సంచలనాత్మక విజయాన్ని సాధించిన బాహుబలి లో ప్రదానపాత్రలో నటించే అవకాశాన్ని కోల్పోయిన జాబితాలో తాజాగా మంచు లక్ష్మి కూడా చేరింది!
శివగామి పాత్రకు సంబంధించి ఈ ఆసక్తికర విషయం స్వయంగా లక్ష్మి చెప్పడంతో వెలుగులోకి వచ్చింది. ఈ పాత్ర చేయడానికి రమ్యకృష్ణను అడగటానికి ముందు మంచులక్ష్మిని చేయమని రాజమౌళి అడిగారట. అయితే ప్రభాస్‌కు తల్లిగా చెయ్యడమనే విషయం ఫన్నీగా తోచడంతో మంచు లక్ష్మి తిరస్కరించిందట.
మంచు లక్ష్మి తర్వాత ఈ ఆఫర్ శ్రీదేవీ, టబుల వరకూ వెళ్ళినా పలు కారణాల వల్ల.. చివరికి రమ్యకృష్ణకు ఆ పాత్ర చేసే బంపర్ అవకాశం దక్కింది.
శివగామి పాత్ర బాహుబలి లో ఎంత సెన్షేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ క్యారెక్టర్ చేసుంటే, లక్ష్మి ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో ఉండేదని సినీ అభిమానులతో పాటుగా, మంచు లక్ష్మి కూడా అనుకునివుండొచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి