google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: విషప్రయోగం జరగలేదు

26, అక్టోబర్ 2016, బుధవారం

విషప్రయోగం జరగలేదు




ఏవోబీలో ఎన్‌కౌంటర్‌కు ముందు మావోయిస్టులపై విషప్రయోగం జరిగిందన్న ఆరోపణలను ఏపీ డీజీపీ సాంబశివరావు ఖండించారు. వారిపై ఎలాంటి విషప్రయోగం జరగలేదని చెప్పారు. కొండపైనుంచి మావోయిస్టులు కాల్పులు జరిపిన తర్వాతే పోలీసులు కాల్పులు జరిపారని ఆయన స్పష్టం చేశారు.

ఈరోజు ఉదయం మావోయిస్టు పార్టీ ఏపీ కమిటీ అధికార ప్రతినిధి శ్యామ్‌ మాట్లాడుతూ.. కోవర్ట్ ద్వారా విషాహారం పంపించి, అది తిన్న మావోయిస్టులు అపస్మారక స్థితిలో వున్నపుడు పోలీసులు కిరాతకంగా చంపారని ఆరోపించిన విషయం తెలిసిందే.

  డీజీపీ మాట్లాడుతూ..గాయపడిన మావోయిస్టులు ఏవోబీలో తలదాచుకున్నారనే సమాచారం ఉందని, వారు లొంగిపోతామంటే, మీడియాను తీసుకువెళ్లి, వైద్య సేవలు అందిస్తామని,  మావోయిస్టులకు పోలీసులు వ్యతిరేకం కాదని, వారి విధానాలనే వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి