ఆర్. నారాయణమూర్తి, జయసుధల సెన్షేషనల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ చిత్రం ఈరోజు రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రారంభమైంది.
ముహూర్తపు సన్నివేశానికి రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు క్లాప్ కొట్టగా, ఎండీ రామ్మోహన్‌రావు కెమెరా స్విచాన్ చేశారు. డైరక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించాడు..
వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్ని అందించే ఈ చిత్రానికి చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్నాడు.
80వ దశకంలో గురువు దాసరి 'పోలీస్ వెంకటస్వామి ' గా నటించి మెప్పించగా, ఇప్పుడు శిష్యుడు ప్రమోషన్ తో హెడ్ కానిస్టేబుల్ గా కనిపించబోతున్నాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి