తనకు పాక్ నటుల కన్నా, భారతదేశమే గొప్ప అని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ చెప్పారు.
పాకిస్థాన్ కళాకారులపై నిషేధం విధించాలన్న సమస్యపై ప్రస్తుతం వివాదాలు రేగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ప్రముఖ పాత్రికేయులు శేఖర్ గుప్తా, బర్ఖా దత్ ఆధ్వర్యంలో ‘ది ప్రింట్’ సోమవారం రాత్రి నిర్వహించిన ‘ఆఫ్ ది కఫ్’ అనే కార్యక్రమంలో ముఖేశ్ తన అభిప్రాయాలను సూటిగా వెల్లడించారు.
పాకిస్థానీ కళాకారులపై నిషేధం విధించడం గురించి స్పందించాలని ప్రేక్షకులు కోరినపుడు, ముఖేశ్ తనకు కళలు, సంస్కృతి కన్నా భారతదేశమే ముఖ్యమైనదని స్పష్టం చేశారు. ' నాకు ఎల్లప్పుడూ దేశమే మొదటి స్థానంలో ఉంటుంది. దేశానికే నేను ప్రాధాన్యం ఇస్తాను. నేను మేధావిని కాను కాబట్టి నాకు ఇవేవీ అర్థం కావు. కానీ అందరు భారతీయులలాగానే నాకు కూడా భారతదేశమే మొదటి స్థానంలో ఉంటుంది’’ అని అన్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి