నిషేధిత ఉగ్రవాద సంస్థ 'స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమీ)' కు చెందిన 8 మంది ఉగ్రవాదులు ఆదివారం రాత్రి ఒక గార్డును చంపి భోపాల్ జైలు నుంచి పారిపోయారు.
రాత్రి 2 గంటల ప్రాంతంలో టెర్రరిస్టులు భోజనానికి ఇచ్చే స్టీల్ ప్లేట్ ని ఆయుధంగా వాడి, హెడ్ కానిస్టేబుల్ రామశంకర్ గొంతుకోసి, ఆ తర్వాత దుప్పట్లతో తాడులా పేనుకుని జైలుగోడ ఎక్కి అక్కడి నుంచి పరారయ్యారు.
దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు జరుగుతున్న సమయంలో పారిపోవడానికి ప్లాన్ చేసుకుని తమ పథకాన్ని పక్కాగా అమలుచేశారు.
మూడేళ్ల క్రితం కూడా ఏడుగురు సిమీ ఉగ్రవాదాలు భోపాల్ దగ్గరలోని ఖ్వాండ్వాలో ఇదే తరహాలో జైలు నుంచి పరారయ్యారు.
ఉగ్రవాద దాడుల హెచ్చరికలు, సరిహద్దులో తీవ్రతల్ని దృష్టిలో వుంచుకుని కూడా, జైల్ అధికారులు తగినంత జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేక పొయారో కానీ.. ఇలాంటి ఉదాసీనత వల్ల ప్రజలు తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి