google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: శామ్‌సంగ్‌ ఇక 4జీ మాత్రమే

20, అక్టోబర్ 2016, గురువారం

శామ్‌సంగ్‌ ఇక 4జీ మాత్రమే



 దాదాపు 80 శాతం భారతీయ స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు 4జీ సేవలకు మారిపోవడంతో, ఇక నుంచి తాము 4జీ ఫోన్లను మాత్రమే విదల చేయనున్నట్టు శామ్‌సంగ్‌ ఇండియా ఉన్నతాధికారి మను శర్మ వెల్లడించాడు.

గురువారం ఆయన కోల్‌కతాలో మాట్లాడుతూ, స్మార్ట్‌ఫోన్ల ఉత్పత్తిని పెంచేందుకు నొయిడాలోని ప్లాంట్‌ అభివృద్ధికి రూ.2వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు తెలిపాడు.

భారత స్మార్ట్‌ఫోన్‌ విపణిలో శాంసంగ్ కు 48.6శాతం వాటా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా నోట్ 7 అమ్మకాలను పూర్తిగా నిలివేసినట్టు కూడా ఆయన చెప్పాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి