google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: ఇప్పటికైనా ఒప్పుకున్నాడు..!

28, అక్టోబర్ 2016, శుక్రవారం

ఇప్పటికైనా ఒప్పుకున్నాడు..!



 జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని  తీవ్రంగా ప్రయత్నిస్తున్న భారత్ కు మన పొరుగుదేశం నుంచే గట్టి మద్దతు దొరికింది.!

 కార్గిల్ యుద్ద సూత్రదారి, పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్ మసూద్ అజహర్ ను ఉగ్రవాది అని పేర్కొన్నాడు. మసూద్ పాక్‌లో కూడా బాంబు దాడులకు పాల్పడ్డాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

పాకిస్థాన్‌లోని ఓ టీవీ ఛానల్‌తో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.

 అయితే అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి ప్రకటించే విధంగా చేయాలని చైనాను పాకిస్థాన్ ఎందుకు కోరడం లేదన్న ప్రశ్నకు ముషర్రఫ్ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. మసూద్ అజహర్‌తో  చైనా కు సంబంధం లేదని, చైనాను ఈ అంశంలోకి లాగొద్దని ఆయన అన్నాడు.

 నవాజ్ షరీఫ్ ప్రభుత్వ దూకుడుగా వ్యవహరించడం లేదని అంతర్జాతీయంగా దౌత్యపరంగా పాకిస్థాన్ విఫలమైందని అంగీకరించాడు.

మసూద్‌ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న ప్రతిపాదన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పరిశీలనలో ఉంది. అయితే  సరైన సాక్ష్యాధారాలు లేవంటూ ఆ ప్రయత్నాలను చైనా అడ్డుకుంటోంది. . ఈ నేపథ్యంలో మసూద్ ఉగ్రవాది అని ముషర్రఫ్ చెప్పడంతో ఆయన భారత్‌ వాదనను సమర్థించినట్లయింది.

ముషర్రఫ్ వ్యాఖ్యల తర్వాతైనా.. మసూద్ అజహర్ పట్ల చైనా తన అభిప్రాయం మార్చుకుంటుందేమో చూడాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి