జనతాగ్యారేజ్ ఫేం, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఓ పాతకేసు విషయంలో మళ్ళీ చిక్కుల్లో పడ్డాడు..
2011లో మోహన్‌లాల్ ఇంటి వెనుక ఏనుగు దంతాలు దొరికాయి. దీంతో మోహన్‌లాల్‌కు, ఆ స్మగ్లింగ్‌కు సంబంధాలున్నట్లుగా అప్పట్లో పోలీసులు అనుమానించారు.
ఎమ్మెల్యే,ఒకప్పటి అటవీ శాఖా మంత్రి రాధాకృష్టన్‌తో మోహన్‌లాల్‌కు వున్న సాన్నిహిత్యం కారణంగా మోహన్‌లాల్‌కు బహుమతిగా ఏనుగు దంతాలను పంపించినట్లు పోలీస్ విచారణలో తేలింది. దీంతో అప్పట్లో రాధాకృష్ణన్‌పై ఛార్జిషీట్ నమోదైంది. మోహన్‌లాల్‌పై వన్యజంతు సంరక్షణచట్టం కింద కేసు నమోదయినప్పటికీ, ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఇప్పుడు మళ్ళీ ఈ వ్యవహారంపై ఏఎఫ్. ఫౌల్స్ అనే యువకుడు కోర్ట్ లో పిటిషన్ వేయడంతో, మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. ఈ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు వెంటనే విచారణ చేపట్టాల్సిందిగా విజిలెన్స్ శాఖకు, ఏసీబీకి ఆదేశాలు జారీ చేసింది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి