ముఖ్యమంత్రి చంద్రబాబే అసలైన ఉగ్రవాది అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు మేరుగ నాగార్జున విమర్శించాడు.
చంద్రబాబు పాలనలో రైతులు, వృద్ధులు, డ్వాక్రా మహిళలు, విద్యార్థులు, ఆఖరికి ఉద్యోగులు కూడా సంతోషంగా లేరని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా? అని టీడీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఆక్వా ఫుడ్‌పార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మద్దతు ప్రకటిస్తే.. అభివృద్ధిని అడ్డుకుంటున్నాడంటూ, ఎల్లో మీడియా ద్వారా విష ప్రచారానికి పాల్పడుతున్నారని ఆయన అన్నాడు.
తండ్రీ కొడుకులు కలిసి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని నాగార్జున తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ అభివృద్ధికి వ్యతిరేకం కాదని, అభివృద్ధి ముసుగులో టీడీపీ సాగిస్తున్న అవినీతిపైనే తమ పోరాటమని మేరుగ నాగార్జున స్పష్టం చేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి