ముంబై లోని ప్రఖ్యాత హజీ ఆలీ దర్గా లోపలికి మహిళలను అనుమతిస్తామని హజీ ఆలీ దర్గా ట్రస్ట్ సుప్రీం కోర్టుకు తెలియజేసింది.
పురుషులు వెళ్లే అన్ని ప్రాంతాలకు మహిళలను వెళ్ళేలా అనుమతిస్తామని కోర్టుకు ట్రస్ట్ తెలిపింది. అయితే అందుకు రెండు వారాలు గడువు కావాలని కోరగా, నాలుగు వారాల్లో మహిళలు వెళ్లేందుకు వీలుగా దర్గాలో మౌళిక సదుపాయాలు కల్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
దశాబ్దాలుగా హజీ ఆలీ దర్గాలోకి మహిళల ప్రవేశంపై నిషేధం ఉంది. దీనిపై అనేక స్వచ్చంద సంస్థలు, బారతీయ ముస్లిం మహిళా ఆందోళన అనే సంస్థ న్యాయపోరాటం చేస్తున్నాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి