google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: 'హిల్లరీ డ్రగ్స్ తీసుకుంది '!!

16, అక్టోబర్ 2016, ఆదివారం

'హిల్లరీ డ్రగ్స్ తీసుకుంది '!!




 డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ మధ్య మాటల యుద్ధం వ్యక్తిగత విమర్శల స్థాయి కూడా దాటిపోయి, ఓ రేంజ్ లో ఓటర్లకు, ఏహ్యభావాన్ని, ఒకింత వినోదాన్ని కూడా పంచుతోంది.

 లైగింక వేధింపుల భాదితులు ఒక్కొక్కరే ఆ విషయాలు బయటపెడుతుండటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ట్రంప్ తాజాగా హిల్లరీపై 'డ్రగ్స్' అస్త్రం ప్రయోగించాడు!.

తమ మధ్య జరిగిన రెండవ బిగ్ డిబేట్‌లో హిల్లరీ డ్రగ్స్ తీసుకుని పాల్గొన్నట్టు ట్రంప్ ఆరోపించాడు. చివరి డిబేట్‌లో పాల్గొనే ముందు తమ ఇరువురికీ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించాలని ట్రంప్ సూచించాడు. శనివారంనాడు ఓ ర్యాలీలో పాల్గొన్న ట్రంప్ ఈ విషయాలను ప్రస్తావించాడు.

'అథ్లెట్లకు డ్రగ్ పరీక్షలు నిర్వహించినట్టే, డిబేట్‌కు ముందు మా ఇద్దరికీ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించాలి' అని ట్రంప్ వ్యాఖ్యానించాడు. డ్రగ్స్ తీసుకున్నందువల్లే, డిబేట్‌ ప్రారంభం నుంచి హిల్లరీ రెచ్చిపోయిందనీ, డిబేట్ ముగిసిన తర్వాత ఆమె అతికష్టం మీద కారు వద్దకు చేరుకోగలగిందని ట్రంప్ అన్నాడు. .

 ట్రంప్ శనివారం జరిగిన ప్రచార ర్యాలీలోనూ హిల్లరీ ఆరోగ్యంపై మరిన్ని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చివరి డిబేట్‌కు మరో ఐదు రోజులు ఉన్నందున, ఆమె రెస్ట్ తీసుకోవడం మంచిదని, లేకుంటే డిబేట్‌లో పాల్గొనడం కూడా ఆమెకు కష్టమైపోతుందని వ్యంగ్యంగా అన్నాడు.

ఇలాంటి అభ్యర్థులు అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతూండటంతో, ప్రపంచ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి