ప్రతి పండుగ సమయంలో సరిహద్దుల వద్ద ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొంటూ మిఠాయిలు ఇచ్చిపుచ్చుకోవడం భారత్-పాక్ సైనికులకు ఆనవాయితీ. కాని ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ ఏడాది దీపావళి పండుగ సందర్భంగా ఇరుదేశాల సరిహద్దు వద్ద ఇరు దేశాల సైనికులు మిఠాయిలు మార్చుకోవడం లేదని బీఎస్‌ఎఫ్ అధికారులు వెల్లడించారు.
ప్టెంబర్ 29న భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించినప్పటి నుంచి.. పాక్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఉల్లంఘన, కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
భారత్‌కు చెందిన మన్‌దీప్ సింగ్ అనే సైనికుడ్ని పాక్ రేంజర్లు అతి కిరాతకంగా హతమార్చడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి