గత కొద్ది రోజులుగా బంగారంపై వస్తున్న వందతుల్లో ఎలాంటి నిజం లేదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేసాడు.
కొన్ని మీడియా సంస్థలు చెబుతున్నట్టు బంగారంపై ఎలాంటి ఆంక్షలు లేవని, దాడులు జరుగుతాయని కంగారు పడొద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎలాంటి వదంతులు నమ్మవద్దని ఆయన కోరారు.
వారసత్వంగా వచ్చిన బంగారం, కొనుగోలు చేసిన బంగారు నగలు జప్తు చేసుకుంటారన్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని వెంకయ్య చెప్పారు.
పెద్ద నోట్ల రద్దుతో కొందరు కిలోల చొప్పున బంగారాన్ని అక్రమంగా కొనుగోలు చేశారని, అలాంటి వారిపైన మాత్రం కచ్చితంగా చట్టపరమైన చర్యలుంటాయని పేర్కొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి