google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: ప్రతీకారం తీర్చుకున్నారు!

30, అక్టోబర్ 2016, ఆదివారం

ప్రతీకారం తీర్చుకున్నారు!



కశ్మీర్‌లోని మచిలీ సెక్టార్‌లో ఉగ్రవాదులు మొన్న భారత జవానును చంపినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని భార్త ఆర్మీ  ప్రకటించిన 24 గంటల్లోనే కెరన్‌ సెక్టార్‌లో పాక్‌ను భారీగా దెబ్బ తీసారు

కవ్వింపు చర్యలతో కాలు దువ్వుతున్న పాకిస్థాన్‌ సైన్యానికి భారత జవాన్లు గట్టిగా బదులిచ్చారు. నియంత్రణ రేఖ వెంబడి,  కెరన్‌ సెక్టార్‌లో పాక్‌ సైన్యానికి చెందిన నాలుగు ఔట్‌పోస్టులను భారత సైన్యం ధ్వంసం చేసింది. అటువైపు భారీ స్థాయిలో 'ప్రాణ నష్టం’ జరిగిందని సైన్యం ప్రకటించింది.

 కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి నిరంతారయంగా పాక్ సైన్యం జరుపుతున్న కాల్పుల్లో ఒక బీఎస్‌ జవాను, మరో స్థానిక మహిళ గాయపడ్డారు. దీంతో  గట్టిగా బదులిచ్చేలా భారత సైన్యం విరుచుకుపడింది.

‘తీవ్ర స్థాయిలో ఎదురు దాడికి దిగాం. పాక్‌ పోస్టులు నాలుగు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అటువైపు భారీగానే ప్రాణనష్టం సంభవించింది’’ అని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు.  భారత సైనికుల ఎదురుదాడిలో 20 మందిదాకా పాక్‌ జవాన్లు మరణించినట్లు తెలుస్తోంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి