సైనికుల సంక్షేమం కోసం కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా లేఖ రాశారు.
మాజీ సైనికోద్యోగుల కోసం ప్రవేశపెట్టిన ‘ఒకే ర్యాంకు, ఒకే పింఛను’ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, సైనికుల సమస్యలను, జీతాలకు సంబంధించి ఇబ్బందులను పరిష్కరించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.
దీపావళి సందర్భంగా సైనికులకు శుభాకాంక్షలు తెలుపుతూ సందేశాలు పంపించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రచారంపై రాహుల్ విమర్శలు చేశారు. కేవలం మాటలు మాత్రమే కాదని, చేతల్లో కూడా చూపించాలని సైనికులకు అందుతూన్న పథకాలపై ప్రత్యేక శ్రద్ద చూపాలని మొదీకి సూచించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి