google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: ఇద్దరు నేతలకీ క్లాస్ పీకిన ఉండవల్లి

17, అక్టోబర్ 2016, సోమవారం

ఇద్దరు నేతలకీ క్లాస్ పీకిన ఉండవల్లి



 ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని, అలాగే రాష్ట్ర పునర్విభజనచట్టంలోని అంశాలను  అమలు చేయించేకోలేని దుస్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నారని  మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ విమర్శించాడు.

హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టించిన జగన్ కనీసం ఓటింగ్‌ కూడా పెట్టించలేక పోయారని ఆరోపించాడు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కేంద్రానిదేనని పునర్విభజన చట్టంలో స్పష్టంగా ఉందని, దానిని అమలు చేయించుకోవడం పక్కన పెట్టి, ప్రభుత్వం  ఎత్తిపోతల పథకాలపై దృష్టి సారించడం తగదని సూచించారు.

ఈ సందర్భంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ, స్వచ్ఛంద ఆదాయ ప్రకటన అనేది పూర్తిగా గోప్యంగా ఉంచాల్సిన అంశమని, దీనిపై అధికార, ప్రతిపక్ష పార్టీలు అనవసర రాద్దాంతాలు చేసుకుంటూ ప్రజా సమస్యలను పక్కన పెడుతున్నాయని అరుణ్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనిపై కేంద్రం వెంటనే స్పందించి, రూ.10వేల కోట్లు నల్లదనం వెల్లడించిన వారి పేరు బయటపెట్టాలని,  లేదా, రహస్యంగా ఉంచాల్సిన వివరాలు వెల్లడించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాడు.

 ప్రస్తుతం తాను ఏ పార్టీలోనూ లేనని ఆయన స్పష్టం చేశాడు. జగన్‌ కంటే చంద్రబాబు పాలనాఅనుభవం కలిగిన వ్యక్తి కావడంతో ఆయన ముఖ్యమంత్రి అయితేనే నవ్యాంధ్ర అభివృద్ధి చెందుతుందని తాను ఎన్నికల సమయంలో అభిప్రాయపడినట్లు ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి