google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: సర్వేలన్నీ బోగస్!!

22, అక్టోబర్ 2016, శనివారం

సర్వేలన్నీ బోగస్!!



 కేసీఆర్ అండ్ కో చేయిస్తున్న సర్వేలన్నీ బూటకమనీ, సర్వేలపై నమ్మకముంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టాలని టీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ సవాల్ విసిరారు.

రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే, టీ ఆర్ ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందనీ, కాంగ్రెస్ కు మాహా ఐతే రెండుసీట్లు వస్తాయని, ఓ సర్వే లో వచ్చిందన్న వార్తల నేపథ్యంలో ఆయన ఇలా వ్యాఖ్యానించాడు.

 ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే కాంగ్రెస్‌కు 80 సీట్లు వస్తాయని ఉత్తమ్  స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు ప్రజల నుంచి అనూహ్య స్పందన వుందని ఆయన నమ్మకం వ్యక్తం చేసాడు.

ఇదే సర్వేలో టీడీపి కి అస్సలేం రాదని తేలడం విశేషం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి