సినీ అభిమానులు ఊహించని కలయికతో ఓ మూవీ మొదలవుతోంది.!
పీపుల్ స్టార్ ఆర్.నారాయణమూర్తి, సహజనటి జయసుధ జంటగా నటించబోయే చిత్రం ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ దీనికి దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు, నిర్మాత చదలవాడ తిరుపతిరావు.
దర్శకుడు మూవీ గురుంచి మాట్లాడుతూ ‘‘నీతి నిజాయతీగల ఓ పోలీసు అధికారి వ్యక్తిగత జీవితంలోనూ, వృత్తిపరంగానూ ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? వాటిని ఎలా అధిగమించి విజయం సాధించాడు? అనే విషయాలతో చిత్రం రూపొందులోది". అని తెలిపాడు
హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్యగా ఆర్.నారాయణమూర్తి, ఆయన సతీమణిగా జయసుధ నటిసున్నారు. విభిన్నమైన కలయికలో తెరకెక్కనున్న చిత్రం ఈ నెల 19న రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరణ మొదలుకానుంది.
బయటి చిత్రాల్లో నటించడానికి ససేమీర ఒప్పుకోని నారాయణమూర్తిని కదిలించిన ఈ చిత్రం విశేషాలేంటో చూడాలి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి