బ్రతికుండగా వేట సంగతి ఏమో గానీ, చనిపోయాక కృష్ణజింకల ఆత్మలు సల్మాన్ ఖాన్ ని వేటాడ్డం ఇప్పట్లో అపేటట్టు లేదు.
కృష్ణ జింకల వేటకేసులో బాలీవుడ్ నటుడు, సల్మాన్ ఖాన్ చుట్టూ మళ్లీ ఉచ్చు బిగుసుకుంటోంది.!
1998లో ఓ సినిమా షూటింగ్‌లో సల్మాన్ వన్యప్రాణులను వేటాడినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఏడాది జులై 25న సల్మాన్‌పై కేసులను కొట్టివేస్తూ రాజస్థాన్ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
సల్మాన్‌ను నిర్దోషిగా హైకోర్టు ప్రకటించిన నేపథ్యంలో, రాజస్థాన్ ప్రభుత్వం ఈ కేసుపై సుప్రీం కోర్టులో మరోసారి స్పెషల్ లీవు పిటిషన్ దాఖలు చేసింది.
18 ఏళ్ళ పాటు కోర్టుల చుట్టూ తిరిగి, కేసుల్నుంచి బయటపడ్డానన్న ఆనందం కొద్ది నెలల్లోనే ఆవిరవడంతో సల్మాన్ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినట్టైంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి