లైంగికదాడుల ఆరోపణలతోను, నోటి దురుసుతనంతోనూ ఉక్కిరిబిక్కిరి అవుతూన్న ట్రంప్ తన రూట్ మార్చాడు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్ని ప్రభావితం చెయ్యగల భారతీయ ఓటర్లకు గేలం వేసే పనిలో పడ్డట్టున్నాడు ట్రంప్.
మొన్న భారతీయ నటులతో జరిగిన ఓ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్.. తనకు హిందువుల సాంప్రదాయమన్నా, భారతీయులన్నా ఎంతో ఇష్టమని, వ్యాఖ్యానించగా, తాజాగా హిల్లరీతో జరిగిన చివరి బిగ్ డిబేట్లో కూడా భారతదేశం పట్ల తన సానుకూల దృక్పథాన్ని వ్యక్తం చేశాడు.
కాగా చివరి డిబేట్లో, పోటీదార్ల మధ్య, వ్యక్తిగత దూషణలు తగ్గుముఖం పట్టడంతో అమెరికన్లు ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా అమెరికా అభివృద్ది, తుపాకీ కల్చర్, రష్యాతో సంబంధాల పైనే వీరిద్దరీ చర్చలు కొనసాగాయి.
ఈ డిబేట్లో కూడా హిల్లరీనే పైచేయి సాధించినట్టు పరిశీలకులు చెబుతున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి