మామూలుగా అయితే క్రికెట్ లో బౌలర్లు కుడి లేదా ఎడమ ఏదో ఒక చేత్తోనే బౌలింగ్ వేస్తుంటారు.
కానీ, పాకిస్థాన్ యువ పేసర్ యాసిర్ జన్ మాత్రం డిఫరెంట్ గా తన రెండు చేతులతోనూ పేస్ బౌలింగ్ చేస్తూ, క్రికెట్ ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్నాడు. సాధారణంగా జన్ కుడిచేతి బౌలరే. ఈ చేత్తో గంటకు 145 కిమీ వేగంతో బంతులు విసరగలడు. అలాగే ఎడమ చేత్తో కూడా 135 కిమీ స్పీడుతో బౌలింగ్ చేయగలగడం అతని స్పెషాలిటీ.
యాసిర్ ఈ ప్రత్యేక ప్రతిభతో క్రికెట్ ప్రపంచంలో సంచలనంగా మారాడు. గతంలో కొందరు స్పిన్నర్లు ఇలాంట్ రేర్ ఫీట్ ప్రదర్శిoచినా, వెలుగులోకొచ్చిన వారందరూ స్పిన్నర్లే.
శ్రీలంక స్పిన్నర్ కమిందు మెండీస్, భారత్ లో విదర్భ క్రికెటర్ అక్షయ్ కర్నేవార్ కూడా రెండు చేతులతో బౌలింగ్ చేయగల సమర్థులే. కానీ రెండు చేతులతో పేస్ బౌలింగ్ చేయగలిగిన తొలి క్రికెటర్‌గా యాసిర్ రికార్డులకెక్కాడు.
క్రికెట్‌లో ఫలానా చేత్తోనే బౌలింగ్ చేయాలనే నిబంధనైతే లేదు. అయితే మారే ముందు అంపైర్‌కు సమాచారం చెబితే సరిపోతుంది. మునుముందు యాసిర్ తన ప్రతిభ తో ఎలాంటి రికార్డులు నెలకొల్పుతాడో చూడాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి