google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: ఈ సినిమాలో మాగాళ్ళే వుండరట!!

17, అక్టోబర్ 2016, సోమవారం

ఈ సినిమాలో మాగాళ్ళే వుండరట!!



ప్రయోగాత్మక చిత్రాలకు మారుపేరైన కోలీవుడ్లో  మగ పాత్ర అన్నదే లేకుండా పూర్తిగా స్త్రీ పాత్రలతోనే రెండు గంటలకుపైగా నిడివి కలిగిన సినిమా   రాబోతోంది.!

 సీనియర్‌ దర్శకుడు తులసీదాస్‌  ‘తిరైక్కు వరాద కథై’ అనే ఈ చిత్రాన్ని  తెరకెక్కించారు. పూర్తిగా స్ర్తీ పాత్రలతోనే ఇప్పటి వరకు భారతీయ సినీ పరిశ్రమలో ఏ చిత్రమూ రాలేదు. ఒక్క ఫ్రేమ్‌లో కూడా మగ పాత్ర అన్నదే కనపడకుండా కథ, స్ర్కీన్‌ప్లే రాయడం అనేది ఆశ్చర్యం  కలిగించే విషయమే.

 హాస్టల్‌లో ఉంటూ చదువుకునే అమ్మాయిల మానసిక ఘర్షణ, వారి మధ్య ఏర్పడే సంబంధాలను గురించి ఈ చిత్రంలో చూపించనున్నారు. కామెడీ, సస్పెన్స, థ్రిల్లర్‌, హారర్‌, రొమాన్స్, ఇలా అన్ని రకాల షేడ్స్‌ ఈ చిత్రంలో ఉంటాయని దర్శకుడు తెలిపాడు. సీనియర్‌ తార నదియ కథలో చాలాకీలకమైన పోలీసు అధికారి పాత్రలో నటించింది.

 ఈ ప్రయోగాత్మక చిత్రం దీపావళికి రిలీజ్ కానున్నట్టు తెలుస్తొంది. తమిళంతోపాటు తెలుగు, కన్నడ భాషల్లోను డబ్బింగ్‌ చేసే ఆలోచన ఉందని, అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నామని దర్శకుడు చెప్పారు.

ఇలాంటి సంచలానాత్మక చిత్రాలు ఈమధ్య కాలంలో రాలేదు కాబట్టి, ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి