రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు, ప్రజాసంఘాలు, అధికారుల ఫోన్లను ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందని వైకాపా అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశాడు.
ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రభుత్వ రాజకీయ, ఆర్థిక కార్యకలాపాల్లో జరుగుతున్న అవినీతిని ఎవరూ ప్రశ్నించకుండా అణిచివేసేందుకే ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్నాడని భూమన పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు, అదే అస్త్రాన్ని ప్రతిపక్షాలపై ప్రయోగించడం దారుణమన్నారు.
ఇలాంటి ప్రజ వ్యతిరేక విధానాల్ని ధైర్యంగా ఎదుర్కొంటామని ఆయన చెప్పాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి