పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు క్వెట్టాలోని పోలీసు ట్రైనింగ్ సెంటర్ పై దాడిచేసి నరమేథం సృష్టించారు. ఈ దాడిలో వసతిగృహంలో ఉన్న 60 మంది ట్రైనీ పోలీసులు మృతి చెందగా, చాలామందికి గాయాలయ్యాయి.
సోమవారం రాత్రి 11గంటల సమయంలో ఈ దాడి జరిగింది. మొత్తం ఆరుగురు ఉగ్రవాదులు దాడిలో పాల్గొన్నారని, భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని స్థానిక అధికారులు తెలిపారు. మిగిలిన ముగ్గురు ఉగ్రవాదులు ట్రైనీలను బందీలుగా చేసుకుని అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి, ఉగ్రవాదులకోసం వెతుకుతున్నారు.
కాగా ఈ వసతి గృహంలో మొత్తం 600 మంది శిక్షణా పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో 250 మందిని ఇప్పటికే సురక్షితంగా బయటకు తెప్పించేసారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి