పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కాటమరాయుడు’ విడుదల తేదీని రిలీజ్ చేసారు. 2017 మార్చి 29న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు చిత్ర నిర్మాత శరత్ మరార్ తెలియజేసారు.
తమిళంలో విజయవంతమైన ‘వీరమ్’కి రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న దీనికి కిషోర్ పార్థసాని (డాలీ) దర్శకత్వం వహిస్తున్నాడు.
ఒకదాని వెనుక మరొకటి వేగాంగా సినిమాలు చేస్తుండటంతో.. షూటింగ్, రిలీజ్ విషయంలో పవన్ ఒక ప్రణాలిక ప్రకారం వెళ్తున్నట్టు తెలిసింది. ఈ మూవీ విడుదల్ తేదీని కూడా పవర్ స్టారే నిర్ణయించినట్టు తెలుస్తోంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి