కేబినెట్ సమావేశాల్లో మొబైల్ ఫోన్లను నిషేధించారు! ఇకపై నిర్వహించే కేబినెట్ సమావేశాలకు హాజరయ్యే మంత్రులు ఎవరూ మొబైల్ ఫోన్లను తీసుకురాకూడని కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో) ఓ సర్క్యులర్ జారీ చేసింది.
మంత్రివర్గం తీసుకునే కీలక సమాచారం ఏదీ బయటకు పొక్కకూడదనే నిర్ణయంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిసింది. సర్జికల్ దాడుల అనంతరం కేంద్ర మంత్రివర్గ సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలు శత్రువులకు చేరకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర నిఘావిభాగం సూచించింది. కేబినెట్ భేటీల్లో పాల్గొనే మంత్రుల సెల్‌ఫోన్లను హ్యాకర్లు వినే ప్రమాదముందని తెలపడంతో, ఈ హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ముఖ్యంగా పాకిస్థాన్, చైనా హ్యాకర్లు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలు వెబ్‌సైట్లను హ్యాక్ చేసి సమాచారాన్ని తస్కరించిన విషయం, వెల్లడైనట్లు తెలిసింది.
సెల్‌ఫోన్‌లపై నిషేధం విధించడం భారతలో ఇదే తొలిసారి. బ్రిటన్ ఇటీవలే మంత్రులు గడియారాలు, ఫోన్లను కేబినెట్ సమావేశాలకు తీసుకురాకుండా నిషేధం విధించింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి