్చే విరాళాలనే ఆర్మీ స్వీకరిస్తుందని పరీకర్ తేల్చి చెప్పాడు.

‘'దాడి మేమే చేశాం '!!




దాదాపు ఒకటున్నర నెల తర్వాత, ఉరీ ఉగ్రదాడికి పాల్పడింది తామేనని  పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థ లష్కరేతోయిబా ప్రకటించింది.

సెప్టెంబరు 18న తెల్లవారుజామున ఉరీ భారత సైనికస్థావరంపై లష్కరే ఉగ్రవాదులు జరిపిన దాడిలో 20 మంది భారత సైనికులు మరణించిన సంగతి తెలిసిందే.

ఈ ఆత్మాహుతిదాడిలో  ప్రాణాలు కోల్పోయిన ఉగ్రవాదులకు నిర్వహించబోయే అంతిమ కార్యానికి హాజరై, నివాళులు అర్పించాలని లష్కరే తోయిబా పాకిస్థాన్‌ ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు పాకిస్థాన్‌లోని గుజ్రన్‌వాలా ప్రాంతంలో గోడలకు పోస్టర్లు అంటించారు.

 కాగా ఈ దాడికి పాల్పడింది మసూద్‌ అజర్‌ నేతృత్వంలోని జైషే మహ్మద్‌ సంస్థగా భారత సైన్యం ప్రకటించివుంది. 

25, అక్టోబర్ 2016, మంగళవారం

రాజుగారి గదిలో నాగార్జున..?



 మొదటిసారిగా నాగార్జున ప్రేక్షకుల్ని భయపెట్టపొతున్నాడు.! కొత్తదనం ఎక్కడ వున్నాకొత్త  భుజం తట్టి ప్రోత్సహించే నాగ్ తనవంతుగా ఓ చిన్న సినిమాలో భాగస్వామి కాబోతున్నాడు.

తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి, మంచి విజయాన్నే నమోదు చేసిన  ‘రాజుగారి గది’  సీక్వెల్ లో నాగార్జున ఓ ముఖ్యమైన పాత్రలో మెరవబొతున్నాడని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తొంది.

 'రాజుగారి గది 2’ లో  కీలకమైన పాత్రలో నటించడానికి ముందుగా విక్టరీ వెంకటేష్ ని అప్రోచ్ అయినప్పటికీ, ఇప్పుడు ఆ పాత్రను నాగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

దీనికి సంబందించి పూర్తి వివరాలు ఇంకా అందాల్సి వుంది.

హోంమంత్రికి ప్రమాదం




లిఫ్ట్ తెగిపడటంతో ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప గాయపడ్డారు.

కాకినాడ సంజీవని ఆస్పత్రిలో ఆయన ఎక్కిన లిఫ్ట్ కేబుల్స్ఒ క్కసారిగా తెగిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.

పెద్దాపురం నెక్కంటి సీఫుడ్స్ లో అమ్మోనియం గ్యాస్ లీకై అస్వస్థతకు గురైన వారిని పరామర్శించేందుకు హోంమంత్రి ఈ  ఉదయం సంజీవని ఆస్పత్రికి వచ్చారు.

అనంతరం ఆయన కిందకి వెల్ళడానికి లిఫ్ట్ ఎక్కారు.  అయితే, హఠాత్తుగా లిఫ్ట్ వైర్లు తెగిపోవడంతో ఒక్కసారిగా చినరాజప్ప లిఫ్ట్ లోనే పడిపోయారు. ఆయన నడుముకు  గాయాలు కావటంతో సంజీవని ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆయనను ఐసీయూలో వుంచి చికిత్స అందిస్తున్నారు.

ఈ ప్రమాదంలో మంత్రితో పాటు ఓ కానిస్టేబుల్, ఫోటోగ్రాఫర్ కూడా గాయపడ్డారు.

మోదీ ‘మంచి కొడుకు’




ఉత్తరపేదేశ్ రాజకీయాలు కొత్త స్నేహాలకు తెరతీస్తున్నట్టు కనిపిస్తోంది.. గత కొద్దిరోజులుగా తండ్రీ కొడుకుల మధ్య వివాదాలతో వేడెక్కి పోతున్న సమాజ్‌వాదీ పార్టీ రాజకీయాలు నిన్న ములాయంసింగ్ యాదవ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై  చేసిన వ్యాఖ్యలతో, ఒక్కసారిగా కొత్త మలుపు తీసుకున్నాయి!

నిన్న ములాయం మాట్లాడుతూ.. మోదీ ‘మంచి కొడుకు’ అని తెగ పొగిడేశారు. ' ఎన్ని భాధ్యతలు వున్నా , అప్పుడప్పుడూ వెళ్ళి తన తల్లి ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటాడనీ, మోదీ ఆదర్శప్రాయుడైన కొడుకు ' అని చెప్పాడు..

లక్నో లో సోమవారం జరిగిన సమాజ్‌వాదీ పార్టీ సమావేశంలో ములాయం, ఆయన కుమారుడు అఖిలేశ్ యాదవ్ వర్గాల మధ్య వాడి వేడిగా చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలోనే అఖిలేశ్‌కు పరోక్షంగా  ములాయం మోదిని పోల్చి హితవు చెప్పాడట..

‘‘మోదీని చూడు, ఎంతో కష్టపడి, ప్రధాన మంత్రి అయ్యాడు. పేదకుటుంబం నుంచి వచ్చాడు. తన తల్లి లేకుండా తాను ఉండలేనని చెప్తూ ఉంటాడు,ఇప్పటికీ తన తల్లిని వదిలిపెట్టలేదు’’ అని ములాయం అఖ్లేష్ కి క్లాస్ పీకాడట.

తాజాగా ములాయం చేసిన వ్యాఖ్యలు ఉత్తరప్రదేశ్ ఎన్నికలప్పటికి కొత్త పొత్తులకు దారి తీస్తాయని అనుకుంటున్నారు.

రావడం ఫిక్స్ అయిపోయింది!





పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కాటమరాయుడు’ విడుదల తేదీని రిలీజ్ చేసారు.  2017 మార్చి 29న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు చిత్ర నిర్మాత శరత్‌ మరార్‌ తెలియజేసారు.

తమిళంలో విజయవంతమైన ‘వీరమ్‌’కి రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. శ్రుతిహాసన్‌ కథానాయికగా నటిస్తున్న దీనికి కిషోర్‌ పార్థసాని (డాలీ) దర్శకత్వం వహిస్తున్నాడు.

 ఒకదాని వెనుక మరొకటి వేగాంగా సినిమాలు చేస్తుండటంతో.. షూటింగ్, రిలీజ్ విషయంలో పవన్ ఒక ప్రణాలిక ప్రకారం వెళ్తున్నట్టు తెలిసింది. ఈ మూవీ విడుదల్ తేదీని కూడా పవర్ స్టారే నిర్ణయించినట్టు తెలుస్తోంది.

పాకిస్థాన్‌లో ఉగ్రదాడి



 పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు క్వెట్టాలోని పోలీసు ట్రైనింగ్ సెంటర్ పై దాడిచేసి నరమేథం సృష్టించారు. ఈ దాడిలో వసతిగృహంలో ఉన్న 60 మంది ట్రైనీ పోలీసులు మృతి చెందగా, చాలామందికి గాయాలయ్యాయి.

సోమవారం రాత్రి 11గంటల సమయంలో ఈ దాడి జరిగింది. మొత్తం ఆరుగురు ఉగ్రవాదులు దాడిలో పాల్గొన్నారని, భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని స్థానిక అధికారులు తెలిపారు. మిగిలిన ముగ్గురు ఉగ్రవాదులు ట్రైనీలను బందీలుగా చేసుకుని అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి, ఉగ్రవాదులకోసం వెతుకుతున్నారు.

కాగా ఈ వసతి గృహంలో మొత్తం 600 మంది శిక్షణా పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో 250 మందిని ఇప్పటికే సురక్షితంగా బయటకు తెప్పించేసారు.