భారత్ లో చైనా వస్తువులను బహిష్కరించాలని తద్వారా ఆ దేశంపై ఆర్ధిక ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చిన బాబారాందేవ్, పాక్ లో పతంజలి వ్యాపార లావాదేవీలను మాత్రం ఆపేది లేదని చెప్పాడు.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన, పాక్ లో పతంజలి ద్వారా సంపాదించిన డబ్బును భారత్ కు తీసుకురావాలని అనుకోవడంలేదని, అక్కడ సంపాదించిన సొమ్మును పాక్ ప్రజల సంక్షేమానికే ఖర్చుపెడుతున్నానని, తనను తాను వెనకేసుకొచ్చాడు.
చైనా వస్తువులను కొనకపోవడం వల్ల చైనాకు ఆర్ధిక ఇబ్బందులు వచ్చి, పాక్ కు సహాయం చెయ్యలేందనీ, అందుకోసం అంతా చైనా వస్తువులను బహిష్కరించాలని పిలునిచ్చిన రాందేవ్, మరి పాక్ లో పతంజలి ద్వారా వచ్చే డబ్బుతో పాకిస్థాన్ కు టాక్సులు కట్టి, ఆ దేశానికి ఆదాయం వచ్చేలా చేయడాన్ని మాత్రం సమర్థించుకుంటున్నాడు.
ఇదే సందర్భంగా ఆయన మాట్లాడుతూ "కళాకారులు తీవ్ర వాదులు కాదు కానీ హిందీ సినిమాల్లో నటిస్తోన్న వారికి మాత్రం మనస్సాక్షి అనేదే లేదనీ.. వాళ్ల ఆరాటమంతా ఎంతసేపు డబ్బులు సంపాదించడం, బిర్యానీ తినడం గురించే ఉంటుందనీ, యూరీ ఉగ్రదాడిలో మన సైనికులు చనిపోతే వారంతా ఎందుకు ఖండించలేదు" అని బాలీవుడ్ సినీ పరిశ్రమను ప్రశ్నించాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి