దేశమంతా ఉత్సాహ ఆనందాలతో, దీపావళి పండుగ చేసుకుంటుంటే, వర్మ తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపాడు. ప్రతీసారి వెరైటీగా గ్రీటింగ్స్ చెప్పే వర్మ ఈ దీపావళికి కూడా అలానే చేశాడు.
ఐ విష్ ఎ వెరీ అన్‌హ్యాపీ దివాళి అంటూ తన ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు. అంతేకాకుండా, అస్తమా, క్రోనిక్ పల్మనరీ వ్యాధుగ్రస్తుల పరిస్థితిని మరింత విషమంగా మార్చుతుందని దీపావళి ని వర్మ అభివర్ణించాడు.
ఇదే సందర్భంగా వర్మ పలు ఆసక్తికరమైన ట్వీట్లు చేశాడు. " నరకాసురుడు ఏమి చేసాడో తెలియకపోయినా, అతని చావుని సెలబ్రేట్ చేసుకుంటున్న అందరికి, పిల్లలు, జంతువులు భయపడేలా కాలుష్యాన్ని సృష్టిస్తున్న వారికి, పెద్ద పెద్ద శబ్దాలతో ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేసే అందరికీ దీపావళి శుభాకాంక్షలు" అని వర్మ తన అభిప్రాయాన్ని తెలియజేసాడు.
వర్మ శుభాకాంక్షల్ని అతని అభిమానులు మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. అందరిలా వుంటే 'వర్మ ' ఎందుకవుతాడు?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి