విడుదలకు ముందే బాహుబలి 2 సంచలనాలు కొనసాగుతూనే వున్నాయి.
మూవీకి సంబందించి రోజుకొక కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. థియేట్రికల్ హక్కులు, శాటిలైట్ హక్కులు అంచనాలకు అందని ధరలకు అమ్ముడుపోతున్నట్టు తెలుస్తోంది
‘బాహుబలి’ మొదటి భాగం భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచిన విషయం తెలిసిందే. విదేశాలలో కూడా ఈ చిత్రం విశేష ఆదరణతో పాటుగా, మంచి వసూళ్ళను రాబట్టింది. దీనికి తగ్గట్టుగానే కొనసాగింపుగా తెరకెక్కుతున్న బాహుబలి 2 అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
వ్యాపార వర్గాలు శాటిలైట్ హక్కులకోసం పోటీపడి మరీ కొనుగోలు చేస్తున్నాయి. నైజాం ప్రాంతానికి సంబంధించిన థియేట్రికల్ హక్కులు రూ: 50 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడుపోయాయి. అలాగే నార్త్ అమెరికా ప్రాంతానికి సంబంధించిన రికార్డు స్థాయిలో రూ.45 కోట్లకు అమ్ముడైనట్టు సమాచారం.
తాజాగా హిందీ వెర్షన్ శాటిలైట్ హక్కుల్ని సోని టీవీ సంస్థ రూ.51 కోట్లకి కొనుగోలు చేసింది. మొదటి భాగం హిందీలో రూ.100 కోట్లకు పైగా వసూలు చేయడంతో ఇప్పుడు రెండవ భాగానికి శాటిలైట్ రూపంలోనే రూ.51 కోట్లు రావడం విశేషం.
విడుదల తర్వాత బాహుబలి 2 ఇంకెన్ని సంచలానాలను సృష్టిస్తుందో చూడాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి