రేణిగుంట విమానాశ్రయంలో నిన్న ఉదయం అధికారులు తనిఖీలు చేస్తుండగా నటుడు, హిందూపూరం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర వద్ద రూ.10 లక్షలు పాత నోట్లు లభ్యమయ్యాయి.
వసుంధర, తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు హైదరాబాదు నుంచి స్పైస్‌జెట్ విమానంలో రేణిగుంటకు చేరుకున్నపుడు ఈ సంఘటన చోటుచేసుకుంది.
విమానాశ్రయంలో సీఐఎస్‌ఎఫ్ బృందం తనిఖీలు చేసినప్పుడు ఆమె వద్ద ఆ నగదు ఉన్నట్లు గుర్తించారు. శ్రీవారి హుండీలో వెయ్యడానికి నగదును తీసుకొచ్చినట్లు ఆమె చెప్పారు. ఆదాయపన్ను శాఖ ఇచ్చిన ధ్రువీకరణ పత్రాలను చూపడంతో అధికారులు పరిశీలించి వదిలేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి