ఇన్నాళ్ళూ వారసత్వంపై మౌనం వహించిన మాజీ సీయం, డీ.యం.కే. అధినేత కరుణానిధి తన రాజకీయ వారసుడిగా చిన్నకొడుకు స్టాలిన్ ని ప్రకటించాడు. పార్టీ పటిష్టత కోసం స్టాలిన్ ఎంతగానో కష్టపడ్డారని, పార్టీని ముందుకు నడిపించడానికి స్టాలినే అసలైన నాయకత్వం వహించగలడని ఆయన అన్నారు.
93 ఏళ్ల కరుణానిధి లేటు నిర్ణయం వెనుక తన ఇద్దరు కొడుకులు కేంద్రాలుగా పార్టీ నిలువునా చీలుతుందనే భయం ఉందని అంటారు.
దక్షిణ తమిళనాడులో గట్టి పట్టున్న కరుణ పెద్ద కుమారుడు అళగిరి.. తండ్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రగడ చెయ్యొచ్చని, డిఎంకే వర్గాల్లో ఆందోళన మొదలైంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి