google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: డిసెంబర్ 2016

6, డిసెంబర్ 2016, మంగళవారం

జయలలిత ఇకలేరు!




లక్షలాదిమంది అభిమానులుల్ని శోకసంద్రంలో ముంచెత్తుతూ పురిచ్చితలైవి శాస్వతంగా అస్తమించారు.

తమిళనాడు ముఖ్యమంత్రి, అమ్మగా కోట్లాదిమందిచే ఆరాధించబడే జయలలిత నిన్నరాత్రి 11.30గం. లకు మరణించారు.

75 రోజులుగా చెన్నై అపోలో హాస్పిటల్ లో మృత్యువుతో పోరాడిన జయ, చివరికి విధికి తలొంచారు.

జయలలిత పార్థివదేహానికి ఈ సాయంత్రం 4.30గం.లకు మెరీనాబీచ్ దగ్గర, తమిళప్రియతమ నేత, మాజీ సీయం, జయకు రాజకీయ గురువైన యం.జీ.ఆర్. సమాధి ప్రక్కనే అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

జయలలిత మృతికి పలువురు రాజకీయ, సినీరంగ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేసారు.

5, డిసెంబర్ 2016, సోమవారం

రాహుల్ గాంధీకి జణగణమన తెలుసా..?




కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై  బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.

రాహుల్ గాంధీ భారతీయతపై తనకు ఎటువంటి సందేహం లేదనీ..  అయితే రాహుల్ భారత జాతీయగీతం పాడుతుండగా చూడాలని ఉందన్నారు.

అసలు రాహుల్‌కు అందులో పదాలు కూడా తెలుసో? లేదో? తనకు సందేహంగా ఉందంటూ అనుపమ్ ఖేర్ సరదాగా అనారు.

చేతులెత్తేసిన డాక్టర్ రిచర్డ్స్!




తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు అపోలోలో ముందునుంచీ ప్రత్యేక  చికిత్సలు చేస్తున్న ఇంగ్లాండ్ వైద్యుడు రిచర్డ్స్ బీలే చేతులెత్తేశారు.

అపోలో వర్గాల కోరికపై లండన్ నుంచి ఈరోజు మధ్యాహ్నం వచ్చిన ఆయన, తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు.

జయ పరిస్థితి చాలా విషమంగానే ఉందని అయితే అందుబాటులో ఉన్న అన్ని రకాల వైద్య సేవలు ఆమెకు అందిస్తున్నట్లు మీడియాకు విడుదల చేసిన ఆ ప్రకటనలో పేర్కొన్నారు వివరించారు. అన్ని విభాగాలకు చెందిన నిఫుణులైన డాక్టర్ల బృందం నిరంతరం జయలలిత ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు బీలే వివరించారు.

ఆదివారం సాయంత్రం  గుండెపోటుకు గురైన జయలలిత ప్రస్తుతం లైఫ్ సపోర్టింగ్ సిట్టమ్‌‌పై ఉన్నారు. ఆమె ఆరోగ్యం మెరుగు కోసం ఆమె అభిమానులు చేస్తున్న పూజలు ఫలించాలని ఆయన ఆకాక్షించారు. స్వయానా వైద్యుడే పూజల పేరు ప్రస్థావించడంతో ఆయన కూడా జయ ఆరోగ్యంపై చేతులెత్తేశారని అనుకుంటున్నారు.

జయకు సీరియస్!



ఆరొగ్యం కుదుటపడి, నేడో రేపో ఆసుపత్రి నుంచి డిస్చార్జ్ అవుతుందని ఆశగా ఎదురుచూస్తున్న అమ్మ అమ్మ అభిమానులకు దుర్వార్త..

ఐ.సీ.యూ..నుంచి గత కొద్ది రోజులుగా సాధారణ వార్డులో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు గుండెపోటు వచ్చినట్టు అపోలో హాస్పిటల్ వర్గాలు తెలియజేసాయి.

ఆమెకు నిన్న సాయంత్రం హార్ట్ స్ట్రోక్ వచ్చింది. జయను హుటాహుటిన అత్యవసర చికిత్సావిభాగంలోకి మార్చి, నిపుణులైన వైధ్య బృందంచేత చికిత్స చేస్తున్నారు.

లండన్ వైద్యుడు డాక్టర్‌ రిచర్డ్‌ బీలే, ఢిల్లీ ఎయిమ్స్‌ వైద్యులు వెంటనే అందుబాటులో వుండాలని కోరినట్ట్లు ఆసుపత్రి వర్గాలు తెలియజేసాయి.

తాజా పరిస్థితుల వల్ల, తమిళనాడు మొత్తం ఆందోళణ పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు అపోలో వద్దకు చేరుకుంటున్నారు. అదనపు పోలీసు బలగాలను రాష్ట్రంలోని సున్నితమైన ప్రాంతాల్లో మొహరించారు.

4, డిసెంబర్ 2016, ఆదివారం

వర్మ బస్తీమే సవాల్!!



వంగవీటి సినిమాపై తనకు వస్తున్న బెదిరింపులకు లొంగే ప్రసక్తేలేదని డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తేల్చిచెప్పాడు.

ఈ సినిమాపై వస్తున్న వివాదాలకు పుల్ స్టాప్ పెట్టేందుకు కొడాలి నాని మధ్యవర్తిగా నిన్న వంగవీటి రాధ ఫ్యామిలీతో జరిగిన చర్చలు సంతృప్తికరంగా జరగలేదని వర్మ తెలియజేసాడు. పైగా తనకు నవ్వుతూ వార్నింగ్ ఇచ్చారని, అయితే ఇలాంటి వార్నింగ్ లు ఎన్నో చూశానని, వంగవీటి కుటుంబం చెప్పిన మార్పులను తాను అంగీకరించనని వర్మ కుండలుబద్దలు కొత్తినట్టు ట్విట్టర్ లో వ్యాఖ్యానించాడు.

కాగా మరో వర్గం నేత దేవినేని నెహ్రూ మాత్రం వర్మతో సానుకూలంగా స్పందించాడు. దర్శకులకు తన సినిమాను తన ఇష్టం వచ్చినట్టు తీసుకునే హక్కు వుందని ఆయన చెప్పాడు.

బాలకృష్ణ భార్య వద్ద రూ.10 లక్షల పాత నోట్లు!!



రేణిగుంట విమానాశ్రయంలో నిన్న ఉదయం అధికారులు తనిఖీలు చేస్తుండగా నటుడు, హిందూపూరం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర వద్ద రూ.10 లక్షలు పాత నోట్లు లభ్యమయ్యాయి.

వసుంధర, తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు  హైదరాబాదు నుంచి స్పైస్‌జెట్‌ విమానంలో రేణిగుంటకు చేరుకున్నపుడు ఈ సంఘటన చోటుచేసుకుంది.

విమానాశ్రయంలో సీఐఎస్‌ఎఫ్‌ బృందం తనిఖీలు చేసినప్పుడు ఆమె వద్ద ఆ నగదు ఉన్నట్లు గుర్తించారు. శ్రీవారి హుండీలో వెయ్యడానికి నగదును తీసుకొచ్చినట్లు ఆమె చెప్పారు. ఆదాయపన్ను శాఖ ఇచ్చిన ధ్రువీకరణ పత్రాలను చూపడంతో అధికారులు పరిశీలించి వదిలేశారు. 

ఫకీర్ పది లక్షల సూటు తొడుక్కుంటాడా..?



ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రధాని మోదీపై ధ్వజమెత్తాడు.

మోదీ ప్రతిరోజూ.. నాలుగు కొత్త జతల బట్టలు తొడుక్కుంటాడనీ, పది లక్షల విలువ చేసే సూటును వేసుకుని ప్రపంచదేశాలు చుట్టివస్తారని, మరి ఇలాంటి వ్యక్తిని  ప్రజలు ‘ఫకీర్‌’గా ఎలా ఒప్పుకుంటారని కేజ్రీవాల్ విమర్శించాడు.

బంగారంపై కంగారు వద్దు!!




గత కొద్ది రోజులుగా బంగారంపై వస్తున్న వందతుల్లో ఎలాంటి నిజం లేదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేసాడు.

కొన్ని మీడియా సంస్థలు చెబుతున్నట్టు బంగారంపై ఎలాంటి ఆంక్షలు లేవని, దాడులు జరుగుతాయని కంగారు పడొద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎలాంటి వదంతులు నమ్మవద్దని ఆయన కోరారు.

వారసత్వంగా వచ్చిన బంగారం, కొనుగోలు చేసిన బంగారు నగలు జప్తు చేసుకుంటారన్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని వెంకయ్య చెప్పారు.

పెద్ద నోట్ల రద్దుతో కొందరు  కిలోల చొప్పున బంగారాన్ని అక్రమంగా కొనుగోలు చేశారని,  అలాంటి వారిపైన మాత్రం కచ్చితంగా చట్టపరమైన చర్యలుంటాయని పేర్కొన్నారు.

కొత్తగా రూ.20 నోటు!






 ఆర్‌బీఐ కొత్త 20 రూపాయల నోట్లను విడుదల చేయనున్నట్టు కొద్దిసేపటి క్రితం  ప్రకటించింది.

'ఎల్' అనే ఇంగ్లీషు అక్షరం కొత్త నోట్ల ఇన్‌సెట్‌‌లో ఉంటుంది. ఈ నోట్లపై ఆర్ బీ ఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం ఉంటుంది.

కాగా.. పాత రూ.20 నోట్లు యథాతథంగా చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ తాజా ప్రకటనలో వెల్లడించింది.