భారత్ పాక్ ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత పరిస్థితులలో, పాక్ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన ఏ దిల్ హై ముష్కిల్ సినిమాను నాలుగు రాష్ట్రాల్లో విడుదల చేయరాదని థియేటర్ యాజమానుల సంఘం, ఎగ్జిబిటర్ల సంఘం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో, నిర్మాత దర్శకుడు అనురాగ్ కశ్యప్ ప్రధాని మోదీని టార్గెట్ చేశాడు.
కరణ్ జోహార్ సినిమాను రిలీజ్ కాకుండా అడ్డుకోవడం తగదంటూ మోదీని ఉద్దేశించి ట్వీట్ చేశాడు. అంతేకాకుండా లాహోర్ వెళ్లినందుకు, ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని కోరాడు.
సినిమాలను నిషేధించడం ద్వారా దేశ సమస్యలను పరిష్కరించడం ఎలాగో ప్రపంచం మననుంచే నేర్చుకోవాలంటూ కశ్యప్ ఎద్దేవా చేశాడు.
కానీ కశ్యప్ ట్వీట్లపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేక వ్యక్తమౌతోంది. పరమ చెత్త సినిమాలు తీసినందుకు ముందుగా దేశానికి కశ్యప్ క్షమాపణలు చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. మోదీ లాహొర్ వెళ్ళడం తప్పైతే, చెత్త సినిమాలు చూపినందుకు, తమ డబ్బు తమకు తిరిగి ఇవ్వాలని కోరారు.
ప్రతి దానికీ ప్రధానిని టార్గెట్ చేస్తూ, కశ్యప్ మరో అరవింద్ కేజ్రీవాల్‌లా మారారని నెటిజన్లు విమర్శలు గుప్పించారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి