google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: సెప్టెంబర్ 2021

15, సెప్టెంబర్ 2021, బుధవారం

Weight Loss With Fennel Seeds బరువుని తగ్గించే సోంపు వాటర్

 


బరువుని తగ్గించే సోంపు వాటర్  



 దాదాపు ప్రతీ ఇంటిలో సోంపు గింజల్ని ఉపయోగిస్తూనే ఉంటారు.  శరీర బరువును తగ్గించడానికి కూడా సోంపు ఉపయోగపడ్తుంది. 

సోంపును సాధారణంగా భోజనం తర్వాత మౌత్ ఫ్రెషనర్ గా ఇంకా, జీర్ణక్రియ సాఫీగా జరిగేందుకు తీసుకుంటాం. నిజానికి దీనిని రోజులో ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు. ఇది ఆస్తమా, ఉదర సంబంధ ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

 సోంపుతో బరువు ఎలా తగ్గుతుంది?

సోంపు లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్, మినరల్స్‌ అధికంగా ఉంటాయి. ఇవన్నీ కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి. తద్వారా బరువు తగ్గడానికి సహాయపడతాయి. అంతే కాకుండా ఇవి జీర్ణక్రియ, జీవక్రియలో సహాయపడతాయి. ఇంకా ఆకలిని కూడా తగ్గిస్తుంది.

ఉదయాన్నే ఒక గ్లాసు సోంపు నీరు తాగడం వల్ల కడుపు నిండిన భావన వస్తుంది. దీంతో ఎక్కువ ఆహారాన్ని తీసుకోవాలనే కోర్కె తగ్గుతుంది.

సోంపు వాటర్

ఒక టీస్పూన్ సోంపు గింజలను తీసుకుని, ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టుకోవాలి. ఈ నీటిని పరగడుపున ఉదయం నిద్ర లేవగానే తాగడం వల్ల మంచి ప్రయోజనం వుంటుంది.

సోంపు జీవక్రియను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో సోంపు వాటర్ తీసుకుంటే చాలా మంచింది.

సోంపులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటి ఉదయాన్నే తీసుకుంటే ఎక్కువ సేపు ఆకలి కాకుండా ఉంచుతుంది. ఎక్కువగా తినకుండా  నిరోధిస్తుంది. దీంతో శరీర బరువు కచ్చితంగా తగ్గుతుంది.

ఫెన్నెల్ ఒక సహజ డిటాక్సిఫైయర్. అందువల్ల భోజనం చేసిన వెంటనే దీనిని తీసుకుంటే బాగా పనిచేస్తుంది. ఇది మన శరీరం నుంచి అనేక టాక్సిన్‌లను తొలగిస్తుంది. 

సోంపులో జింక్, భాస్వరం, మాంగనీస్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. ఇది ఊబకాయంతోపాటు ఇతర వ్యాధులు రాకుండా కాపాడుతాయి.

ఎస్ట్రాగోల్, ఫెంచాన్, అనెథోల్ వంటివి సోంపులో ఉంటాయి. ఇవి తిన్న ఆహారం చక్కగా జీర్ణం కావడంతో సహాయపడుతాయి. 

సోంపు నీరు తాగడం వలన శరీరంలో ఉండే అదనపు నీరు తొలగిపోతుంది. 


11, సెప్టెంబర్ 2021, శనివారం

వత్తిడి ని తగ్గించే 5 మార్గాలు

 

వత్తిడి ని తగ్గించే 5 మార్గాలు 





ఆహారం:



 మంచి ఆహారం కూడా వత్తిడి ని తగ్గిస్తుంది. బలమైన ఆహారం మన మెదడును చురుగ్గా వుండేలా చస్తుంది. 

ఆహారం వల్ల శరీరం మొత్తం యాక్టివ్ అవుతుంది. ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. 

ముఖ్యంగా విటమిన్లు, మినరల్స్, పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. బ్యాలెన్స్డ్ డైట్ వల్ల టెన్షన్ తగ్గే అవకాశం వుంటుంది.

విశ్రాంతి తీసుకోవాలి:



వరుసగా పనులు చేస్తూ ఉన్నాగానీ వత్తిడి పెరుగుతుంది. అందువల్ల దృష్టిని మరల్చుకోవాలి. పనిలో కాస్త బ్రేక్ తీసుకోవాలి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వార్తలకు దూరంగా ఉండాలి. పాజిటివ్ ఆలోచనలు పెంచుకోవాలి. పనిచసే మధ్య మధ్య పజిల్స్, బోర్డ్ గేమ్స్ ఆడుతుండాలి. ప్రకృతిలో తిరగాలి. ఓ కొత్త పుస్తకం చదవాలి. లేదా నచ్చిన వ్యాపకాన్ని చెయ్యాలి. 

వ్యాయామం:



వ్యాయామం అనేది ఒత్తిడిని జయించేందుకు తిరుగులేని అస్త్రంగా చెప్పుకోవచ్చు. వాకింగ్, రన్నింగ్, మెట్లు ఎక్కడం, దిగడం, పిల్లలతో ఆటలు, సైక్లింగ్, పెంపుడు జంతువులతో ఆటలు, శరీరాన్ని కదిలించే చిన్న చిన్న ఎక్సర్‌సైజ్‌లు కూడా ఒత్తిడిని జయించేలా చెయ్యగలవు. వ్యాయామం చేసినప్పుడు బాడీలో ఎండోర్ఫిన్స్ రిలీజ్ అవుతుంది, ఇది పాజిటివ్ ఫీలింగ్స్‌ని పెంచుతుంది. 

మానవ సంబంధాలు:



 వీలైనప్పుడల్లా అందరితో కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నించాలి. ఫ్రెండ్స్‌తో మాట్లాడాలి. అభిప్రాయాలు షేర్ చేసుకోవాలి. 

సన్నిహితులతో సమస్యల్ని పంచుకోవడం ద్వారా సాంత్వన లభిస్తుంది. 

వీలైనంత ఒంటరిగా లేకుండా ప్రకృతితో గడపాలి. స్వచ్ఛమైన గాలిని పీల్చాలి. ఓకే చోట ఎక్కువసేపు ఉండకూడదు

తగినంత నిద్ర:



ఒత్తిడికి అనేక కారణాల్లో ఒకటి నిద్ర లేమి. ఆరోగ్యంగా వుండాలంటే మనం రోజుకు కనీసం 6 గంటలు పడుకోవాలి. అలాగే, విశ్రాంతి కూడా తీసుకోవాలి. మంచి నిద్ర వల్ల శరీరంలో అన్ని అవయవాలు  ఎనర్జీ లెవెల్స్ పెంచుకుంటాయి. బ్రెయిన్ బాగా పనిచేసి, పాజిటివ్ ఆలోచనలు పెరుగుతాయి. అందువల్ల  ఒత్తిడిని చాలా వరకూ తగ్గించుకోవచ్చు.

10, సెప్టెంబర్ 2021, శుక్రవారం

సుఖనిద్ర కోసం కొత్త పరికరం! Sleep Aid Device

 


 


 సుఖనిద్ర కోసం కొత్త పరికరం! 

https://draft.blogger.com/blog/post/edit/4450771144974125185/8484826717378697715




ప్రస్తుత ప్రపంచంలో  నిద్రలేమి సమస్యతో ఎన్నో కోట్ల మంది బాధపడుతున్నారు. మానసిక ఆందోళన, లేదా రాత్రి పూట  మొబైల్ ఫోన్ ని ఎక్కువగా వినియోగిస్తుండటం కారణంగా నిద్ర అనేది కరువైపోతోంది.   

దీనికి పరిష్కారంగా  జర్మన్ శాస్త్రవేత్తలు  ఓ కొత్త పరికరాన్ని  కనుగొన్నారు. 

మైక్రో–కరెంట్‌ స్మార్ట్‌ హిప్నాసిస్‌ ఇస్ట్రుమెంట్‌ అనే పరికరాన్ని శాస్త్రవేత్తలు హైటెక్నాలజీతో రూపొందించారు. 

ఈ పరికరం ముఖ్యంగా తగినంత నిద్ర లేకుండా బాధపడేవారికి ఎంతగానో సహాయపడుతుంది. ఒత్తిడిని తగ్గించి  నిద్రపుచ్చేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. 

ఎలా పని చేస్తుంది?

ఈ డివైజ్‌ని చేతితో పట్టుకుని, రిలాక్స్‌డ్‌గా కళ్లు మూసుకుంటే చాలు., మెదడులోని కండరాలను ఉత్తేజపరచి, నిద్రపోయేలా చేస్తుంది. 

ఈ డివైస్  చాలా మరియు  తేలికైనది కూడా.  

మైక్రో–కరెంట్‌ స్మార్ట్‌ హిప్నాసిస్‌ ఇస్ట్రుమెంట్‌  ని సులభంగా ఆపరేట్‌ చేసుకోవచ్చు. దీనిలో వర్కింగ్‌ మోడ్స్‌ ని కూడా అమర్చారు. తీవ్రతను పెంచడానికి లేదా తగ్గించడానికి ప్లస్‌ మైనస్‌ బటన్స్‌ కూడా ఉంటాయి.

ఈ స్లీప్‌ ఎయిడ్‌ పరికరాన్ని కార్యాలయాల్లో, ఇంట్లో, వ్యాపార పర్యటన ప్రాంతాల్లో ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. 

సుమారు 15 నిమిషాలు వాడితే, తలనొప్పి, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను కూడా నివారిస్తుందని చెబుతున్నారు.

ఈ డివైస్  చేతికి బ్రేస్‌లెట్‌లా వేసుకోవచ్చు. 

ధర ఎంత?

దీని ధర సుమారు 30 డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీ లో సుమారు రూ. 2,200 వరకు ఉంటుంది.

సరైన నిద్ర లేకపోవడం వల్ల వచ్చే అనేక రోగాలనుండి ఈ పరికరం కాపాడుతుందని నిపుణులు భావిస్తున్నారు. 


6, సెప్టెంబర్ 2021, సోమవారం

ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ కోసం Digestive System

 


ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ కోసం 

https://draft.blogger.com/blog/post/edit/4450771144974125185/3033167543883383103


Digestive System

 ఆధునిక ప్రపంచంలో జీవనశైలిలో వచ్చిన పెను మార్పులవల్ల, పూర్తిగా మారిపోయిన ఆహారపు అలవాట్ల వల్ల చాలామందిలో జీర్ణ వ్యవస్తకు సంబంధించిన అనేక సమస్యలతో భాదపడ్తున్నారు.  

ప్రతిఒక్కరూ రుచికరమైన ఆహారం కోసమని ముందువెనుక ఆలోచించకుండా జంక్ ఫుడ్ లాంటివి తింటూ సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు.

 జీర్ణవ్యవస్థ పనితీరు సరిగా లేకపోతే ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఆహారం కొద్దిగా తిన్నాగానీ గ్యాస్ట్రిక్, అజీర్తి, కడుపు నొప్పి, కడుపులో మంట లాంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. 

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం ప్రతి ఒక్కరు తేలిగ్గా పాటించగల పద్దతులను కొన్ని ఉన్నాయి . వాటి గురించి తెలుసుకుందాం.

* ఫైబర్ పదార్థాలు



పళ్లు, తృణధాన్యాలు, కూరగాయలు లాంటి ఫైబర్ ఎక్కువ పదార్థాలున్న ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరును పెంచుకోవచ్చు. వాటివల్ల సులభంగా జీర్ణ ప్రక్రియ జరుగుతుంది. ఇవి మలబద్ధకం, అతిసారం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలను నివారిస్తాయి.

* ఆహారాన్ని నమలడం 



మనలో చాలామంది ఆహారాన్ని సరిగ్గా నమలరు. దీంతో ఆ పదార్థాలు అరగడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ఆరోగ్య కరమైన జీర్ణ వ్యవస్థ కోసం మీరు ఆహారాన్ని మెత్తగా నమలాలి. అప్పుడే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.

* ఆరోగ్యకరమైన జీవనశైలి



మన జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాటు చేసుకోవాలి. ధూమపానం, మద్యపానం లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.  కంటికి ఇంపుగా కనిపించింది కదాని వేళాపాళా లేకుండా ఆహారాన్ని భుజించకూడదు.

* మాంసాహారాన్ని తగ్గించాలి



జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే మాంసాహారానికి దూరంగా ఉండటం మంచిది.  మరీ అంతగా తినాలని వున్నపుడు కొవ్వులు ఎక్కువ లేకుండా ఉండే మాంసం తినాలి.  సాధారణంగా మాంసాహారంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది ఇది మలబద్ధకానికి దారి తీస్తుంది. మటన్ కంటే చికెన్ కాస్త బెటర్ 

*  తగినంత నీరు తప్పనిసరి



ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ కోసం తరచూ నీరు తాగుతుండాలి. ప్రేగు కదలికలను మెరుగుపరచడంలో నీరు ప్రభావవంతంగా పనిచేస్తుంది.  ఉబ్బరం, మలబద్ధకం సమస్యలను తగ్గించడంలో నీరు చాలా ఉపయోగపడుతుంది.

5, సెప్టెంబర్ 2021, ఆదివారం

సూపర్ ఫీచర్స్‌తో వన్‌ప్లస్ ఇయర్ బడ్స్ ప్రో One Plus Ear Buds

  సూపర్ ఫీచర్స్‌తో వన్‌ప్లస్ ఇయర్ బడ్స్ ప్రో

https://draft.blogger.com/blog/post/edit/4450771144974125185/5123147394543264994




వన్‌ప్లస్ తన ఇయర్‌బడ్స్ బడ్స్ ప్రోని విడుదల చేసింది. 

ఆగస్టు 26 నుండి ప్రోడక్ట్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. 

ప్రస్తుతానికి వైట్, మాట్టే బ్లాక్ కలర్ ఎంపికలలో వన్‌ప్లస్ బడ్స్ ప్రో లభిస్తోంది. వీటి ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం..

నాయిస్ రిడక్షన్!

ఈ ఇయర్ బడ్స్ లో ప్రత్యేకత నాయిస్ రిడక్షన్. అంటే కేవలం కాల్స్ లో వాయిస్, ప్లే అవుతున్న పాటలు తప్ప, ఇతర రకాల శబ్దాలు ఏవీ వినిపించవు. ఎటువంటి శబ్దాలనూ వినిపించానీయదు.  అందువల్ల సంగీతం, కాల్స్ లో స్పష్టత వుంటుంది. 

ఇది మూడు మోడ్‌లతో వస్తుంది..  ఎక్స్‌ట్రీమ్, ఫెంట్ ,స్మార్ట్.  ఇయర్ బడ్స్ 25ద్భ్ వరకు శబ్దాన్ని అదుపుచేస్తాయి. 

ఇది కాకుండా, బడ్స్‌లో ఇచ్చిన స్మార్ట్ మోడ్ ఆటోమేటిక్‌గా చుట్టుపక్కల సౌండ్‌ను తగ్గిస్తుంది.

కాలింగ్ కోసం, ప్రీసెట్ మోడ్‌తో వచ్చే మూడు మైక్రోఫోన్‌లు వాటిలో అమర్చారు. ఈ ప్రీసెట్ మోడ్‌లు సాఫ్ట్‌వేర్ అల్గోరిథంల సహాయంతో అవాంఛిత శబ్దాన్ని తగ్గిస్తాయి. 

బడ్స్ ప్రోతో వచ్చే ఛార్జింగ్ కేసు ఈఫ్X4 రేటింగ్‌తో వస్తుంది, కనుక కొంత వరకు వాటర్ ప్రూF గా ఉంటుంది. అదే సమయంలో, ఈఫ్55 రేట్ కలిగిన బిల్డ్ నాణ్యత కారణంగా, ఇది డస్ట్ ప్రూఫ్ గా కూడా వుంటుంది.

వన్ ఫ్లుస్ బడ్స్ ప్రో ప్రత్యేక ఫీచర్లు   

బడ్స్ ప్రో సౌండ్ కోసం 11మ్మ్ డైనమిక్ డ్రైవర్లతో వస్తుంది. ఆడియో నాణ్యతను అందించడానికి, కంపెనీ డాల్బీ అట్మోస్ సపోర్త్ తో వస్తోంది. 94 ఎంఎస్ లటెన్సీ రేటు వల్ల ఈ ఇయర్‌బడ్‌లు గేమింగ్‌కు గొప్పగా ఉంటాయి. 

 ఈ ఇయర్ బడ్ బ్యాటరీకి 38 గంటల బ్యాకప్ ఉంటుంది. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో, ప్రతి ఇయర్‌బడ్‌ల బ్యాటరీ 10 గంటల వరకు చార్జింగ్ ఉంటుంది, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది.

 ఓనెఫ్లుస్ తన వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లకు మొదటిసారిగా జెన్ మోడ్‌ని జోడించింది.

ధర ఎలా వుంది 

ఇండియాలో  ఇయర్ బడ్స్ ధరను కంపెనీ 9990 రూపాయలుగా నిర్ణయించింది.  

ఆగస్టు 26 నుండి కంపెనీ తన అమ్మకాలను ప్రారంభించింది. వినియోగదారులు అమెజాన్ ఇండియాతో పాటు, ఒన్ ప్లస్  అధికారిక వెబ్‌సైట్, వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్ నుండి ఓనెఫ్లుస్ బడ్స్ ప్రోని కొనుగోలు చేయవచ్చు. 


కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే...How to protect kidney

 


కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే...


https://draft.blogger.com/blog/post/edit/4450771144974125185/7383240282812072058


 కిడ్నీలు జీర్ణ వ్యవస్థ నుంచి వచ్చే వ్యర్థాలను, అదనపు ద్రవాలను బయటకు పంపిస్తాయి. రక్తపోటు, ఎలక్ట్రోలైట్‌ స్థాయిలను నియంత్రిస్తాయి. ఎర్రరక్తకణాలను ఉత్పత్తి చేస్తూ ఆరోగ్యకరమైన ఎములకు భరోసా ఇస్తాయి. 

అయితే  కిడ్నీల విషయంలో అజాగ్రత్తగా ఉండటం వల్ల ప్రతి సంవత్సరమూ ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారు.

ఇండియాలో ప్రతి సంవత్సరంల రెండున్నర లక్షల మంది వరకు కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అలాగే ప్రతి ఏటా మూడున్నరకోట్ల మందికి డయాలసిస్‌ చేయాల్సి వస్తోంది. ఖిడ్నీ సమస్యలతో మరణించేవారి సంఖ్య కూడా వేలల్లో ఉంటొంది.

ముఖ్యంగా మహిళలైతే పని ధ్యాసలో పడి కిడ్నీల విషయాన్ని మర్చిపోతున్నారు!

‘ది లాన్సెట్‌ గ్లోబల్‌ హెల్త్‌’ నివేదిక ప్రకారం.. మన దేశ జనాభాలో 10 శాతం మంది దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నారని ఈ నివేదిక ద్వారా తెలుస్తోంది. వీటన్నింటికి కారణం మనం కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకోకపోవడమే.

ప్రస్తుతమున్న పరిస్థితుల్లో  కిడ్నీకి సంబంధించిన వ్యాధులతో పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. 

తినే ఆహారం, అధిక ఒత్తిడి, మానసిక ఆందోళన తదితర కారణాల వల్ల చలామందిలో కిడ్నీలు ఫైల్యూర్ అవుతున్నాయి.

కిడ్నీ సమస్యను గుర్తించడం ఎలా..?

మూత్రం రంగు మారినా, మూత్రం అసాధారణంగా ఉన్నా, కాళ్లవాపు బాగా ఉన్నా కిడ్నీ సమస్య ఉన్నట్లే గుర్తించాలని నిపుణులు చెబుతున్నారు. 

కిడ్నీలు పూర్తిగా చెడిపోతే రుచి సామర్థ్యం, ఆకలి బాగా తగ్గిపోతుంది. అలసట, తరచుగా వికారం రావడం, వాంతులు చేసుకోవడం లాంటివి జరుగుతుంటాయి. 

కిడ్నీల పనితీరు తగ్గితే ఎర్రరక్తకణాల ఉత్పత్తి మీద ఎఫెక్ట్‌ పడుతుంది. మెదడుకు సంబంధిత ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి.  

కిడ్నీలు ఉండే భాగంలో నొప్పిగా ఉంటూంది.  

కిడ్నీలో ఇన్‌ఫెక్షన్లు, రాళ్ళు ఏర్పడటం జరుగుతాయి.  

ఇలాంటి లక్ష్ణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మంచిది.

కిడ్నీ సమస్యకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

* రోజుకు 7 నుంచి 8 గ్లాసుల నీటిని తప్పకుండా తాగాలి

* క్యాప్సికంలో ఉండే విటమిన్‌ A, C, పోటాషియం తదితర పోషకాలు కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచేందుకు ఉపయోగపడతాయి.

* నిత్యం వెల్లుల్లిని ఏదో ఒక రూపంలో తీసుకుంటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.

* బెర్రీలలో ఫైబర్‌, విటమిన్లు ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. శరీరంలో ఉండే మలినాలు బయటకు పోయేలా చేస్తాయి. వీటిని తరచూ తీసుకుంటూ ఉండాలి. 

* ఓట్స్‌, కాలిఫ్లవర్‌, ఉల్లిపాయలు, పైనాపిల్స్‌ కూడా కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.

* మూత్రం వచ్చినపుడు వెంటనే వెళ్లాలి. లేకపోతే కిడ్నీపై ప్రభావం చూపుతుంది.




4, సెప్టెంబర్ 2021, శనివారం

చెడు కొలెస్ట్రాల్‌‌‌కు ఇంజెక్షన్ రూపంలో సరికొత్త ఔషధం..

Cholesterol Drug

 

 


చెడు కొలెస్ట్రాల్‌‌‌కు ఇంజెక్షన్ రూపంలో సరికొత్త ఔషధం.. 

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ప్రస్తుతం స్టాటిన్స్ అనే ఔషధాన్ని ఇస్తుంటారు. అయితే దీనిని తరచూ తీసుకోవాల్సి వుంటుంది. కానీ కొత్తగా వచ్చిన ఓ ఔషదం  సంవత్సరానికి రెండుసార్లు తీసుకుంటే సరిపోతుంది.

శరీరంలోని చెడు కొలస్ట్రాల్ తో భాదపడ్తున్న రోగులకు  ఓ గుడ్‌న్యూస్ వచ్చింది.

ఇంజెక్షన్ రూపంలో అందుబాటులోకి వచ్చిన  ఈ మెడిసిన్‌తో చెడు కొలెస్ట్రాల్‌ బాధితులకు విముక్తి లభించే అవకాశం వుందని  నిపుణులు పేర్కొంటున్నారు. 

దీనికి ‘ఎక్లిసిరెన్’ అని పేరు పెట్టారు. అయితే ఈ ఇంజెక్షన్‌ను సంవత్సరానికి రెండుసార్లు తీసుకోవాలి. దీనిని యూకే ఆరోగ్య సంస్థ ఎన్‌హెచ్‌ఎస్ బుధవారం నుంచి ప్రారంభించింది. నిపుణులు దీనిని ‘గేమ్ చేంజింగ్’ ట్రీట్మెంట్ గా పేర్కొంటున్నారు.

కొత్త ఇంజెక్షన్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది..

ఈ కొత్త ఇంజెక్షన్ వల్ల చెడు కొలెస్ట్రాల్50 శాతంవరకు తగ్గిపోతుంది.

రక్త నాళాలలో కొవ్వు ఎక్కువగా పెరుకుపోయినపుడు స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ధమనులకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. 

 చెడు కొలెస్ట్రాల్‌తో ఇబ్బంది పడే వారు ప్రతీ 6 నెలలకు ఎక్లిసిరిన్ ఇంబెక్షన్ వేసుకోవాల్సి ఉంటుంది. దీనివలన తరచూ తీసుకునే కొలెస్ట్రాల్ మెడిసిన్  నుంచి  ఉపశమనం లభించనుంది. కొత్త ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత రోగులలో కొలెస్ట్రాల్ 50 శాతం వరకు తగ్గుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

 ఇది గుండె జబ్బులను నిరోధించి, ప్రాణాలను కాపాడేందుకు ఎంతో  ఉపయోగకరంగా వుంటుందని తెలుస్తోంది.   ఈ కొలెస్ట్రాల్ ఇంజెక్షన్‌ స్టాటిన్స్ కంటే చాలా ప్రభావవంతమైనది. కొన్ని కారణాలతో మెడిసిన్ తీసుకోలేని వారు కూడా ఈ ఇంజెక్షన్‌ను వేసుకోవచ్చు.

ఇంజెక్షన్ ఎలా పనిచేస్తుంది..

ఈ ఇంజెక్షన్‌ PCSK9 అనే ప్రోటీన్‌ను నిరోధించడం ద్వారా కాలేయం, రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. PCSK9  ప్రోటీన్ కారణంగా శరీర అవయవాలు కొలెస్ట్రాల్‌ను తొలగించలేకపోతుంటాయి. కొత్త ఇంజెక్షన్‌తో ఈ ప్రోటీన్‌ను అడ్డుకోవడం చాలా సులభం. 

దీనివలన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గడంతో, వ్యాధులు సంభవించే ప్రమాదం కూడా తగ్గుతుంది.

ఇంజెక్షన్‌ ధర..

ఒక ఇంజెక్షన్ ఖరీదు దాదాపు రూ .2 లక్షలు వుండొచ్చని అనుకుంటున్నారు . దీనిని సంవత్సరానికి రెండుసార్లు చేసుకోవాల్సి ఉంటుంది.  అంటే ఏటా దాదాపు రూ .4 లక్షలు ఇంజెక్షన్‌ల కోసం చెల్లించాల్సి ఉంటుంది.


3, సెప్టెంబర్ 2021, శుక్రవారం

వెల్లుల్లితో ఉపయోగాలు Garlic Ayurveda




Garlic-Ayurveda

 వెల్లుల్లితో ఉపయోగాలు

వంటల్లో మాత్రమే కాదు. ఆరోగ్యాన్ని అందించడంలో కూడా వెల్లుల్లికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. 

వెల్లుల్లి మొత్తం శరీరంలోని 22 రకాల వ్యాధులనుంచి రక్షణ ఇస్తుంది. అతి ప్రాచీనమైన ఆయుర్వేద గ్రంథాలలో వెల్లుల్లి ప్రస్తావన ఉంది.

 వెల్లుల్లిలో ఔషధ గుణాలు చాలా ఎక్కువ.   ప్లేగు వ్యాధిని తగ్గిస్తుంది. కొవ్వుని కరిగిస్తుంది. అలాగే కడుపులోని చెడు బ్యాక్టీరియాని నాశనం చేస్తుంది. కోలెస్టరాల్‌ని,  కేన్సర్ ను అదుపులో వుంచుతుంది. అధిక రక్త పోటుని నివారిస్తుంది. ఇంకా వెల్లుల్లి జీర్ణశక్తిని పెంచుతుంది. 

 ఇక ఆస్తమా, శ్వాస పీల్చుకోవడం వల్ల ఇబ్బంది వంటి రుగ్మతలను తగ్గించడానికి వెల్లుల్లి చక్కగా ఉపయోగపడుతుంది. నోటి వ్యాధులకు వెల్లుల్లి బాగా పనిచేస్తుంది.  సుగర్ వ్యాధిగ్రస్తుల రక్తంలో చక్కెరస్థాయిలను నియంత్రిస్తుంది.  

వెల్లుల్లిలో అనేక పోష‌కాలు ఇంకా ఔష‌ధ గుణాలు ఉంటాన్నాయి.  

ఇలా ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు పొందాలంటే వెల్లుల్లిని ఏ విధంగా తీసుకోవాలో తెలుసుకుందాం.

రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే రెండు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను నేరుగా అలాగే నమిలి తిన‌వ‌చ్చు.

ఉదయాన్ని పరగడుపున వెల్లుల్లి ర‌సం తాగ‌వ‌చ్చు.

పచ్చిగా తినలేనివారు  వెల్లుల్లి రెబ్బలను కాల్చి తినవచ్చు.

పెనం మీద కొంచెం నెయ్యి వేసి, అందులో వెల్లుల్లి వేయించి తినవచ్చు.

వెల్లుల్లి కషాయంలా చేసుకుని తాగవచ్చు. ముందుగా  రెండుమూడు వెల్లుల్లి రెబ్బ‌లు  తీసుకుని నీటిలో  మ‌రిగించి ఆ నీటిని రోజుకు 2 సార్లు క‌ప్పు మోతాదులో తాగ‌వ‌చ్చు.

ఇలా వెల్లుల్లిని ఏదో ఒక రూపంలో తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.  

చెడు కొలెస్ట్రాల్ తగ్గి, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది.

వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు స‌మృద్ధిగా ఉంటాయి. అందువ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

లివర్ సమస్యలున్నారు వెల్లుల్లి తింటే ఎంతో మంచిది.

వెల్లుల్లిని తిన‌డం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

ఎముక‌లు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి.

 వెల్లుల్లి  టాబ్లెట్స్ రూపంలో కూడా మార్కెట్ లో లభిస్తున్నాయి.  రోజూ తినే ఆహారంలో వెల్లుల్లిని ఏదొక రూపంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా జీవించవచ్చు.


సామ్‌సంగ్‌ కొత్త 5జీ స్మార్ట్‌ ఫోన్‌ Samsung Galaxy A52s 5G


https://draft.blogger.com/blog/post/edit/4450771144974125185/587239385056141826


 సామ్‌సంగ్‌ కొత్త 5జీ స్మార్ట్‌ ఫోన్‌

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ సామ్‌సంగ్‌ తాజాగా మార్కెట్లోకి గ్యాలక్సీ A52S పేరుతో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా వున్నాయి.

సామ్‌సంగ్‌ గెలాక్సీ A52S 5జీ పేరుతో లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ ఓ డిస్‌ప్లే అందించారు. 

ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ దీని ప్రత్యేకత.

A52S 6జీబీ ర్యామ్ + 128జీబీ, 8జీబీ ర్యామ్ + 128జీబీ వేరియంట్లలో అందుబాటులోవుంటుంది. 

మైక్రో ఎస్‌డీ కార్డుతో 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు.

కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 64 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్‌ కెమెరాను అమర్చారు. 

ఈ ఫోన్‌లో 25 వాట్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్ట్‌ చేసే 4,5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై నడుస్తుంది. 

6జీబీ ర్యామ్ + 128జీబీ వేరియంట్ ధర రూ.35,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ వేరియంట్ ధర రూ.37,499గా నిర్ణయించారు. 

శాంసంగ్ A52s  5G స్మార్ట్‌ ఫోన్‌ సేల్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. 



2, సెప్టెంబర్ 2021, గురువారం

బిట్​కాయిన్​ అంటే ఏంటి? ఎలా పని చేస్తుంది? WHAT IS CRYPTOCURRENCY AND BITCOIN?



what is cryptocurrency, about bitcoin


 WHAT IS CRYPTOCURRENCY AND BITCOIN

బిట్​కాయిన్​ అంటే ఏంటి? ఎలా పని చేస్తుంది?

ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా హాట్​టాపిక్​గా మారిన అంశాల్లో బిట్​కాయిన్ కూడా ఒకటి.  దీని విలువ రోజురోజుకు కొత్త రికార్డు స్థాయిను తాకుతోంది.  2007లో ప్రారంభమైన బిట్‌కాయిన్ ప్రస్థానం అనేక హెచ్చుతగ్గులకు లోనై అంతిమంగా దీని విలువ పెంచుకుంటూ వస్తోంది. 

ఆశ్చర్యకరంగా  2020లో దీని విలువ 170% మేర పెరిగింది. ప్రస్తుతం బిట్ కాయిన్ విలువ 2021 ఏప్రిలో 56,267 డాలర్ల వద్ద ఉంది. అంటే భారతీయ కరెన్సీలో దాదాపు 43 లక్షల రూపాయలు,

ఈ క్రిప్టోకరెన్సీకి ఎందుకు ఇంత డిమాండ్​? బిట్​కాయిన్​లో పెట్టుబడి సురక్షితమేనా? బిట్​కాయిన్ వ్యవస్థ ఎలా పని చేస్తుంది? దీనిని ఎవరైనా నియంత్రిచగలరా? అనే విషయాలను తెలుసుకుందాం.

బిట్‌కాయిన్‌ అనేది ఒక వర్చువల్‌ కరెన్సీ. దీనిపై ఏ ప్రభుత్వ నియంత్రణ ఉండదు. ఈ కరెన్సీని ఏ బ్యాంకు జారీ చేయదు. ఇది ఏ దేశానికి చెందిన కరెన్సీ కాదు కాబట్టి దీనిపై ట్యాక్స్‌ అనేది ఉండదు. 

క్రిఫ్టో కరెన్సీ అనేది కాగితాలు లేదా నాణేల భౌతికరూపంలో వుండదు 
ఇది పూర్తిగా డిజిటల్ కరెన్సీ మాత్రమే.

బిట్‌కాయిన్‌ అనేది కంప్యూటర్‌లో దాచుకునే ఒక ఫైల్‌ లాంటిది. స్మార్ట్‌ఫోన్‌ లేదా కంప్యూటర్‌లలో డిజిటల్‌ వాలెట్‌ రూపంలో దాచుకోవచ్చు. 

గత ఏడాది డిసెంబర్​లోనే తొలిసారి 20 వేల డాలర్ల మార్క్​ దాటిన బిట్​కాయిన్, రెండు నెలల్లోనే 45 వేల డాలర్లపైకి చేరడం విశేషం.

నిజానికి చాలామందిలో  క్రిప్టోకరెన్సీపై అనేక అనుమానాలు వున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. క్రిప్టోకరెన్సీ అనేది డిజిటల్​ (వర్చువల్) కరెన్సీ.  సాధారణ కరెన్సీలు (రూపాయి, డాలర్​ వంటివి) భౌతికంగా చలామణి అవుతుంటాయి. క్రిప్టో కరెన్సీలు మాత్రం భౌతికంగా కనిపించవు, వాటిని ముట్టుకోలేం. ఇవి ప్రత్యేక సాఫ్ట్​వేర్​ కోడ్​ల ద్వారా పని చేస్తుంటాయి. ఇవి పూర్తిగా డిజిటల్​ రూపంలో మాత్రమే ఉంటాయి. 

బిట్​కాయిన్​ జపాన్​కు చెందిన 'షాతోషీ నాకామోటో' అనే టెకీ రూపొందించినట్లు ప్రచారంలో ఉంది. అయితే దీనిపై స్పష్టత లేదు. 2009లో బిట్​కాయిన్​ మనుగడలోకి వచ్చింది.

బ్లాక్​ చైన్​ సాంకేతికత అనేది క్రిప్టోకరెన్సీకి మూలాధారాం. ప్రస్తుతం బిట్​కాయిన్​, ఇథీరియం, స్టెల్లార్, రిపుల్, డాష్​​ ఇలా చాలా ఇతర క్రిప్టోకరెన్సీలు మనుగడలో వున్నాగానీ.. వీటన్నింటిలో బిట్​కాయిన్​ అత్యంత ఆధరణ పొందిన క్రిప్టో కరెన్సీ.

క్రిప్టోకరెన్సీ ప్రస్తావన వచ్చినప్పుడు, లేదా బిట్కాయిన్ గురించి ప్రస్తావన వచ్చినపుడల్లా మనం చాలా సార్లు క్రిప్టోగ్రఫీ టెక్నిక్స్, బ్లాక్​ చైన్ సాంకేతికత గురించి వింటూనే ఉంటాము. బ్లాక్​చైన్​ అనేది డేటా బైస్​ ఆధారంగా పని చేసే ఓ ప్రత్యేక సాంకేతికత. ఇందులో సమాచారం అనేది బ్లాకులుగా విభజన చెందివుంటుంది. ఆ సమాచారం మొత్తం ప్రపంచవ్యాప్తంగా వేరువేరు సర్వర్లలో నిక్షిప్తమై ఉంటుంది. ఇలా ఒక సర్వర్​కు మరో సర్వర్​ అనుసంధానమై ఈ వ్యవస్థ పని చేస్తుంది. ఈ కారణంగా బ్లాక్ చైన్ రూపంలో నిక్షిప్తం చేసిన సమాచారాన్ని హ్యాక్ చెయ్యడం లేదా తస్కరించడం దాదాపు అసాధ్యం. ఈ కారణంగానే క్రిప్టోకరెన్సీలను ఎవరూ నియంత్రించడం జరగదు. అందుకే క్రిఫ్టో కరెన్సీ అనేది అత్యంత సురక్షితమనే వాదన కూడా ఉంది.

బిట్​కాయిన్ విలువ ఎందుకు అంతగా పెరుగుతోంది?గత పదేళ్ల వ్యవధిలో బిట్​కాయిన్ బెస్ట్ పెర్ఫార్మింగ్ అసెట్​గా నిలిచింది. ఇన్వెస్టర్లు దీన్ని ద్రవ్యోల్బణం నుంచి రక్షణ కోసం లావాదేవీలు ప్రారంభిస్తున్నారు.

చాలా కార్పొరేట్ సంస్థలు, సంస్థాగత పెట్టుబడిదారులు క్రిప్టోకరెన్సీలపై దృష్టిసారిస్తున్నారు. ఇన్వెస్ట్​మెంట్ పోర్ట్​ఫోలియోను వైవిధ్యంగా మార్చుకోవడం కోసం బిట్​కాయిన్లపై అధికంగా పెట్టుబడులు పెడుతున్నారు. బిట్​కాయిన్ మార్కెట్ ఇతర మార్కెట్లతో పోలిస్తే చాలా చిన్నది కాబట్టి బిట్​కాయిన్ విలువ ఎప్పుడూ స్థిరంగా ఉండదు. 

బిట్​కాయిన్​ పొందడం ఎలాగో తెలుసుకుందాం.

బిట్‌కాయిన్లను సృష్టించే ప్రక్రియను మైనింగ్‌ అంటారు. బిట్‌కాయిన్‌ మైనింగ్‌లో భాగంగా శక్తివంతమైన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి క్లిష్టమైన అల్లారిథమ్‌లను పరిష్కరించి లావాదేవీలను వెరిఫై చేస్తారు. మైనింగ్‌ చేసేవాళ్లు విజయవంతంగా ఈ ప్రక్రియలో గెలుపొందితే వారికి కొన్ని బిట్‌కాయిన్లను అందజేస్తారు.

ఎంతో క్లిష్టమైన క్రిప్టోగ్రఫీ సమస్యలను పరిష్కరించడం ద్వారా కొత్త బిట్​కాయిన్​లను రివార్డుగా పొందొచ్చు.  

బంగారం, వజ్రాల మారిదిగానే బిట్‌కాయిన్లు కూడా చలా పరిమితంగా లభ్యమవుతాయి. మరోవైపు ప్రజలు వీటిని కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అందువల్ల సరఫరా, డిమాండ్‌ సూత్రం ప్రకారం దీనికి గిరాకీ పెరుగుతోంది.

రూపాయికి 100 పైసలు ఎలానో.. ఒక బిట్​కాయిన్​కు 100 షాతోషీలు ఉంటాయి. ప్రస్తుతం బిట్​కాయిన్​ల విలువ భారీగా పెరిగిన కారణంగా ఒక బిట్​కాయిన్ కొనడం చాలా కష్టం. అలాంటి వారు షాతోషీలనూ లేదా, అందులో కొంత భాగాన్ని కొనుగోలు చేయడం ద్వారా కూడా పెట్టుబడి పెట్టొచ్చు.

ప్రభుత్వాల నియంత్రణ ఉండదు కాబట్టి కొంత మంది బిట్‌కాయిన్లను ఇష్టపడుతుంటారు. అన్ని లావాదేవీలు నమోదు అవుతాయి కాబట్టి వాటిని ఎవరు చేశారో బయటకు తెలియదు. తమ లావాదేవీల వివరాలు బయటకు తెలియకూడదు అనుకునేవారు బిట్‌కాయిన్ల వైపు మొగ్గు చూపుతున్నారు.

 క్రిప్టోకరెన్సీలపై ట్రేడింగ్ చేసేటప్పుడు ఎలాంటి నిబంధనలు, మార్గదర్శకాలు లేవు కాబట్టి ఏదైనా వివాదాలు తలెత్తితే.. ప్రభుత్వం నుంచి సహాయం లభించదు. కాబట్టి ఎలాంటి చట్టాలు అతిక్రమించకుండా  ట్రేడింగ్ చెయ్యడం ముఖ్యం.

భారత్​లో బిట్​కాయిన్ కొనుగోలు కొనుగోలు/అమ్మకానికి  పలు ఎక్స్ఛేంజీలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో వాజిర్ ఎక్స్, కాయిన్​స్విచ్, జెబ్​పే, కాయిన్​డీసీఎక్స్​ ముఖ్యమైనవి. 

ఈ ఎక్స్ఛేంజీల్లో ట్రేడింగ్ అక్కౌంట్ పొందిన తర్వాత  క్రిప్టోకరెన్సీలపై పెట్టుబడులు పెట్టొచ్చు.కానీ భారత్​లోని క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీలు ఏ ప్రభుత్వ నియంత్రణ ఫ్రేమ్​వర్క్ కిందకు రావు. భారత్​లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీటికి లైసెన్సులు సైతం అవసరం లేదు. ప్రస్తుతం ఇవన్నీ స్వీయ-నియంత్రణ సంస్థ ఫ్రేమ్​వర్క్​ అనుగుణంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.

బిట్​కాయిన్ ట్రేడింగ్ అకౌంట్ తెరిచేందుకు  క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీలన్నీ దాదాపుగా ఒకే తరహా సమాచారాన్ని సేకరిస్తాయి. బ్యాంక్ ఖాతా, కేవైసీ వివరాలతో పాటు మొబైల్ నెంబర్​తో బిట్​కాయిన్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. కేవైసీ వెరిఫికేషన్ కోసం ఆధార్ లేదా పాన్​ కార్డులలో ఏదైనా ఉపయోగించుకోవచ్చు. రిజిస్టర్డ్ బ్యాంక్ ఖాతా నుంచి నగదును ట్రేడింగ్ అకౌంట్​కు బదిలీ చేసుకోవచ్చు. 

భారత్​లో తమ బిట్​కాయిన్ పెట్టుబడి లాభాలపై క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ చెల్లించాలి. ఒకవేళ బిట్​కాయిన్ అమ్మకం, కొనుగోళ్లే ప్రధాన కార్యకలాపాలై ఉంటే, వ్యాపారాలపై విధించే పన్ను చెల్లించాల్సి ఉంటుంది.