చేతబడి చెయ్యడం వల్లే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, ఈ రాష్ట్ర మాజీ సీఎం కరుణానిధి అనారోగ్యం పాలయ్యారని ఓ జ్యోతిష్యుడు చెప్పినట్లు పలు వెబ్ సైట్లలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
జయ 36 రోజులుగా ఆసుపత్రిపాలు కావడానికి, తాజాగా ఈమధ్యనే కరుణానిధి కూడా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడానికి అసలు కారణం అదేనని తన పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆ జ్యోతిష్యుడు చెప్పాడనే వార్త సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడ్తోంది.
అసలే భక్తి, సెంటిమెంట్లూ ఎక్కువ కలిగిన తమిళ ప్రజలు ఈ వార్తలతో ఆందోళన చెందుతున్నట్టు తెలిసింది. ఇందుకు విరుగుడు చేయిస్తే వారిద్దరూ కోలుకుంటారని సదరు జ్యోతిష్కుడు పేర్కొన్నాడట.
ఇటు అన్నాడీఎంకే, అటు డీఎంకే పార్టీలవారు ఒకరి నేతపై మరొకరు చేతబడి చేయించుకుని వుంటారని సాధారణ ప్రజలు అనుకుంటుండగా, పరిశీలకులు మాత్రం ఇది ఒట్టి ఆకతాయి చర్యలుగా కొట్టిపడేస్తున్నారు.
ఇలా వుండగా జయ చక్కగా కోలుకున్నారని, మునుపటి కంటే ఆమె ఆరోగ్యం చాలా మెరుగుపడిందని అపోలో వర్గాలు తన ప్రకటన ద్వారా స్పష్టం చేశాయి. ఆమె అందరిలానే మాట్లాడగలుగుతున్నారని కూడా ఆ వర్గాలు వివరించాయి.
మరోప్రక్క యూపీ సీఎం అఖిలేష్ కుటుంబంలో రగిలిన చిచ్చుకు కూడా కారణం ఇలాంటిదేననై పుకార్లు సంచారం చేస్తున్నాయి. తండ్రీ కొడుకులు సైతం శత్రువులుగా మారి కలహించుకోవడానికి కారణం చేతబడేనని కొందరు అనుమానాలు రేకిత్తిస్తున్నారు. దీనికి ఆధారంగా ములాయం, అఖిలేష్‌లకు హాని కలిగించేందుకు తాంత్రిక ప్రయోగం జరుగుతోందంటూ ములాయం సోదరుడు రాంగోపాల్ ఆ మధ్య రాసిన ఒక లేఖను కొందరు ఉటంకిస్తున్నారు.
ప్రజల సెంటిమెంట్లను అడ్డం పెట్టుకుని ఇలాంటి అనుమానాల్ని పోగేసేవారికి మాత్రం మంచి టైంపాస్ అవుతోందని అనుకుంటున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి