ఉత్తరపేదేశ్ రాజకీయాలు కొత్త స్నేహాలకు తెరతీస్తున్నట్టు కనిపిస్తోంది.. గత కొద్దిరోజులుగా తండ్రీ కొడుకుల మధ్య వివాదాలతో వేడెక్కి పోతున్న సమాజ్‌వాదీ పార్టీ రాజకీయాలు నిన్న ములాయంసింగ్ యాదవ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలతో, ఒక్కసారిగా కొత్త మలుపు తీసుకున్నాయి!
నిన్న ములాయం మాట్లాడుతూ.. మోదీ ‘మంచి కొడుకు’ అని తెగ పొగిడేశారు. ' ఎన్ని భాధ్యతలు వున్నా , అప్పుడప్పుడూ వెళ్ళి తన తల్లి ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటాడనీ, మోదీ ఆదర్శప్రాయుడైన కొడుకు ' అని చెప్పాడు..
లక్నో లో సోమవారం జరిగిన సమాజ్‌వాదీ పార్టీ సమావేశంలో ములాయం, ఆయన కుమారుడు అఖిలేశ్ యాదవ్ వర్గాల మధ్య వాడి వేడిగా చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలోనే అఖిలేశ్‌కు పరోక్షంగా ములాయం మోదిని పోల్చి హితవు చెప్పాడట..
‘‘మోదీని చూడు, ఎంతో కష్టపడి, ప్రధాన మంత్రి అయ్యాడు. పేదకుటుంబం నుంచి వచ్చాడు. తన తల్లి లేకుండా తాను ఉండలేనని చెప్తూ ఉంటాడు,ఇప్పటికీ తన తల్లిని వదిలిపెట్టలేదు’’ అని ములాయం అఖ్లేష్ కి క్లాస్ పీకాడట.
తాజాగా ములాయం చేసిన వ్యాఖ్యలు ఉత్తరప్రదేశ్ ఎన్నికలప్పటికి కొత్త పొత్తులకు దారి తీస్తాయని అనుకుంటున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి