పాక్ కి చైనా తో వున్న సంబంధ భాంధవ్యాలు అందరికీ తెలిసిందే, కానీ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి చైనా ఎలా కొమ్ముకాస్తోందో చెప్పడానికి సాక్ష్యం దొరికింది.
జమ్మూకశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాల్లో మొదటిసారిగా చైనా జాతీయ జెండాలు దర్శనమిచ్చాయి! నిఘావర్గాల సమాచారం మేరకు బారాముల్లా పట్టణంలో సోదాలు నిర్వహించిన భద్రతా బలగాలకు పెట్రోల్ బాంబులు, చైనా, పాకిస్థాన్ జెండాలు, లష్కరే తాయిబా, జైషే మహ్మద్ సంస్థల లెటర్ ప్యాడ్లు, మొబైల్‌ఫోన్లు, ఇతర వస్తువులు భారీ సంఖ్యలో దొరికాయి.
సోమవారం 12 గంటలపాటు నిర్వహించిన తనిఖీల్లో 44 మంది అనుమానితులను అరెస్ట్ చేసారు.
పాక్ ను వెనకేసుకొచ్చే చైనా, తాజాగా జరిగిన సంఘటన పట్ల ఎలా స్పందిస్తుందో చూడాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి