తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు అపోలోలో ముందునుంచీ ప్రత్యేక చికిత్సలు చేస్తున్న ఇంగ్లాండ్ వైద్యుడు రిచర్డ్స్ బీలే చేతులెత్తేశారు.
అపోలో వర్గాల కోరికపై లండన్ నుంచి ఈరోజు మధ్యాహ్నం వచ్చిన ఆయన, తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు.
జయ పరిస్థితి చాలా విషమంగానే ఉందని అయితే అందుబాటులో ఉన్న అన్ని రకాల వైద్య సేవలు ఆమెకు అందిస్తున్నట్లు మీడియాకు విడుదల చేసిన ఆ ప్రకటనలో పేర్కొన్నారు వివరించారు. అన్ని విభాగాలకు చెందిన నిఫుణులైన డాక్టర్ల బృందం నిరంతరం జయలలిత ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు బీలే వివరించారు.
ఆదివారం సాయంత్రం గుండెపోటుకు గురైన జయలలిత ప్రస్తుతం లైఫ్ సపోర్టింగ్ సిట్టమ్‌పై ఉన్నారు. ఆమె ఆరోగ్యం మెరుగు కోసం ఆమె అభిమానులు చేస్తున్న పూజలు ఫలించాలని ఆయన ఆకాక్షించారు. స్వయానా వైద్యుడే పూజల పేరు ప్రస్థావించడంతో ఆయన కూడా జయ ఆరోగ్యంపై చేతులెత్తేశారని అనుకుంటున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి