google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: ఓంపురి తిక్క స్టేట్ మెంట్

4, అక్టోబర్ 2016, మంగళవారం

ఓంపురి తిక్క స్టేట్ మెంట్



ఓ ప్రక్క సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొని వుంటే, మరో ప్రక్క సినీ, రాజకీయ రంగ ప్రముఖులు తమ అవగాహనా రాహిత్యంతో మరింత గందరగోళం సృష్టిస్తున్నారు.

సల్మాన్ చేసిన వ్యాఖ్యలకు రేగిన గొడవ చల్లారక ముందే, సీనియర్ నటుడు ఓంపురి భారత సైనికుల పట్ల చేసిన అహంపూరిత వ్యాఖ్య గొడవలకు దారితీసేట్టుంది.

ఉరి సంఘటన లో మన సైనికుల మరణం పట్ల తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ,  అసలు వాళ్ళనెవరు సైన్యంలో చేరమన్నారు? ఎవరు ఆయుధాలు పట్టుకోమన్నారు? అనే అపరిపక్వ సమాధానంతో విలేకరులను నివ్వెర పరిచాడు.

పాకిస్తాన్ నటులతో నటించడానికి ఇప్పటికీ తాను ఇష్టపడ్తానని, అలాగే యుద్దమంటే దేశాలు విడిపోయే విషయం కాదని, కుటుంబాలు విడిపోయే విషయమని చెప్పాడు.

ఓంపురి లాంటి సీనియర్ నటుల అవగాహనారాహిత్యం వల్ల, పరిస్థితి మరింత దిగజారేలా కనిపిస్తోంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి