ప్రముఖ పాత్రికేయుడు.. టైమ్స్‌నౌఛానల్ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామికి ప్రభుత్వం ‘వై’ కేటగిరి భద్రతను సమకూర్చింది.
పాక్ ఉగ్రవాదులనుంచి నుంచి ప్రమాదం వుందనే సమాచారం అందడంతో ఆర్నాబ్‌కు 24 గంటల పాటు భద్రత కల్పించాలని నిర్ణయించారు.
టీవీ షోల ద్వారా పాక్‌పై, ఉగ్రవాదమూకలపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆర్నబ్‌కు ఈమధ్య బెదిరింపు కాల్స్ ఎక్కువకావడంతో పాటు, ఇంటలిజన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకూంది.
ఇద్దరు వ్యక్తిగత భద్రతాధికారుల తో కూడిన మొత్తం ఇరవై మంది భద్రతా సిబ్బంది ఆయనకు రక్షణ కల్పించనున్నారు.
మామూలుగా మంత్రులకు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఈ తరహా భద్రతను కల్పిస్తారు. అలాగేఎవరికైనా ముప్పు ఉందని గుర్తిస్తే, వారికి వై కేటగిరి భద్రతను కల్పిస్తారు. ప్రభుత్వం నుంచి ‘వై’ కేటగిరి భద్రత అందుకున్న తొలి జర్నలిస్టు అర్నబ్ కావటం గమనార్హం.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి