గత నెలరోజులుగా తమిళనాట తీవ్ర ఆందోళణ పరిస్థితులను కొనసాగిస్తున్న జయ అనారోగ్యం కాస్తంత తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తోంది.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత క్రమంగా కోలుకుంటున్నట్టు, ప్రస్తుతం ఆమె మంచినీరు, ఉడకబెట్టిన యాపిల్ పండ్లను తీసుకుంటున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలియజేసాయి.
ఆమెకు అపోలో హాస్పిటల్ లో లండన్‌కు చెందిన వైద్యుడు రిచర్డ్ బీలే, ఎయిమ్స్ డాక్టర్ల వైద్యంతో పాటు, సింగపూర్‌కు చెందిన మరో ఇద్దరు వైద్యనిపుణులు కూడా ఫిజియోథెరపీ చేస్తొన్నారు.
ఈ నేపథ్యంలో ఆమె మెల్లగా కోలుకోవడమే కాకుండా, చికిత్స అందిస్తున్న వైద్యులందరికీ, ఆమె కృతజ్ఞతలు కూడా తెలిపారని ఆస్పత్రివర్గాలు తెలియజేసాయి.
మరోవైపు. అమ్మ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ, ఆమె అభిమానులు, పార్టీ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా పూజలు కొనసాగిస్తున్నారు.
మొత్తానికి కొద్దిరోజులుగా తీవ్ర ఉత్కంఠను అనుభవిస్తున్న జయ అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు ఇది తీపి కబురని చెప్పవచ్చు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి