google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: చిరును షాకిచ్చిన కో డాన్సర్!

23, అక్టోబర్ 2016, ఆదివారం

చిరును షాకిచ్చిన కో డాన్సర్!



మిగతా హీరోలకు చిరుకి తేడా ఏంటని అడిగితే ఠక్కున వచ్చే జవాబు 'డాన్స్ "
అవును!..  ఒకే మూసలో సాగిపోతున్న తెలుగు పాటల నృత్యాల్ని తనదైన స్టైల్ లో వూపు తెచ్చిన హీరో చిరు. ఇప్పటికీ ఇంతమంది హీరోలు వచ్చినా కానీ డాన్స్ కి ప్రత్యామ్న్యాయం మాత్రం మెగాస్టార్ అనే చెప్పుకుంటారు.

 చాలా గ్యాప్ తర్వాత ఆయన ప్రస్తుతం తన 150వ సినిమా ‘ఖైదీ నంబర్ 150’ చేస్తున్నారు. అయితే ఈ మూవీలో చిరు అంతకుముందులా డాన్స్ వెయ్యగలరా..? లేదా అనే సందేహాల్ని పటాపంచలు చేసేలా ఓ సంఘటన జరిగింది.

 ప్రస్తుతం ఈ మూవీ కోసం‘బాస్ ఈజ్ బ్యాక్’ అనే సాంగ్‌ను అన్నపూర్ణ స్టూడియోలో షూట్ చేస్తున్నారు. దీనికి లారెన్స్ మాస్టర్ కొరియోగ్రాఫెర్. ఈ పాట షూటింగ్‌లో మెగాస్టార్ కు ఓ అనుకోని ఘటన ఎదురైంది. 60 ఏళ్ల వయసులోనూ ఆయన వేసే స్టెప్పులను చూసిన ఓ కో డాన్సర్.. అకస్మాత్తుగా వచ్చి చిరును కౌగిలించుకుందట.! ఈ అనుకోని పరిణామంతో చిరు మొదట కొంత షాక్ తిన్నాడట. ఓ యంగ్ హీరోలా చిరు వేస్తున్న మూమెంట్స్‌ను చూసి తన భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేక పొయానని, అందుకే కౌగిలించుకున్నానని ఆ డాన్సర్ చెప్పుకొచ్చింది.

కాసేపటికి తేరుకున్న చిరు ఆ డాన్సర్ వివరాలు తెలుసుకుని, అభినందించాడట.

చిరు డాన్స్ పై ఇంకా ఏమైనా సందేహాలుంటే ఈ సంఘటనతో తీరిపోయాయని అంటున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి