సెంటిమెంట్లకు మారుపేరైన తమిళనాడులో సినీతారల మీద అభిమానం హద్దులు దాటుతుంటుంది. వారు సినిమా తారలను ఎంతగా ఆరాధిస్తారంటే.. తమ అభిమాన నాయికలకు అఫ్ఫుడప్పుడూ గుళ్ళు కూడా కట్టేసి, పిచ్చి పిచ్చిగా తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు.
గతంలో మొదటిసారి నటి ఖష్బూను పిచ్చిగా అభిమానించిన తమిళులు ఆమెకు ఓ గుడ్డి కట్టేసి తమ భక్తిని చాటుకున్నారు. ఆ తర్వాత నమిత, హన్సికలకు కూడా గుళ్లు కట్టారు. తాజాగా ఆ జాబితాలోకి యువ హీరోయిన్ ‘నేను.. శైలజ’ ఫేమ్ 'కీర్తీ సురేష్ ' చేరింది.
‘థొడరి’ అనే చిత్రంతో తమిళ తెరకు పరిచయమైన కీర్తి తక్కువ సమయంలోనే నాలుగు సినిమాలు చేసేసి, అభిమానుల్ని బాగా సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ తమిళ తంబీలకు తెగ నచ్చేయడంతో ఖుష్బూ, నమిత, హన్సికలతో సమానంగా కీర్తికి కూడా గుడి రెడీ అయిపోతోంది.
కానీ.. దేవతగా ఆరాధించి గుళ్ళు కట్టే తమిళ అభిమానులే, తమకు నచ్చకపోతే, తాము కట్టిన గుడులనే నిర్దాక్ష్యణ్యంగా కూల్చివేసిన ఘటన ఇంతకుముందు హీరొయిన్ 'సిమ్రాన్ ' విషయంలో జరిగివుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి