ఉత్తర్ ప్రదేశ్తో బాటు మరో రెండురాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరోసారి అయోధ్య వివాదం తెరపైకి వచ్చింది.
వివాదస్పద అయోధ్య భూమి ముమ్మాటికి భగవాన్ శ్రీరాముడికి చెందినదేనని కేంద్ర మంత్రి ఉమాభారతి అన్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదని సోమవారం ఓ ప్రెస్ మీట్ లో ఆమె స్పష్టం చేశారు.
యూపీ అసెంబ్లీ ఎన్నికల సర్వే ఫలితాలు అటు ఇటు గా వుండటంతో. విజయం కోసం బీజేపీ, వివాస్పద అంశమైన అయోధ్యను మరోసారి తెరపైకి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది.
కాగా అయోధ్య సమీపంలోని 25 ఎకరాల్లో శ్రీరామునికి సంబంధిన ఓ మ్యూజియాన్ని నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది.
ఉత్తర ప్రదేశ్‌లోని మిగిలిన పార్టీలు బీజేపీ తీరుపై మండిపడుతున్నాయి. ఈనేపథ్యంలో అయోధ్యభూమి శ్రీరాముడిదేనని కేంద్ర మంత్రి ఉమాభారతి వ్యాఖ్యానించడం ఓటర్లను ఆకట్టుకోవడం కోసమేనని ఆరోపిస్తున్నాయి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి